APLatestNews.com top Banner

Social Media links
పట్టణ అపార్ట్ మెంట్ ల లో, తల్లి దండ్రులు ను ఉంచి, కనీస సౌకర్యాలు కల్పించలేరా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

క్రిష్ణ, భార్గవ్ తో ఇలా తన ఇంటి సమస్యలు చెపుతూ, తన సోదరి ల గురించి చెప్తున్నాడు. సోదరులు అనుకున్నా అర్ధము అదే, ఎన్నొ చోట్ల సమస్యే ఇది. 60 దాకా అర్ధము కానిది, 60 తర్వాత ఏమి చేయలేనిది. నేను మా చుట్టలకు మిత్రులకు బంధువులకు ఇలా చెప్పాను.

వేరే వాళ్ళు అడిగితే, బయటకు చెప్పుకోలేక తమ బిడ్డల మీద, ఎందుకు లేమ్మ ఇక్కడే బాగుంటుంది. అని అంటారు, అది సహజమే కదా. మన పిల్లలు వాళ్ళతో ఉండి చదువుతామూ అంటే, వదులు తామా? అబ్బే, మన పిల్ల లు రత్నాలు, మరి తల్లి దండ్రులు?

మీలో ఎవరన్నా, నీతి నియమాలు కలిగి ఉండి, మీ తల్లి దండ్రులు అంటే గౌరవం ఉంటే, మా ముత్యాలు లేదా వారి భర్త లు కనపడితే,

మీ అమ్మ లేదా అత్త ఇచ్చిన, అపార్ట్ మెంట్ ల లో కనీసం ఒక దాంట్లో, మీ తల్లి దండ్రులు(అంటే ముత్యాల అత్త మామలు) కు ఇచ్చి లేదా అందులో ఉంచి, తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పగలరా? మన మాటలు ఎటూ వినరు, కన్న తల్లిని ఎటూ వదిలేసారు, కానీసం అత్తలకు అన్నా మంచి చేస్తారా?

మీరు ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో లేదా విదేశాల్లో/ ఊళ్ళో, నల్ల కళ్ళు జోడు తో విమానం లేదా కారు లో విహరిస్తూ ఉంటే, మీ తల్లి దండ్రులు (అత్త మామలు), ఇంకా గతి లేని వారికి మల్లే, పొలం పనులు చేసుకుంటూ, పూరిల్లు లేదా పెంకుటింట్లో ఉండాల్సిన ఖర్మ ఏమిటి?

మీ సంపాదన ఆస్తులూ చాలవా? పల్లె టూరు వైద్యం తో, ఎందుకు సర్దుకోవాలి? సౌకర్యాలు కు వారు నోచుకోరా? బిడ్డలు అంత పిసినారి వారా? మీతో ఉంచుకోక పోయినా, కనీసం సౌకర్యాలతో వైద్యం తో, మీకున్న పట్టణ అపార్ట్మెంట్ లో ఉంచవచ్చును గదా.

ఊళ్ళో పొలం లేదా ఇంకేమైనా పనులు ఉంటే, అపార్ట్ మెంట్ నుంచి వెళ్లి చూసిరావచ్చు కదా. వారిని చూసే అక్క చెల్లళ్ళు లేదా పని వాళ్ళ ను కూడా, ఆ అపార్ట్ మెంట్ లో ఉంచవచ్చు కదా. ఊరక వచ్చిన దాంట్లో కూడా, ఒకటి వారికి ఉండటానికి, బతికి నంత కాలం ఇవ్వలేరా?

అలా చేసినట్లు అయితే, నా కన్న తల్లి వైద్యం కు, వారు డబ్బులు ఇచ్చినట్లు గా నేను భావిస్తాను. వారి భర్తల కు, తమ కన్న తల్లి దండ్రులు కు, అలా చేసే కనీస సంస్కారం, కృతజ్ఞతలు వారికి ఉందా ఉండదా?

లేదు, పల్లెటూళ్ళో ఉన్న చోటునే, డాబా లేపవచ్చు. కానీ వెంటనే, పూర్తి కాదు. డబ్బు చేతిలో ఉండకపోవచ్చు, ఇప్పుడు. కాబట్టి, పట్టణంలో ముందు ఉంచి, తర్వాత చిన్నగా కట్టవచ్చు, అసలు మంచి ఉంటే.

అంతే గాక అక్కడ, పట్టణ సౌకర్యాలు దొరకవు , కదా. వారు ఆలోచన చెయ్యాలి. పెద్ద రోగం వచ్చినా లేక ఏదైనా కావాలన్న, పట్టణానికి పరుగెత్తాలి.

అది విని భార్గవ్, వారికి ఆ క్రుతజ్ఞత మనసు ప్రేమ ఉంటే, ఎప్పుడో 5 ఏళ్ళ నుంచే చేసే వారు. చూద్దాము మీ చుట్టాలు ఏమైనా, వారికి సర్ది చెప్పగలరేమో అన్నాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 578 General Articles, 46 Tatvaalu
Dt : 27-Sep-2019, Upd Dt : 27-Sep-2019, Category : General
Views : 206 ( + More Social Media views ), Id : 174 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : old parents , care of elders , medical needs , city facilities
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content