రాము, తన పెద మామయ్యను ఎలా వెతికి పట్టుకున్నారు, 25 ఏళ్ల తర్వాత? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,047,885; 104 తత్వాలు (Tatvaalu) and views 235,593.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పమిడిపాడు లో ఉన్న మామయ్య ను చిన్నప్పుడు, నాన్న మన ఊరు తెచ్చి వ్యాపారం పెట్టించి, స్ధలాలు ఇప్పించి, అండగా ఉండి, ఒక దోవ చూపించారు. ఊళ్ళో అందరూ ఆశ్చర్యం గా చూస్తూ ఉండేవారు. ఇరు వర్గాల వారికి ఇంత ఒద్దిక ఎలా కుదిరిందని. అవసరానికి వంగి, ఆ తర్వాత జూలు విదిలించే, విశ్వాసం లేని మనుషులు, మన చుట్టూ ఉంటారు, చాలా మంది, జాగ్రత్తలు సుమా.

నాన్న సహాయం గురించి, వాళ్ళ అమ్మ గారే స్వయంగా చెప్పినది, నన్ను చిన్నప్పుడు ఒళ్లో కూర్చో పెట్టుకుని. ఎదిగిన తర్వాత, పూర్వ సహాయ జ్ఞాపకాలను మరచి, అహంకార ధోరణి తో, ఎవరినీ లెక్క చేయని తనంతో, అవకాశవాద తనంతో, గాలిలో నడుస్తూ, పూర్తిగా మారారు మామయ్య. పిల్లల పెళ్లి విషయం దగ్గర, సొంత వాళ్ళ కు ఇచ్చిన గతం మాట మరచి, హోదా పెరిగి, మాట తేడా వచ్చి, నాన్నకు దూరం అయ్యారు.

వాళ్ళ అన్న గారు కూడా 30 ఏళ్ల క్రితం, మన ఇంటికి వచ్చి, మాట్లాడుతూ ఉండేవారు, చాలా మంచి వారు. మంచి గట్టి కంఠం, కంచు మోగిన విధంగా ఉంటుంది. కాకపోతే, అందరికీ కాలం కలసి రాదు కదా. తమ్ముడు, ఆదుకోక పోయినా, తన శక్తి కొలది తమ జీవనం సాగిస్తున్నారు. ఆయనతో ఎలాగైనా మాట్లాడాలి, ఎలా ఉన్నారో క్షేమ సమాచారం కనుక్కోవాలి అని, పది ఏళ్లుగా అందరినీ అడిగాను. ఎవరూ అటు వైపు మనకు తెలీదు, కష్టం కనుక్కోవడం అన్నారు.

ఇప్పుడు అన్నగారు, ఆ చుట్టూ పక్కల ఊళ్ళు లో ఎక్కడ ఉన్నారో, మనకు సరిగ్గా తెలీదు. మామయ్య ను ఎవరు అడిగినా, అన్న నంబరు ఇవ్వరు. తన గొప్పతనం తెలియకూడదు బయట పడకూడదు అని, పుట్టిన ఊర్లో.

మన ఊళ్ళో నాన్న కు మామయ్య కు తెలిసిన, అందరూ చేతులు ఎత్తేసారు. వేరే తెలిసిన వాళ్ళ తో ప్రయత్నం ఫలించలేదు. కానీ ఈ వారంలో ఒకరితో కనెక్షన్ దొరికిన కూడా, సరిగ్గా వారి కమ్యూనికేషన్ జరగలేదు. అంటే నంబరు చిక్క లేదు. కానీ ఎక్కడ ఉన్నారు అని మాత్రం ఆచూకీ చిక్కింది. ఇప్పుడు అన్నగారు ఉంటుంది రావినూతల. కానీ ఎలా పట్టుకోవాలి? ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా, దూరం నుంచి ఖర్చు తో పోకుండా. పల్లెటూరు లో దాదాపుగా, సగం మంది తెలిసే ఉంటారు, అందరికీ, అని ఒక నమ్మకం. కానీ ఎలా?

ఇంటర్నెట్ లో ఆ ఊరు వెతికితే, అక్కడ గుడులు, షాపులు, వ్యాపారాలు కనపడ్డాయి. ఒక పేరు ఆకర్షించింది. వారికి ఫోన్ చేసా, నమ్మకం కోసం, మన వివరాలు మొత్తం చెప్పి, ఫలానా వారు మీకు తెలుసా, అని అడిగాను. వారు పాపం, శ్రమ అనుకోకుండా అంతా విని, తెలుసు సాయంత్రం లోపు, నంబరు ఇస్తాము అని చెప్పారు. మన మాట స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి, లేకపోతే ముక్కు మొఖము తెలియని కొత్త వారికి వివరాలు ఇవ్వరు, ఇవ్వకూడదు మనమైనా.

పాపం, ఆయన ఒక గంటలోనే, పెద మామయ్య ఇంటికి వెళ్ళి, వివరాలు చెప్పి, శ్రమ అనుకోకుండా మాట్లాడించారు. 25 ఏళ్ల ముందు గొంతు, వినంగానే ఎక్కడ లేని ఆనందం, సాధించాము ఏదో ఇన్నేళ్ళ కు అని. ఓ రెండు గంటలు, 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, కష్ట సుఖాలు చెప్పకుని, ఇద్దరమూ సంతోష పడ్డాము.

ఎక్కడో విదేశం లో ఉన్న మనము, వెతికి పట్టుకుని, ఆయనతో మాట్లాడటం, నాకూ ఆయనకు సంతోషం ఆనందం. మంచివారు ఎప్పుడూ చిన్న విషయాలకే సంతృప్తి పడతారు, వారికి పెద్ద కోర్కెలు ఉండవు. వాళ్ళ చెల్లెలు అంటే పిన్ని తో కూడా మాట్లాడాను. వాళ్ళు సంతోషం గా అమ్మ తో మాట్లాడారు, గతం అంతా గుర్తు కు తెచ్చుకుని.

ప్రయత్నం చేస్తే మంచి పనికి, దేవుడు అంటే దేవుని లాంటి మనుషులు, మనకు అండగా వస్తారు, దోవ కనపడుతుంది. చుట్టాలు, స్నేహితులు చేయలేని పని ఇన్నేళ్లు, ఒక దేవుని కొత్త పాత్ర అంటే వ్యక్తి రూపంలో, ఒక మార్గం దొరికి, సహాయం చేసారు. వారికి ధన్యవాదాలు.

మామయ్య చెల్లెలు అంటే నాకు పిన్ని, గతం గుర్తు చేసింది. మామయ్య వాళ్ళ నాన్న, సదానంద రావు గారి ఆసుపత్రిలో ఉంటే, వాళ్ళ అమ్మ తోడుగా ఉంది.

మన నాన్న వెళ్లి, డాక్టర్ తో చెప్పారు అంట, మా అక్క పసుపు కుంకుమ మీరు నిలబెట్టాలి అని చేతులు పట్టుకున్నారు అంట. గట్టిగా చెప్పారు అంట. ఆయనకు చక్కెర కూడా ఇచ్చారు అంట, బాగా చూడమని.

ఎలా మరచి పోతాము, మీ నాన్న ను, సొంత మేనమామ లాగా, అండగా ఉన్నారు. అని చెపుతుంటే , కళ్ల వెంట నీరు వచ్చింది.

పమిడిపాడు పెద్ద మామయ్య కు అక్క కు, బట్టలు పెట్టాలి నేను, నాకు ఆ అవకాశం ఇవ్వమని, పెద్ద మామయ్య ను కోరాను. కనీసం ఆ మాట అన్నావు చాలు రా, ఇంకా ఇన్నేళ్ళ కు గుర్తు పెట్టుకుని అని నవ్వారు. అది ఇచ్చి పుచ్చుకునే గౌరవ మర్యాదలు.

గౌరవం మర్యాద అభిమానం కులం, గోత్రం, మతం, హోదా, ధనం, స్ధాయి ని బట్టి లేదా పుట్టుకను బట్టి కాదు, మన వ్యక్తిగత మర్యాద మంచితనం నడవడికను బట్టి ఉండాలి.

గుర్తు ఉంది కదా, మేము చదివి న ఊర్లో, అందరూ పంతులు గారు అంటారు, మేము కాదని చెప్పినా కూడా. గుళ్ళో చదివే స్పష్టమైన మంత్రాలు, ప్రవర్తన ఊరు మొత్తం విన్నారు చూశారు కాబట్టి. ఇప్పటికీ ఆ ఊరుకు పంతులు గారినే.

గతం మనం మరువకూడదు, గతం మరచిన వారికి పుట్టగతులు ఉండవు. మనకు సహాయం చేసిన ప్రతి వారు దేవుడే. ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి.

కానీ సహాయం చేసిన వారికి కీడు చేస్తే , ఇక జన్మలో మనకు సహాయం చేసే చెయ్యి దొరకదు. స్ధానం స్ధాయి ముఖ్యం కాదు, మంచితనం మంచిగుణం మంచిమాట ముఖ్యం ఏనాటికైనా. అహంకారం, మోసం ముందు గెలిచినా, చివరకు ఓడుతుంది సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,047,885; 104 తత్వాలు (Tatvaalu) and views 235,593
Dt : 20-Mar-2020, Upd Dt : 20-Mar-2020, Category : General
Views : 868 ( + More Social Media views ), Id : 425 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : find uncle after 25 years
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content