మన ప్రజాస్వామ్యం లో, చిత్ర విచిత్రంగా నవ్వు వచ్చే అంశం? పార్టీ అభిమానుల ఐకమత్య రాగం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,452; 104 తత్వాలు (Tatvaalu) and views 225,994.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇప్పుడే ఆ ఇద్దరు అభిమానులు, ముందు కధనం చదవి, సరిగ్గా తమ మనసు ను తెలియజేసినందుకు ఆనందం, అలాగే ఒక్క విషయం లో ఆవేదన వ్యక్తం చేశారు. వారిని రాష్ట్రం కోసం కలపగలమా అన్న మాటకు, వెంటనే సమాధానం ఇచ్చారు వినమ్రంగా.

అలాగే ఉండాలి ప్రతి వ్యక్తి, తన మనసును, మనకంటే ఉత్తములైన రాక్షసులు ప్రతినిధులు అయిన, దుర్యోధనుడు రావణుడు లాగా, కనీసం నటించకుండా బయటకు వ్యక్త పరచాలి. ఇతరుల మీద కోపం తెచ్చుకోవడం అలగడం నటించడం తప్పు, అది మనల్నే దహించివెస్తుంది. ఆ అభిమానులు ఇద్దరూ సంయుక్తంగా, ఈ కింది విషయాలలో ఏకీభవిస్తున్నారు కలుస్తారు అంట

1. తెలుగు వారి ఆత్మాభిమానం గురించి రాష్ట్ర ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే మాటాడాలి అంట. మనం ఎంపీ కి ఓటు వేస్తే, ఎంపీ మనకోసం పనిచేసే, మన రాజధాని ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు, విలువ తక్కువ అంట.

కానీ రాష్ట్రంలో గెలిచిన తర్వాత మాత్రం, సీబీఐకి ఈడీ కి భయపడి, వంగి వంగి దండాలు పెడతారు అంట. దానిని మాత్రం, తెలుగు ఆత్మాభిమానం తాకట్టు, అనకూడదు అంట.

మన అభివ్రుద్దికి సంబంధంలేని, వడ్డీ కి అప్పులు ఇచ్చే, విదేశాలకు మాత్రమే తాకట్టు పెడతారు అంట, భూములు అమ్మకం తాకట్టు లీజు లతో అప్పు లతో, అభివృద్ధి అనే ముసుగులో. అప్పుడు తెలుగు ఆత్మాభిమానం అనకూడదు అంట.

2. రాష్ట్రం కు ఎంత అప్పు నష్టం జరిగినా పర్లేదు అంట, తరతరాల మా నాయకుల కుటుంబ వంశాలు తప్ప, మూడో వంశానికి లేదా కొత్త వారికి చోటు ఇవ్వకూడదంటా, వచ్చే 20 ఏళ్ళ లో.

మన పెట్టబడి దారులు, బినామీ, కంపెనీలు, వ్యక్తుల కే కాంట్రాక్టు లు, కంపెనీలు పేర్లు మార్చి మనుషులును మార్చి అయినా, ఇవ్వాలి అంట. గనులు ఎప్పుడూ పన్నులు కట్టకుండా, మన కిందనే ఉండాలి. నువ్వు ఓడితే నేను రక్షణ, నేను ఓడితే నువ్వు రక్షణ, ఇంటి కి వెళ్లి విందులు అంట.

3. వీలైతే, బీజేపీ ని మత తత్వ పార్టీ గా అందాము కానీ, మా పార్టీల ను మాత్రం, కుల కుటుంబ పార్టీలు అంటే మాత్రం సహించబోమని, ఖరాఖండిగా చెప్పారు.

ఈమధ్య, రాష్ట్ర బీజేపీ ఎక్కువగా ఈమాట అనడంను, తీవ్రంగా ఖండిస్తున్నారు, తట్టుకోలేక పోతున్నారు అంట. జనం మదిలో ఈమాట, ఎక్కకూడదు అంట.

వారిది గత 20 ఏళ్లుగా, వచ్చే ఇరవై ఏళ్ళు కుల కుటుంబ పార్టీ, కానే కాదు అంట. 200 మంది పైగా అధికారుల పేర్లు లిస్ట్ లు పంపే బదులు, ఇరు వర్గాల అధికారుల లిస్ట్ తో వెబ్సైట్ పెడితె, ఉత్తమము అంట.

అవసరం అయితే లోపాయకారి ఒప్పందం తో, ఇతర మతతత్వ పార్టీలు తో, కలసే పార్టీలు తో అవసరాలకు కలుద్దాం అంట.

4. వెనుక బడిన, రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం లాంటి వాటి అభివృద్ధి గురించి మాత్రం, ఇప్పుడు అడగవద్దు అంట, అన్ని మా వైజాగ్ మరియు మా అమరావతి తర్వాత నే అంట. మిగతా అందరు, ఈ రెంటి అభివ్రుద్ది కోసం ధర్నాలు చేయాలి అంట. తమ సొంత ప్రాంత అభివ్రుద్ది కోసం మాత్రం, చేయనవసరము లేదంటా.

కనీసం ఈ విషయాలలో అయినా, వారు మన రాష్ట్ర బాగు యందు, దయ ఉంచి అంగీకరించండం ను, మనం ఏమీ చేయలేని నిస్సహాయత స్ధితిలో, ఏడవాలో నవ్వాలో తెలియని విచిత్ర పరిస్థితి లో, దాచకుండా మనసులో మాట చెప్పినందుకు మనస్ఫూర్తిగా అభినందించాలి, కాదంటారా? ధన్యవాదాలు.

ఇందులో కొన్ని అయినా, మనకు తెలిసిన నిజాలు ఉన్నాయి కదా? అలాంటి, మనకు తెలియని అభిమానులు ఎందరో.

వారెవరూ అని దయచేసి అడగకండి, ఏ ఉత్తమ విలేఖరి కూడా ప్రాణాలు పోయినా, నమ్మి సమాచారం ఇచ్చే, నాయకుల ప్రజల అధికారుల వివరాలు, బయటకు చెప్పరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,452; 104 తత్వాలు (Tatvaalu) and views 225,994
Dt : 20-Dec-2020, Upd Dt : 20-Dec-2020, Category : Politics
Views : 710 ( + More Social Media views ), Id : 873 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : democracy , weirdly , funny thing , andhra , politics , solidarity tune , party fans , jagan chandra , bjp , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content