పాటతో పరమార్ధం - హృదయం ఎక్కడున్నదీ (భక్తి పేరడీ) - గజిని - సూర్య, అసిన్, నయనతార - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,621; 104 తత్వాలు (Tatvaalu) and views 226,440.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Hrudayam Ekkadunnadi (Bhakti Parody) - Ghajini - Suriya, Asin, Nayanthara

హృదయం ఎక్కడున్నదీ, అదేమిటండీ క్లాస్ రూం లోనే ఉంది, సంఘం లోనే ఉంది, కుటుంబం లో ఉంది కదా అంటారు, అమాయకముగా. కానీ హ్రుదయం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో మునిగిపోయి ఉన్నది అని ఎవరూ చెప్పరు, తెలిసినా, ఇదంతా కామన్ కదా అంటారు. అదే మానసిక బలహీన హృదయం. అందుకే, మనసును పట్టుకుని మనం ఆడించాలి, అది మనల్ని ఆడించకూడదు. ఇప్పుడు చెప్పండి, హ్రుదయం ఎక్కడున్నదీ?

మానసిక బల హృదయం ఇలా చెపుతుంది, జపములో అక్కడున్నది, దైవం చుట్టూ తిరుగుతున్నదీ. లోకం అందమైన అబద్దం అని, కోరికలతో ఆడుతున్న వయసే అన్ని సమస్యలకు మూలం అని అర్ధం చేసుకుని, మనలో వైరాగ్యం పెంచుతున్నదీ. దేవుని చూపులకై వెతికా, ఆయన భక్తి గీత పాటల నాదాల్లోనే బ్రతికా, కళ్ళు మూసి ధ్యానంలో కన్నా దైవాన్ని, తొలిసారీ, మలిసారీ.

ప్రాపంచిక మోహ కుందనం మెరుపు కన్నా, అవసర అవకాశ బంధనం వయసుకన్నా, దైవం బంధం ఏనాడూ విడనాడనిది అని, నాడే అందుకున్నా. దైవ నామ స్పరణ గుండెలో కొసరుతున్నా, చివరకు మరో జన్మ లేని మోక్షమే మంచిది అని తెలుసుకున్నా. మన చుట్టూ ఉన్న వేదాంతులు, మంచి మార్గం చూపి, బ్రతికిస్తారనుకున్నా. కానీ మనలోని పరమాత్మనే మనకు దోవ చుపారు. కంటిపాపలా, పూవులనే, దైవ కనులలో కన్నా. ఆ దేవ దేవుని
కళ్ళే, ఏనాటికీ వాడిపోని శాశ్వతమైన పూవులమ్మా అని గ్రహించాను.

ఆధ్యాత్మిక మనసులో దైవం కన్నాను, పరమాత్మను మన ఆత్మ తో పొల్చుకున్నా. ఆయన మనోహర తలపుల, అనురాగ ఆధ్యాత్మిక పిలుపులు విన్నా. నిత్యం ధ్యానం లో కా(రగు)లుతున్నా, అనునిత్యం ఆ వేదం నే పలుకుతున్నా. ఈ లోకం లో పాపం లేని, జాడే తెలుసుకున్నా. మంచు చల్లనా, ఎండ చల్లనా, ధ్యానంలోనా మనం మన బ్రమలు చల్లబడతాయి. కన్నా, మన త్యాగంలోనా, అన్ని మోహాలు చల్లబడతాయి. మానసిక బలం పెరుగుతుంది. మరి మీరూ పాడి వినిపిస్తారు కదూ.

హృదయం ఎక్కడున్నదీ, జపము అక్కడున్నది
దైవం చుట్టూ తిరుగుతున్నదీ...
అందమైన అబద్దం, ఆడుకున్న వయసే
మనలో వైరాగ్యం పెంచుతున్నదీ..
చూ.పు.లకై వెతికా, నా.దా.ల్లోనే బ్రతికా
కళ్ళు మూసి ధ్యానంలో కన్నా.,
తొలిసా.రీ, కళ్ళు మూసి ధ్యానంలో కన్నా... 2

కుందనం మెరుపు కన్నా., బంధనం వయసుకన్నా.
దైవం. బంధం, నాడే అందుకున్నా...
గుండెలో కొసరుతున్నా., మోక్షమే తెలుసుకున్నా.
మార్గం. చూపి, బ్రతికిస్తారనుకున్నా...ఆ..
కంటిపా.ప.లా, పూ.వులనే., దైవ క.ను.ల.లో కన్నా.
ఆ క.ళ్ళే., వాడిపోని పూవులమ్మా.... 2 ||హృదయం||

మనసులో దైవం కన్నా., ఆత్మ తో పొల్చుకున్నా.
త.ల.పు.ల, పి.లు.పులు విన్నా..
ధ్యానం లో కాలుతున్నా., వేదం నే పలుకుతున్నా.
పాపం లేని, జాడే తెలుసుకున్నా...ఆ..
మంచు చల్లనా, ఎండ చల్లనా., ధ్యానంలోనా మనం చల్లనా
కన్నా..మన. త్యాగంలోనా మోహం చల్లనా... 2||హృదయం||

Original

హృదయం ఎక్కడున్నదీ, హృదయం ఎక్కడున్నది
నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
అందమైన అబద్దం, ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ..
చూ.పు.లకై వెతికా, చూ.పు.ల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.,
తొలిసా.రీ, కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా... 2

కుందనం మెరుపు కన్నా., బంధనం వయసుకున్నా.
చె.లి. అందం, నేడే అందుకున్నా...
గుండెలో కొసరుతున్నా., కోరికే తెలుపుకున్నా.
చూ.పే. వేసీ, బ్రతికిస్తావనుకున్నా...ఆ..
కంటిపా.ప.లా, పూ.వులనే., నీ క.ను.ల.లో కన్నా.
నీ క.ళ్ళే., వాడిపోని పూవులమ్మా.... 2 ||హృదయం||

మనసులో నిన్ను కన్నా., మనసుతో పొల్చుకున్నా.
త.ల.పు.ల, పి.లు.పులు విన్నా..
సెగలలో కాలుతున్నా., చలికి నే వణుకుతున్నా.
నీ.డే. లేని, జాడే తెలుసుకున్నా...ఆ..
మంచు చల్లనా, ఎండ చల్లనా., తాపంలోనా మంచు చల్లనా
కన్నా..నీ. కోపంలోనా ఎండ చల్లనా... 2||హృదయం||

హృదయం ఎక్కడున్నదీ; చిత్రం: గజిని (2005); సంగీతం: హరీస్ జయరాజ్; గీతరచయిత: వెన్నెలకంటి; నేపధ్య గానం: హరీష్ రఘవేంద్ర, బొంబే జయశ్రీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,621; 104 తత్వాలు (Tatvaalu) and views 226,440
Dt : 19-Feb-2024, Upd Dt : 19-Feb-2024, Category : Songs
Views : 135 ( + More Social Media views ), Id : 2028 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Hrudayam , Ekkadunnadi , Bhakti , Parody , Ghajini , Suriya , Asin , Nayanthara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content