మహాలయ పక్ష పూజలో, వైభవం భారీ నైవేద్యం కాదు - మనస్పుర్తిగా కన్నీళ్ళతో క్రుతజ్ఞతలు, సేవలు గుర్తు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,920,979; 104 తత్వాలు (Tatvaalu) and views 229,542.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

నేటి అమావాస్య రోజు మరలా పితృ పూజార్చన, దానికి సంబంధించిన శ్లోకాలు గత వారమే మీకు పంపాను. అవి మన పుట్టినరోజు మరియు పెద్దల శివైక్యం రోజు కూడా చదవవచ్చు పెద్దల కు దీప నైవేద్యం పెట్టి. మీరూ మీ పెద్దల ను, తలుస్తారు కదూ కృతజ్ఞతలు తో.

మహాలయ పక్షాల పూజలో, కావాల్సింది ఎంత వైభవం ఎంత నైవేద్యం కాదు, ఎంత మనస్పుర్తిగా కన్నీళ్ళతో క్రుతజ్ఞతలు తెలుపడం, వారు చేసిన సేవలు మంచి గుర్తు చేసుకోవడం.

మా అమ్మ తరుపున తాత అమ్మమ్మ లకు, అలాగే మా నాన్న తరుపున తాత నాయనమ్మలకు, ఇరువైపులా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు,

తానేమి ఆశించక, తాను సంపాదించినంది తానూ అనుభవించక, అన్ని మాకోసం సమకూర్చి, ముందు చూపుతో పూలబాటను ఏర్పరచి, ఊళ్ళో బంధువులతో స్నేహితూలలో ఊరి పెద్ద గా పెద్ద మనిషి గా పెరు పొంది, పెద్ద చదువులు చెప్పించి, ఉద్యోగ మార్గం ఏర్పరచి, క్రమశిక్షణ, నీతి నియమం, పెద్దల యందు గౌరవం మర్యాద, క్రుతజ్ఞ్త విశ్వసనీయత బాధ్యత, కష్టాలు అవమానలు ఓర్చుకోవడం, నష్టపోయినా పర్లేదు నీతి గా మాట మీద ఉండటం, ఉన్నదానిలో సహాయం చెయడం, ఇతరుల కష్టాలను పంచుకోవడం, వారికో దోవ చూపడం, ఉన్నదానితో సర్దుకోవడం నేర్పిన, మా నాన్న గారి కి,

అమ్మ వైపు - మా మేనల్లుడు కు, అమ్మ తమ్ముడు మామయ్య మరియు పిన్ని కొడుకు తమ్ముడుకు, పేట అమ్మమ్మకు, కావలి పెద్దమ్మకు,

నాన్న వైపు - చిన్న తాత నాయనమ్మలకు, వారి 2 వ కొడుకు బాబాయికి, ఊళ్ళో మన బాబాయికి,

మా ఇతర దివి కేగిన బంధువులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, గురువులు, పెద్దలు మరియు చిన్నలు అందరికీ,

వినమ్రపూర్వకముగా శిరస్సువంచి నమస్కరిస్తూ, ఈ రోజు పిండ తర్పణాలు వైదిక పూజతో కొబ్బరికాయ కొట్టి, ఆ దేవుని దయవలన క్రుతజ్ఞతలు సమర్పించే అవకాశం కలిగింది.

వారి దయ, క్రుప, చల్లని చూపు, ఆశీర్వాద భిక్ష వలనే, మనకు ఈ రోజు ఉన్న స్థితి పరిస్థితి మానసిక స్థితి.

వారు ఎల్ల వేళలా, మన అందరికీ అండాగా ఉంటూ, సన్మార్గములో మనల్ని నడిపిస్తూ, ఆధ్యాత్మికముగా ఎదుగిస్తూ, ఆ దేవ దేవుని చేరే దోవ చూపుతారని ఆశిస్తున్నాము.

అలాగే, ఆ దివికేగిన మహాత్ములు గౌరవనీయులు అందరికీ, మనశ్శాంతి ఆత్మ సంత్రుప్తి తో, దేవుని సన్నిధి లభించాలని, ఒకవేళ మరుజన్మలు ఉంటే ఉత్తమ జన్మలు లభించాలని, ఆ భగవంతుని కోరుతూ,

- ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో, అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

- సకల యజ్ఞస్వరూపులై, స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు.

- సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ, సంతోషమూర్తులై, సుఖములను కలుగజేసే, పితరులకు నమస్కారములు.

- ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న, దుర్లభమైన ఈ మానవ శరీరం, ఎవరివలన లభించిందో, ఆ పితృ దేవతలకు నమస్కారములు.

- ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో, మహా గురువులకు కూడా గురువులైన, పితృదేవతలకు నమస్కారములు.

- ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా, అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో, అటువంటి పితరులకు నమస్కారము.

ముందు అమ్మ నాన్నల పాదదాసుడు, తర్వాత నే హరిహరుల ఆచరణ సేవా దాసుడు, ఈ శిష్యుడు శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,920,979; 104 తత్వాలు (Tatvaalu) and views 229,542
Dt : 26-Sep-2021, Upd Dt : 05-Oct-2021, Category : General
Views : 818 ( + More Social Media views ), Id : 1255 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mahalaya , pitru , paksha , pitri , heartfelt , thanksgiving , remember , services , elders , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content