పిల్లలకు భారం కాకుండా ఉండటం, మంచిదా? పిల్లలా పెద్దలా, ఎవరు భారం? వానప్రస్తం అంటే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,048,049; 104 తత్వాలు (Tatvaalu) and views 235,609.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అబ్బాయి, ఓపిక ఉన్నప్పుడు అహంకారంతో, నీ మాటలను, ఆశ్రమం గురించి ఒప్పుకోకపోయినా, ఒంటరిగా ఓపిక తగ్గిన తర్వాత 100 శాతం ఒప్పుకుంటారు, తప్పదు. ఏ విషయము అయినా అంతే. పిల్లల పెంపక లోపం స్పష్టం, అతిగారాభం చేసి చెడగొడుతుంది మనమే. కానీ, పిల్లలకు భారం కాకుండా ఉండటం, మంచిది కాదా? మరి పూర్వకాలం లో, 60 తర్వాత వానప్రస్తం అని ఆశ్రమాలకు వెళ్ళేవారు కదా?

జవాబు - ప్రతి రోజూ ప్రతి పూటా, వాట్సాప్ స్టేటస్ మరువద్దు, రాబోయే కష్టాలను నెత్తిన వేసుకోవద్దు.

గురువు గారు, అన్ని తెలిసి కూడా, కావాలని, చెప్పిస్తున్నారు, అందరికీ తెలియాలని, ధన్యవాదాములు, తప్పులు ఉంటే, మొహమాటం లేకుండా సరి చేయండి. ఈ అక్షరాలు, మీ అందరి దగ్గరా, నేర్చినవే కదా.

*వానప్రస్తం* - గతములో చతురాశ్రమములు అంటే బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్తం, సన్యాసం అని జీవితము లో 4 దశలు ఉన్నాయి. షుమారు 50 తర్వాత వారి అరిషడ్ వర్గాల పై జయాన్ని బట్టి, వానప్రస్తం మొదలు అవుతుంది, షుమారుగా.

అంటే, ఒంటరి వారు, నేరుగా వానప్రస్తం కు వెళ్ళవచ్చు, ఏ బాదర బందీ లేకుండా, ప్రభుత్వానికి లేదా సేవ తో నమ్మకం గా ఉన్న వారికి ఇచ్చి.

సంసారి, అన్ని వ్యాపకాలను వ్యాపారాలను, సంస్కారులు అయిన పిల్లలకు ఇచ్చి, ఎటువంటి బంధాలు లేకుండా అరిషడ్వర్గాలను జయించి లేదా జయించటానికి, అడవి లోకి వెళ్ళి పూరింటి ఆశ్రమం లో ఉంటూ, సౌకర్యాలు ఏమీ లేకుండా, తమ పనులు తాము చేసుకుంటూ, కందమూలాలు తింటూ, రామ నామ జపం ధ్యానం చేసుకుంటూ, చివరి రోజులు ప్రశాంతము గా గడిపేవారు. బద్దకం సోమరితనం ప్రాపంచిక మోహం ఇక ఉండవు. నెల ఖర్చు, ఇతరుల సేవలు ఉండవు.

ఇప్పుడు అలా అడవులకు వెళ్ళే, నీతి ఉత్తములు ఉన్నారా? లేరు కాబట్టి, ఆ పాత ధర్మాల తో పోలిక అసలు కుదరదు. ఎందుకంటే, అవి, నీతి నియమాలు ఉన్నవారికి మాత్రమే. మనకు నీతి నియమం అంటే తెలీదు, పాటించము.

*వాస్తవం* - మరి ఇప్పుడు అనాధాల లేదా వ్రుద్దుల ఆశ్రమాలు అంటే, వేల రూపాయలు కట్టి, టీవీ ల తో ఫోన్ నెట్ తో, వారి వేసిన 3 పూట్ల టిఫ్ఫిన్ భోజనము తో, ఒళ్ళు బద్దకము తో సోమరి లా తయారవుతూ, పోసుకోలు కబుర్లు చెపుతూ, ఒపిక ఉన్నంత వరకూ అయినవారు ఎవరికీ పనికి రాకుండా, కొడుకులు మనవళ్ళు అన్న ప్రేమ లేకుండా, అయినవారికి దూరం గా అనాధలా, అసలు పనులు ఏమీ చేయకుండా, జాలీ గా గెస్ట్ హౌస్ లో లాగా గడుపుతున్నారు. సరే ఇంత వరకు, మనకూ బాధ లేదు.

కానీ పాత పాపాలు మోసాలు ఎప్పుడు అనుభవించాలి మరి, వచ్చే జన్మలోనా? లేక ధనము ఉంది తప్పించుకుని పోదాము అనుకుంటున్నారా? అబ్బే కుదరదు.

ఒక సారి ఓపిక తగ్గి, మంచము ఎక్కిన తర్వాత? అందరూ బయట వేస్తారు లేదా అవమానిస్తూ లెక్క లేకుండా చూస్తారు, కనీసం 80 శాతం. విదేశాలలో అయినా అంతే, మొన్న వీడియోలో, ఓ నర్సు ఒక ముసలాయన్ని ఈడ్చి ఈడ్చి తన్నింది విసిగిస్తున్నావు అని, చెప్పినమాట వినకుండా సతాయిస్తున్నావని.

ఇంట్లో వాళ్ళ దగ్గర లేని, ప్రేమ జాలి దయ క్రుతజ్ఞత ఆప్యాయత, బయట జీతం తీసుకుని తోడు ఉండే వారి దగ్గర ఉంటాయా? మనల్ని విసుక్కుని, అసహ్యించుకుని, 4 తిట్టి 4 తగిలించరా, మంచము ఎక్కి అనారోగ్యముతో నిస్సత్తువగా ఉన్నప్పుడు?

ఇన్ని రోజులు, అనాధాశ్రమం లో ఉండి, తమకు లేకుండా పోయిన మనిషి కింద చూసిన మనల్ని, ఆ వ్రుద్దాప్యం లో మన ఇంట్లో ఉంచుకుంటారా? ముందే గౌరవం క్రుతజ్ఞతలు లేకుండా అసహ్యించుకుంటే నే గదా, వయసు లోనే బయట ఆశ్రమం లో వేసింది? అప్పుడైనా, నరకం ఇంకా ఎక్కువ కాదా?

ఒంటరిగా కూడా, అన్ని చేసుకుంటూ, అద్దె ఇంట్లో అయినా, హాయిగా ఉంటాము. ఏ పుణ్యాత్ముడైన దొరికితే, 4 రూపాయలు అతనికే ఇచ్చి, అతని చేతిలో రాలిపోతాము, మన పెంపక తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాప పడుతూ.

*పిల్లలకు భారం? అసలు ఎవరు భారం?* - తమ చేతగాని తనముకు, తమ తప్పుడు పెంపకానికి, ఇదో అందమైన పేరు. ఎవరు ఎవరికి భారం? అది మీ వంశ ఆచార లక్షణమై, వాడుకుని వదిలేయడం ఆచారమైతే, మీ ఇష్టం.

తమను 9 మాసాలు కడుపులో ఉంచి పెంచిన తల్లిని, ఆ తర్వాత 20 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని, భారము అనుకునే, పాపపు సంతానన్ని కన్నాము పెంచాము, ఎన్నో పాపాలు చేసి, అని ఏడుస్తూ పశ్చాత్తాపం పడక, వారికి భారమని మనము తలదించుకోవడానికి దాక్కోవడానికి, ఇన్నాళ్ళ శ్రమ కు శిక్ష ఫలితమా? సిగ్గు తో తలదించుకోవద్దా?

పసిపిల్లలకు సేవలు చేసి, సినిమాలు షికార్లు, స్కూల్ కాలేజ్ ఫీజ్ కట్టి, చదువు చెప్పించి, ఉద్యోగాలు ఇప్పించి, పెళ్ళి చేయించి, వారు మాట వినక, వారిని అరవలేక, వాళ్ళ చేతనే అరిపించుకుని, వారి ఇష్టానికి తలొగ్గి, వారి భవిష్యత్ ను, ధనమే ప్రధానం అన్నట్లు పెంచడము, కష్టమా?

లేక ఇంట్లో ముదుసలి వారి నోట్లో, ఇంత పడవేయడం కష్టమా? ఇదే తేలిక, వీరు నోరు ఎత్తరు డిమాండ్ చేయరు, కానీ క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని మనము, ఇదే కష్టం అనుకుంటున్నాము.

మరి భూమాతకు కూడా భారమని, పెళ్ళి జీవిత భాగస్వామి పిల్లలు లేకుండా ఎందుకు ఉండలేకపోయారు, మీరు మీ పిల్లలు?

రోగము వచ్చిన తర్వాత, భూమికి భారం తగ్గిద్దామని, గమ్ముగా ఉండక, లక్షలతో వైద్యం ఎందుకు, ఆసుపత్రి పరుగులు ఎందుకు బిళ్ళలు మింగుతూ?

రేపు పిల్లలు వచ్చి, జీవిత భాగస్వామి తో భారం అంటే? పిల్లలు తో భారం అంటే? పిల్లలు బడికి వెళ్ళమని, అస్తమానం పోరే తల్లి తో భారం అంటే? ఇలాగే వదిలేయమని అంటారా?

బాధ్యత సంస్కారం లేకుండా పెరిగిన వంశాలు, వారి పిల్లలు, మాత్రమే పెద్దలను భారం అంటారు. అవి తెలిసిన వారు ఉన్న వారు, అది తమ భాద్యత అంటారు.

మరి కలియుగ పాపం పెరగడం లో, మీ వంతు పాపాత్ములను భూమికి భారము గా వేసామని, దానికి శిక్ష పడాలని అనుకుంటే, మీ ఇష్టము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,048,049; 104 తత్వాలు (Tatvaalu) and views 235,609
Dt : 03-Jul-2021, Upd Dt : 03-Jul-2021, Category : General
Views : 898 ( + More Social Media views ), Id : 1225 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ashram , children , everyone , cruel , activities , old , parents , care , love , burden , kids , vanaprastha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content