జస్టిస్ చౌదరి - శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, చట్టానికి న్యాయానికి సమరంలో - ఎన్టీఆర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,438; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చూడండి ఈ సినిమా కూడా సంస్కార గుణ ప్రధానము తో ఉంటుంది. నీతి న్యాయం ధర్మం విలువలు ముందు, ఆ తర్వాతే బంధాలు స్నేహాలు బంధుత్వాలు. మరి బయట జీవితము లో అలా ఉండగలుగుతున్నామా?

అంటే నేతి బీరకాయ ఉదాహరణగా మిగులుతున్నాము. బీరకాయలో నెయ్యి, ఎంత ఎన్నేళ్ళు వెదికినా, కనపడదు. అంతా బ్రమ. అది మన ఇంట్లోనే మొదలు.

ధనవంతులు అయినా హోదా అధికారం ఉన్నా కూడా, గుణం మాత్రమే ముఖ్యమని, తమ కూతురు పెళ్ళి గురించి, ఎంత బాగా చెపుతున్నారో చూడండి - శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం, చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు అంటున్నారు.

వరుడు రామచంద్రుడు లాంటి వాడని, నెలవంకలిస్తాడని, ఆనందముతో నవ్వితే ఓ చుక్క బుగ్గలో వచ్చింది అని మధురము గా చెప్పారు. గుణం అనే అందము ఉన్న మంచి పిల్లకు, మేకప్పులు ఇతర అరువు తెచ్చుకున్న తాత్కాలిక పై పై పూతలు అవసరము లేదు, అని చాలా మర్యాదగా చెప్పారు - అందాలకెందుకు గంధాల పూతలు, కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు అన్నారు.

మా పిల్లకు కూడా, ఆస్తులు అంతస్తులు వీసాలు విదేశాలు పబ్బులు బార్లు మహేష్ పవన్ లు వద్దు, కేవలము సంతోషము గా చల్ల గా కంటికి రెప్పలా ప్రేమ గా చూసుకునే, బాధ్యత గల వరుడు చాలు అంటున్నారు - అడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని, అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని.

ఇక కర్తవ్య నిర్వహణ లో ఉంటే, అదీ తప్పు చేస్తే, కొడుకైనా అల్లుడైనా ఒకటే, శిక్ష తప్పదు అంటున్నారు, చేతలలో చూపిస్తారు. అందుకు ఇంట్లో వారు అలిగి నిష్టూరాలు ఆడితే, తన గుండెల్లో బాధను ఆవేశము గా చెప్పారు, నచ్చ చెప్పారు. అంతే గానీ ధర్మం తప్పలేదు. కడుపు తీపికి కట్టు బడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు అని గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పారు.

సత్యం కోసం హరిశ్చంద్రుడు, భార్యా పిల్లలను వదలాల్సి వచ్చింది. గర్భవతి సీతమ్మను రాముడు, కారడవికి పంపాల్సి వచ్చింది. కన్న తల్లినే కర్ణుడు, కాదనాల్సి వచ్చింది.

కాబట్టి సత్యం ధర్మం అంటే, అంత నిష్ట గా ఉండాలి సుమా. మరి ధర్మాన్ని కాపాడతాము అంటూ, అధర్మము చేస్తూ ఉంటే, ఇంక ధర్మాన్ని కాపాడేదెవరు? మరి మనకు అధర్మం జరిగేటప్పుడు, మనల్ని కాపాడేది ఎవరు?

మరి అలా ఈ రోజున, ఎంత మంది న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉంటున్నారు? వారు ఒకవేళ న్యాయము గా ఉండాలి అన్నా, ప్రజలు ఉండనిస్తున్నారా? మరలా నేతి బీరకాయ ఉదాహరణ అనవచ్చునా?

పట్టణ కోర్టులో చెప్పింది, జిల్లా కోర్ట్ లో చెప్పరు. అక్కడ ఓకే అన్నది, హైకోర్ట్ లో తప్పు, మరలా సుప్రీం కోర్ట్ లో కరెక్ట్ కావచ్చు అని, బొబ్బిలి పులి సినిమాలో న్యాయం ఎన్ని రకాలుగా మారుతుందో చీల్చి చెండాడారు డైలాగులద్వారా.

సినిమాకు డబ్బులు కట్టి, ఆవేశము గా ఆ మాటలు విని, ఉరుకులతో ఇంటికి వచ్చి, కడుపు నిండా తిని, టీవీలో మరలా బిగ్ బాస్ లో ఉన్న ఉత్తమ ధర్మం విలువలు సంస్కారం, సోషల్ మీడియాతో పరితపించే పిల్లలకు చూపించి, హాయిగా నిద్రపోతున్నాము. తెల్లారి మామూలే, ధర్మమా న్యాయమా, నీ అడ్రెస్ ఎక్కడా? అని వెతకాలిసిందే అంటున్నారు ప్రజలు.

1) చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టు బడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు
ఇది ఆ దైవమే... ఇచ్చిన తీర్పు, తప్ప.. తప్ప ...తప్ప.. Never..
I Am In The Hands Of Law, Anything Happenns, Its Not My Flaw

కఠినమైనది ధర్మం, కన్నులేనిది న్యాయం ..
మనసు లేనిది చట్టం .., మనిషి జన్మకిది ఖర్మం - మొత్తం 2
న్యాయమూర్త్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు ..
నాకు మీరు లేరు .., నేను నేను కాను .. 2
ఇది ఆ దైవమే.. ఇచ్చిన తీర్పు
తప్ప తప్ప ... No

సత్యం కోసం హరిశ్చంద్రుడు, సతీసుతుల నెడబాసినది
గర్భవతి సీతమ్మను రాముడు, కారడవికి పంపించినది
కన్న తల్లినే కాదని కర్ణుడు, రాజా త్యాగం చేసినది
కన్న కొడుకునే కాదని నేన్నీ, కన్నీటిని దిగమింగుతున్నది
ఎందుకోసం ఆ.. ఎందుకోసం ఆ..
దహించిన అది ధర్మం గనుక, సహించాలి అది సత్యం గనుక
కృశించిన.. నే నశించిన.. అది న్యాయం గనుక
ఆ న్యాయమే నా దైవం గనుక

చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టు బడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు
ఇది ఆ దైవమే... ఇచ్చిన తీర్పు

2) శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు ||శ్రీలక్ష్మి పెళ్లికి||

ఆ .... ఆ.....2
కనుబొమ్మలా నడుమ విరిగింది శివధనుసు, కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు 2
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని 2 పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు గంధాల పూతలు 2 కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు... ||శ్రీలక్ష్మి పెళ్లికి||

అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని, అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని
అడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని, అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో

మాటలకే అందని మనసు...చూపులతో తెలుసుకో...రెప్పవలే కాచుకో...||శ్రీలక్ష్మి పెళ్లికి|

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

Srilakshmi Pelliki Chirunavve Song

Justice Chowdary Movie Songs, NTR, Jayanti, Sridevi
జస్టిస్ చౌదరి మూవీ సాంగ్స్, ఎన్టీఆర్, జయంతి, శ్రీదేవి

Justice Chowdary Srilakshmi Pelliki Chirunavvu chattaniki nyayaniki NTR Jayanti Sridevi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,438; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964
Dt : 20-Jun-2022, Upd Dt : 20-Jun-2022, Category : Songs
Views : 590 ( + More Social Media views ), Id : 1434 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : justice , chowdary , srilakshmi , pelliki , chirunavvu , chattaniki , nyayaniki , ntr , jayanti , sridevi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content