వాక్ శుద్ది మరియు గాత్ర శుద్ది ఒకటేనా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,590; 104 తత్వాలు (Tatvaalu) and views 226,291.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జవాబు - వాక్సుద్ది అని కూడా రాస్తాము. 2 వేరు వేరు వర్గాలకు, విషయాలకు చెందినవి.

పెద్దలు, ఇందులో తప్పులు ఉంటే, సరిచేయండి. మనకు తెలిసిన వరకు తేడా చెపుతున్నాము. అన్ని మనకు తెలుసు అని కాదు, ఇతరులతో పంచుకుంటేనే, వారి నుంచి అమూల్యమైన జ్ఞాన రత్నాలను పంచుకోవచ్చు, మన జ్ఞానాన్ని సరి చేసుకోవచ్చు. ఆద్యాత్మిక సాధనలో ఇదే మొదటి మెట్టు.

ఇతరులు రాసినదాని లో 100 తప్పులు తేలికగా పట్టవచ్చును. కానీ మన సొంతముగా 100 తెలుగు మాటలు రాయలేనప్పుడు, మౌనమే మేలు, మన అజ్ఞానము బయట పడదు.

100 తెలుగు మాటలు రాయడం వచ్చిన వారు, ఇతరులు రాసినదానిని తప్పు పట్టరు. ఆ తప్పులను సరి చేసి, మార్గం చెపుతారు, చాటుగా, తోటి వాడు పైకి రావాలని.

వాక్సుద్ది, ఆధ్యాత్మికతకు దైవానికి త్రికరణ శుద్ది కి, సంబందించిన ఉత్తమ పెద్ద పదము. దానికి ఎన్నో నీతి నియమాలు కట్టుబాట్లు నిరతర సాధన ఉంటుంది. అంటే, మాట రాత నడత అన్ని కలవాలి, ప్రతి రోజూ. అరిషడ్వర్గాలను జయించాలి.

ఒక తపస్వి లా, దైవ ఉపాసకుని లా ఉండాలి, ప్రతి రోజూ ఉండాలి. ఇది చాలా మందికి కష్టము. ఇక్కడ స్పష్టమైన మాట ఉంటే చాలు, సంగీత రాగాలు మధురత్వము అవసరము లేదు.

కానీ గాత్ర శుద్ది, సంగీత ప్రపంచానికి సంబందించిన పదము. అక్కడ కూడా మరలా 2 రకాలు - సంగీతము వచ్చి గాత్ర శుద్ది ఉన్న వారు, సంగీతము రాకుండానే గాత్ర శుద్ది ఉన్న వారు. వీరికి కంఠము మధురముగా ఉండాలి, బాగా రాగాలు తీయగలిగి ఉండాలి.

ఉదాహరణకు, బాలు సంగీత విద్వాంసులు కాదు, కానీ దేవుడిచ్చిన గొంతు మాధుర్యమైనది. అలాగే, మనము టీవీలలో చూస్తున్న ఇతర గాయకులు. వీరి పాట/ గొంతు బాగుంటే చాలు, అందరు ఆకర్షింపబడతారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎటువంటి చెత్త పాటలు పాడటానికైనా వెనుకాడరు, సంపాదన పేరు మాత్రమే ముఖ్యం. ఇది అరిషడ్వర్గాల బానిసత్వం.

కానీ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అలాగే బాల మురళీక్రిష్ణ లాంటి వారు, సంగీతము లో కూడా ప్రసిద్దులు, అంటే సంగీతము మరియు స్వరము, 2 ఉన్న గొప్ప వారు. సంగీత ప్రపంచానికి రారాజులు. వీరు జనానికి లేదా సంగీతానికి లేదా దేవుని కి పనికి వచ్చే పాటలు తప్ప, చెత్త పాటలు పాడరు, వీరికి సంపాదన పేరు ముఖ్యం కాదు. ఇది అరిషడ్వర్గాల బానిసత్వం కిందకు రాదు.

సామాన్య జనానికి, వీరి గొప్ప తనము అర్ధము కాదు. వీరు నిజమైన సంగీత సరస్వతి విద్వాంసులు.

కాబట్టి, గాత్ర శుద్ది ఉన్న అందరికీ, రాత, నడత ఖచ్చితముగా, మంచి గా, నీతి నియమాలతో సంస్కారముతో, ఉండాలని ఎక్కడా లేదు. కేవలము గొంతు బాగుంటే చాలు.

మొన్న చూసాము కదా, ఒక గాయని, పాడుతుంది అన్నమయ్య గీతం, కానీ వీడియోలో వేషాలు మాత్రం, సంస్కారం లేనివి, సంబంధం లేనివి.

కాబట్టి జిల్లా అనేది దేశము లో భాగము అయినా, రెండూ ఒకటి కాదు, దేశము పెద్దది, ఇంకా ఎన్నో గొప్పలు తనలో ఇమిడి ఉంటాయి.

గాత్ర శుద్ది ఉన్నా, వాక్సుద్ది ఉన్నట్లు కాదు. అది కేవలం ఒక భాగం మాత్రమే అవుతుంది. వాక్సుద్ది ఉంటేనే అంటే త్రికరణ సుద్దిగా, మనసు మాట నడత సంస్కారముతో ఉంటేనే, దైవ చింతనకు, ఆధ్యాత్మిక ప్రగతికి, సాధకునిలా, వేగముగా మోక్షము వైపు అడుగులు పడతాయి. అందుకే సాధకులకు వాక్సుద్ది కావాలి.

అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, ఆది శంకరులు, బ్రహ్మం, వేమన, రాఘవేంద్ర, వాక్సుద్ది ఉన్నవారు.

దైవ నామానికి బలము ఉంది, కానీ ఆ అర్హత మనకు ఉండాలి.

కన్నప్ప లాంటి వారు, కన్ను తీసి ఇస్తారు. మనము ఇతరులవి లాక్కుంటాము. జటాయువు సీతమ్మ కోసం, రెక్కలు బలి చేసుకుంది, మరి మనం? ఇతరులవి బలి ఇస్తాము.

అలాంటి మనకు నామ స్మరణ వలన ఫలితము ఉంటుందా? అందుకే అరిషడ్వర్గాల సాధన తప్పక ఉండాలి సుమా.

మీరూ సాధన తో త్రికరణ సుద్దిగా పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Is vaksuddi Speech Clarity and gatrasuddi Voice Clarity the Same?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,590; 104 తత్వాలు (Tatvaalu) and views 226,291
Dt : 19-Aug-2022, Upd Dt : 19-Aug-2022, Category : General
Views : 486 ( + More Social Media views ), Id : 1500 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vaksuddi , speech , clarity , gatrasuddi , voice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content