బంధం ముఖ్యం నా, గుణం, ధర్మం ముఖ్యం? దుర్మార్గపు తండ్రి హిరణ్యకశిపుడని, కొడుకు ప్రహ్లాదుడు సేవించాలా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,492; 104 తత్వాలు (Tatvaalu) and views 266,159.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Is relation important or character, dharma important? Should the son Prahlad serve the evil father Hiranyakashipu, because elders gave birth?

బంధం ముఖ్యం నా లేదా గుణం, ధర్మం ముఖ్యం నా? పెద్దలు కన్నారు అని, దుర్మార్గపు తండ్రి హిరణ్యకశిపుడు ని, కొడుకు ప్రహ్లాదుడు సేవించాలా?

* * *

బంధం ముఖ్యం నా లేదా గుణం, ధర్మం ముఖ్యం నా? పెద్దలు కన్నారు అని, దుర్మార్గపు తండ్రి హిరణ్యకశిపుడు ని, కొడుకు ప్రహ్లాదుడు సేవించాలా? రాముడు నే అడవికి పంపి, భర్త చావుకు కారణం అయిన తల్లి కైకను, పుల్లలు పెట్టి కాపురం కూల్చిన దాసి మంధరను, భరతుడు సేవించాలా? కన్నాము అని కొడుకు నరకుడి అక్రుత్యాలను, తల్లి భరించాలా? దుష్టులైన ద్రుతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వారి సంతానం, భూమికి భారం కాదా, వారు ఎవరినైనా పెద్దలను సేవించారా? దుర్యోధనుడు దగ్గర రాజ్యం బహుమతి గా పొందిన, దుష్టచతుష్టయములోని దానకర్ణుడు, ముదుసలి తల్లి తండ్రిని సేవించారా?

Is relation important or character, dharma important? Should the son Prahlad serve the evil father Hiranyakashipu, because elders gave birth? Should Bharata serve Kaika, who sent Rama to forest, the mother who caused the death of her husband, Mandhara, the maidservant who put fire in to the family? Should the mother have to bear the wrath of the hell of the son, Naraka? Were not the wicked Drutarastra, Duryodhana, their progeny, a burden to the earth, did they serve any elders? Did Dhanakarna, who received the kingdom as a gift from Duryodhana and in the evil quartet (Dushta Chatushtayam), serve the old mother father?

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య - వీరికి సహాయం చెయ్యని ఇంటి వారిని, అలాగే బంధువులు, స్నేహితులను, మనము ప్రశ్నించగలమా/ మార్చగలమా? మారతారా?

Ramanna, Rajanna, Savithramma, Jayalalithamma, Sreedevamma, Kodelaiah - can we question/change the family members, relatives and friends who did not help them? Will they change?

*స్పందన/ ప్రశ్న* - ఏవండీ బాగా చెప్పారు, ముందు బుద్ది రావాల్సింది మన అమ్మ నాన్నలు అత్తా మామలకు. ఒంటరి ముదుసలి బతుకులు అనాధాశ్రమాలు పెరగడానికి కారణం వీరు కాదా? వీరు నేర్పిన కపట నటన అవసర అవకాశా వాదమే, మేము నేర్చుకుని, భాగస్వామి ధనం పదవి అవసరాలతో పరిగెడుతుంటే, మమ్మల్ని మేము పతనము చేసుకుంటూ, మనశ్శాంతి లేకుండా అరిషడ్వర్గంకు అష్టవ్యసనంకు బానిసలమై, కుక్క బతుకు బతుకుతుంటే, మమ్మల్ని చూడ లేదు అంటరేమండీ వీరు, గతం మరచారా?

*Response/Question* - Well said, parents and inlaws should correct their senses first. aren't they the reason for the rise of orphanages for single old people? The hypocritical acting opportunism taught by them, we learned and running with the needs money position of our partner, and we are falling down and living a dogs life without peace of mind, addicted to Arishadvarg Ashtavyasan, then they are blaming us we didn't see them, have they forgotten the past?

వీరి ముదుసలి అమ్మ నాన్న అత్త మామను, గౌరవంగా నిస్వార్ధం గా, ఇంట్లో పెట్టి చూసారా? పించను ఆస్తులు తీసుకోని, ఓ మూలన ముద్ద వెస్తే చాలా? పోనీ చుట్టు ఉన్న ఒంటరి వారిని, ముదుసలి వారిని, ఆప్యాయతతో పలకరించారా, ఇంటికి పిలిచారా, వండి పెట్టారా? 2 రోజులు వారితో ఉండి నిస్వార్ధం గా సేవలు చేసారా?

ఆఖరికి సొంత పిల్లలైన మమ్మల్నే వీసాకు, ధనంకు, ఆస్తులకు నిర్దయగా అమ్మేసారే? అందానికి మేమూ అమ్ముడు పోయాము. మనశ్శాంతి ఉందా? గుణం అన్న మాట, మా ఇంటా వంటా వంశము లో, ఉన్నదా?

జంతువులు కూడా పిల్లలను కని పోషిస్తున్నాయి, కానీ ఇలా అమ్ముకోలేదే.

కులం వర్గం ధనం కేసులు లేకుండా, మా వాళ్ళు ఓటు వేసారా, సమర్ధన చేసారా? ఇద్దరూ ధనం కోసం పరుగులతో పని చేస్తూ లేదా సినిమాలు ఓటీటీలు సీరియల్స్ చూస్తూ, మమ్మల్ని గాలికి వదలలేదా? పన్నులు ఎగవేయలేదా, కబ్జాలు మోసాలు ద్రోహాలు లేవా?

ఆ పాపపు ధనం తో మమ్మల్ని పెంచి, మాకు నీతులు చెపుతారా? అప్పు చేసి పప్పు కూడు కాదా, మా పెద్దలు? ఎంత మందిని ముంచారు?

మన తెలుగు పెద్దలు గురువులు, బ్రహ్మం రాఘవేంద్ర వేమన గురించి, మా పెద్దలకు తెలుసా? తెలిస్తే ఎందుకు ఈ గుళ్ళు పెంచకుండా, కొత్త పరాయి బాబాయి మందిరాలు పెంచారు? పక్కా నమ్మక ద్రోహం, వ్యాపారం కాదా? తెలుగు గురువులను అనాధలుగా వదిలిన మా పెద్దలను, మేము అనాధలు గా వదలడం, తప్పా?

ఇప్పుడు మేము ఇంట్లో భాగస్వామి కాళ్ళు వత్తుతూ, వంట పని చేస్తూ, పిల్లలను బడికి ప్రవేట్ కి తిప్పుతూ, ఊడిగం చేస్తున్నాము. ఇంకా ముదుసలి వారిని, మా జీవితం సర్వ నాశనం చేసిన వారిని, గుణం అంటే తెలియకుండా పెంచిన వారిని, మా నెత్తిపైన ఎక్కడ పెట్టుకునేమి?

ఆఖరికి మా తోబుట్టువు కూడా, మా పెద్దల కపటం నటన ను నేర్చి, క్రుతజ్ఞత విశ్వసనీయత మరచి, పెళ్ళి అయితే మాకేం సంబంధం అని ఇటు అమ్మను, నేనెందుకు చూడాలి అని అటు అత్తను వదిలేసింది.

మా బంధువులు స్నేహితులు ఒక్కడు నీతి గల వాడు ఉన్నాడా, ఇది తప్పు అని చెప్పడానికి? అవసరాలకే, మా ఇంటి చుట్టు, కుక్కలు గా తిరుగుతున్నారు కదా? చిత్తశుద్ది లేని శివ పూజలేలరా అని తెలిసి కూడా, గుళ్ళు యాత్రలు హోమాలు అంటూ, సినిమా రాజకీయ వారికంటే ఎక్కువ నటిస్తున్నారు.

నేను అడుగుతున్నాను అండి అందరినీ, అన్నాయ్ అక్కాయ్ మరియు పెద్దలు అందరినీ, మన మరియు మన పిల్లల గురించి, సొంత గుణాలు, వ్యక్తిత్వం, సేవలు, త్యాగాలు, సజీవ గురువు సేవలు, ఆధ్యాత్మిక మానసిక శారీరక సాధనలు గురించి ఎప్పుడు చెప్ప గలమూ, చూపగలమూ? సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఉందా?

అంటే మనవి చెత్త బతుకులు కాదా? ప్రాపంచిక మోహ దాసులము కాదా? కరోనా, పంచభూతాలు మాత్రమే కాదా, మనకు బుద్ది చెప్పేది.

40 ఏళ్ళు కా లేదా కాళ్ళు చేతులు ఆడని 70 ఏళ్ళు కా, ఎప్పుడు మన గుణం గురించి చెపుతాము? మరి మనం చెప్పకుండా చూపకుండా, మన పిల్లలు అనాధాశ్రమం లో లేదా ఊళ్ళో ఒంటరిగా వదిలారు అని, ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏమిటి?

బంధం ముఖ్యంనా, గుణం, ధర్మం ముఖ్యం నా? పెద్దలు కన్నారు అని, దుర్మార్గపు తండ్రి హిరణ్యకశిపుడు ని, కొడుకు ప్రహ్లాదుడు సేవించాలా? రాముడు నే అడవికి పంపి, భర్త చావుకు కారణం అయిన తల్లి కైకను, పుల్లలు పెట్టి కాపురం కూల్చిన దాసి మంధరను, భరతుడు సేవించాలా? కన్నాము అని కొడుకు నరకుడి అక్రుత్యాలను, తల్లి భరించాలా?

దుష్టులైన ద్రుతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వారి సంతానం, భూమికి భారం కాదా, వారు ఎవరినైనా పెద్దలను సేవించారా? సుయోధనుని దగ్గర రాజ్యం బహుమతి గా పొందిన, దుష్టచతుష్టయములోని దానకర్ణుడు, ముదుసలి తల్లి తండ్రిని సేవించారా?

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య - వీరికి సహాయం చెయ్యని ఇంటి వారిని, అలాగే బంధువులు, స్నేహితులను, మనము ప్రశ్నించగలమా/ మార్చగలమా? మారతారా? కనీసం వారికి దూరము గా ఉండే ధైర్యం నీతి నిజాయితీ ఉందా?

పెద్దలు కూడా, తమ సొంత గుణాలు, వ్యక్తిత్వం, సేవలు, త్యాగాలు, సజీవ గురువు సేవలు, ఆధ్యాత్మిక మానసిక శారీరక సాధనలు పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో పంచుకోకుండా, పిల్లలు వదిలేసారు చూడరు అని తప్పుడు మాటలు మాట్లాడటం మానివేస్తే మంచిది. ముందు వారి నీతి నిజాయితీని తెలియచేయమనండి.

*జవాబు* - మీతో ఏకీభవిస్తున్నాము, మేము కొత్తగా చెప్పెది ఏమిలేదు. మేము చెపుతున్నది అదే 5 ఏళ్ళుగా శనివార సాధనలు గుర్తు చేస్తూ, పెద్దలు మారకుండా, చిన్నలు మారరు, సేవించరు. పిల్లలది తప్పు కాదు.

పెద్దలు తప్పక జవాబు చెప్పాలి, తాము 2 లేదా ఎక్కువ విత్తనాలు వేస్తే, కనీసం ఒక చెట్టు కాయ అయినా, మనల్ని మానవత్వం ఉన్న మనుషులుగా ఎందుకు చూడదు, పూజించదు, సేవించదు?

ఆఖరికి అనాధ్రాశ్రమం లో, ఇంట్లో, ఒంటరిగా ఉన్నవారు కూడా, తమ తప్పులు ఒప్పుకుని, కన్నీరు తో పశ్చాత్తాపం పడకుండా, మేము ఒంటరిగా ధనం తో ఉంటాము, క్రుతజ్ఞతలు విశ్వసనీయత గల పనివారుతో, అని బీరాలు పోతూ ఉన్నారు. పెంచిన పిల్లలే ఘాతకులు అయితే, పని వారు ఉత్తములు ఉంటారా?

తమకు పనికి రాని సంతానం, ప్రపంచానికి పనికి రాదని, తమ ఇన్నాళ్ళ జీవితం వ్రుధా అని, చిత్తశుద్ది లేని దైవ పూజలు అని, ఇంకో 70 జన్మలు తర్వాత కూడా తెలుసుకోలేరు, అదే పాపం వారిని జన్మ జన్మలకు వదలదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,492; 104 తత్వాలు (Tatvaalu) and views 266,159
Dt : 24-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 399 ( + More Social Media views ), Id : 1953 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : relation , important , dharma , character , son , Prahlad , serve , evil , father , Hiranyakashipu , elders , birth , parents , children
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content