పధకాలకు జిల్లాలకు వైఎస్సార్, ఎన్టీఆర్ అని లేదా ఇంకో రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం కరెక్టే నా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,773; 104 తత్వాలు (Tatvaalu) and views 225,621.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*జిల్లా లకు వైఎస్సార్, ఎన్టీఆర్ అని లేదా ఇంకో రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం కరెక్టే నా? మీ బాధ్యత గల జవాబు, అరిషడ్ వర్గాల ను వీడి? చాటుగా అయినా, ఒకరి దగ్గర అయినా, గొంతు ఎత్తే, మనసు విప్పే, నీతి నిజాయితీ ధైర్యం ఉందా?*

జవాబు - మీరు కూడా ప్రయత్నం చేయండి, మోహం వీడి. ఎందుకంటే, మోహం లో ఉన్న వారికి ఈ జవాబు నచ్చదు. ఓం నమో నారాయణా.

మీకూ చేతనైతే రాసి, పది మంది నాయకులకు నేరుగా పంపండి, చాటు విమర్శలు, ఇతరులు రాసిన దానిలో తప్పులు పట్టడం వలన, ఉపయోగము లేదు.

ప్రకాశం, పొట్టిశ్రీరాములు, అన్నమయ్య, వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర, గోపన్న, సీతమ్మ, సీతారామ రాజు జిల్లా ఇలాంటి పేర్లు, గత మహనీయులను మనకు గుర్తుకు తెచ్చి, వారి స్పూర్తిని మనకు రగిలించి, మనల్ని ఉత్తేజులను చెయ్యాలి.

పై పేర్లు ను బట్టి, కొన్ని లక్షణాలు అనుకుందాము. తమ సర్వస్వం దాని కోసం ధారబోసి, చితికి పోయిన, ప్రాణాలు కోల్పోయిన, నిస్వార్ధ త్యాగధనుల పేర్ల ను, మనము గుర్తు కోసము అలా ఉపయోగించాలి.

1. వారు ఆధ్యాత్మికము గా కొన్ని వందల గేయాలు రాసి పాడి దాని కోసమే తరించి గతించి ఉండాలి - అన్నమయ్య, వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర, గోపన్న
2. స్వాతంత్ర సమరములో తమ ప్రాణాలను కోల్పోయి ఉండాలి - సీతారామ రాజు
3. ప్రజా ఉద్యమాలు చేసి, రాష్ట్రం కోసం, తమ ప్రాణాలు ఆస్తులు కోల్పోయి ఉండాలి - పొట్టిశ్రీరాములు, ప్రకాశం

ఇలాంటి లక్షణాలతో నగరాలు, ఊర్లు, జిల్లాల పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది.

అవి స్వార్ధ రాజకీయాలకు సంబంధం ఉండరాదు కదా? ఊరక ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకుల వాసనతో, భవిష్యత్తు తరాలు ఏమి నేర్చుకోవాలి? ఇంత మంది పేర్లుకు, ప్రతి ఊరు పేరు మార్చాలా?

ఇక అన్ని పార్టీలు, వారి స్వార్ధ నాయకుల పేర్లు పెట్టమని, ఉద్యమాలు మొదలు పెట్టవా, మతి మాలి? తగువులు, గొడవలు, మనస్పర్ధలు పెరగవా? అంటే చిచ్చు పెట్టిన ఘనత పాపం ఫలం, చంద్రన్న జగనన్న దేనా?

ఉదాహరణకు, ఊరక ఉహిద్దాము. మా బజారుకో, మా పేటకో, మా ఊరికో మా వాళ్ళ పేరు పెడదాము అని, నాయకులు అధికారులు అడిగితే, మనము ఏమి చెప్పాలి? సంస్కారం ఉండి, మోహం బయట ఉంటే?

అయ్యా, మా కుటుంబములో పై 3 లక్షణాలు గల వారు లేరు, కాబట్టి మా పేరు వద్దు. దయచేసి ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే, రాజకీయ నాయకుడి గా లేదా స్వార్ధ మనిషిగా, మా పేరు పెడితే, జిల్లా/ పట్టణం/ గ్రామం/ బజారు లో సగము మంది అవతల పార్టీ వారు రోజూ, మా తండ్రిని పెద్దలను తిడతారు, మా పార్టీని తిడతారు, కాబట్టి దయచేసి మా కుటుంబ పెర్లు పెట్టవద్దు అని, విజ్ఞులు అడగాలి, ఇటువంటి బడాయి పనులకు దూరముగా ఉండాలి. అధికారమత్తులో, ఇష్టం వచ్చినట్లు చేయకూడదు.

మరి ఎంటీయార్ మరియు ఇతర రాజకీయ నాయకులు పిల్లలు, ఈ పేర్ల పిచ్చిలో పడి, తమ పెద్దలను, ప్రజలతో తరతరాలు తిట్టించరని భావిస్తున్నాము.

తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్న సరుకులు పంచుకుని, తన పేరు ఏ పధకానికీ పెట్టలేదు. తెలంగాణా సీయెం కేసీయార్ కూడ, తన పేరు పధకాలకు పెట్టలేదు. పియెం మోదీ పేరుతో ఒక్క పధకము ఉందా?

మరి మన జగనన్న కు, చంద్రన్న కు ఆత్మాభిమానం లేదా? పై ముగ్గురు కన్నా, ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? పధకాలకు ఎందుకు తమ పేర్లు పెడుతున్నారు, ప్రజా పన్నులతో జరిగే వాటికి?

లోకేష్ ఎందుకు, చంద్రన్న కు, ఇలాంటి పేర్ల పిచ్చి వద్దు, మన సొమ్ము కాదు. మన హేరిటేజ్ ఆస్తులు అమ్మి మనము ఏమీ చేయలేదు అని ఎందుకు చెప్పరు? చెప్పలేనప్పుడు, లోకేష్, మోహం లో లేని మంచి నాయకుడు ఎలా అవుతాడు?

జగనన్న బంధువులు కూడా, మన ఇడుపలపాయా లోటస్ పాండ్ అమ్మి, ప్రజా పధకాలు చేయడం లేదు, మనకు వద్దు పేర్ల పిచ్చి అని ఎందుకు చెప్పరు? వీరు కూడా, మోహం లో లేని మంచి నాయకులు ఎలా అవుతారు?

మరి అలాంటి వారిని ఎన్నుకునే, మనము, మొహం వ్యామోహం లో ఉన్నట్లే గదా? మనల్ని మన విలువలను దిగజార్చమనే కదా, వారికి ఓటు వేసింది? మరలా తరతరాలు వేసేది? తప్పు వారిదా, లేక మనదా?

అందుకే మన నినాదం, నాయకులు అధికారులది తప్పు కాదు, మత్తులో ఓటు వేసిన మన ప్రజలదే మొదటి తప్పు.

పధకాలకు, 5 ఏళ్ళ తర్వాత తమ పేరు ఉండదని, జిల్లాల పేర్లు మీద పడ్డారా? నీతి ఆత్మాభిమానం గల ఎంపీలు ఎమ్మెల్యేలు, గత 10 ఏళ్ళు గా ఎందుకు తమ నాయకులకు, అర్ధము అయ్యేలా చెప్పరు? అంటే, నీతి గల వారు లేరు, అంతేనా?

కడప అంటే, వెంకన్న దేవుని గడప. దానిని వైయెస్సార్ కడప అంటే, దేవుని కన్నా, వైయెస్సార్ ఎక్కువనా? అది వైయెస్సార్ గడపనా? అంటే, ఇతర పార్టీ వారికి బాధ కాదా? వైయెస్సార్ పార్టీ వారికి కూడా బాధ కాదా, దేవుని కన్నా రాజకీయ నాయకుడు ఎక్కువ అంటే? అది అరిష్టము కాదా వారికి, సమర్ధించిన ప్రతి వారికి?

క్రిష్ణా జిల్లా అంటే, క్రిష్ణమ్మ నది గురించి, మంచి ఆలోచన. దానికి మరలా ఎంటీయార్ క్రిష్ణ అని ఎందుకు? క్రిష్ణా నదిని ఎంటీయార్ కొన్నారా? అదీ ఒక చిన్న ముక్క కు, ఎవరి కన్నీళ్ళు తుడవడానికి?

పైన ది 3 పాయింట్లు చదివాకా, ఏ రాజకీయ నాయకుడైనా, సంస్కారం మరిచి, తమ పెద్దల పేర్లు పెట్టమని అడుగుతారా? అడిగితే, వారు మోహం వ్యామోహం లో ఉన్నారు, భవిష్యత్ అంధకారం, అంతే.

ఇలా అందరివీ పేర్లు పెట్టుకుని పోయి, రాబోయే తరాలు, ఇక భవిష్యత్తు లో సినిమా వారిని, రాజకీయ నాయకులను మాత్రమే తలచుకుని, కుళ్ళి పోతూ దిగజారిపోతూ, గతములో ప్రజలకోసం దేశం కోసం త్యాగాలు చేసిన, మహనీయులను మరవాలి అని వీరి ఉద్దేశ్యమా? అంటే, మనము మత్తులో మూర్కత్వముతో వేసిన ఓట్లు తో, మన గొయ్యి మనమే తీసుకోవడం కాదా ఇది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,773; 104 తత్వాలు (Tatvaalu) and views 225,621
Dt : 29-Jan-2022, Upd Dt : 29-Jan-2022, Category : Politics
Views : 581 ( + More Social Media views ), Id : 1287 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : name , districts , ysr , ntr , politicians , andhra , jagan , chandrababu , schemes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content