మామ్మ పిల్లల పై మనవడు ఘాతకం, జిల్లా పేరు మార్పు రావణకాష్టం - మతిమాలిన పెంపకం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1553 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1588 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మతిమాలిన పెంపకం, మొహం వ్యామోహం లో పతనమౌతున్న కుటుంబ మానవత్వ విలువలు. మన ఇంటి పాము, మనల్ని కాటేసి, ఇంకా ఎన్నో ఇళ్ళలో చిచ్చు పెట్టిన దాకా, మన మూర్ఖత్వ పతన అర్ధం లేని ప్రేమ మారదు.

దేవాలయానికి కనీసం బొట్టు పెట్టుకుని వచ్చి, 10 నిమిషాలు ఉండి ఓ పాట పాడి పోవాలి అన్న, ఇంగిత జ్ఞానం, 25 ఏళ్ళ లోపు పిల్లలకు/ యువకులకు లేకపోతే? తప్పు తల్లి దండ్రుల పెంపకం కాది దా? అదేమంటే, మా తల్లి దండ్రులను అవమానించద్దు అని ఇంకొక వితండ వాదన.

అవమానించింది పిల్లాడు/ యువకుడు/ కుటుంబం కాదా, బొట్టు లేకుండా? ఇది వారి కుటుంబానికి ఎప్పుడు అర్ధం అవుతుంది? ఇంటి నుంచే బొట్టు అంత చిన్న విషయమే, జాగ్రత్త లేకపోతే మర్యాద సంస్కారం సాంప్రదాయం తెలియకపోతే, ఇంక భార్యా పిల్లలు తల్లి దండ్రుల గురించి, మంచి బాధ్యత జాగ్రత్త చూడగలడా, చేయగలడా?

పోనీ నీకు ఇష్టం లేదు, గుడి కి రాకు. వచ్చి, దేవుని మరియు మన పెద్దల్ని సాంప్రదాయాన్ని అవమానించడం, వ్యతిరేక ఫలితాలు మీకు కరెక్టేనా? మరలా ఇక్కడ తగువులు, ఆదాయం పోతుందని, ఇటు వైపు ధర్మ కర్తల పెద్దల బాధ. అది మన దుస్తితి.

విన్నారా ఈ వార్త, విదేశం లో ఓ మనవడు, సొంత అమ్మమ్మ నే కాల్చి, దగ్గర లో ఉన్న బడి కి వెళ్ళి, పిల్లలను కాల్చేసాడు. పోలీసులు వెంటనే స్పందించి, అతనిని కాల్చేసారు. మైనరు/ యువకుడు అని లేదా ఇంకోటి అని జాలి చూపించలేదు. ఎందుకంటే, అతన్ని ఆపకపోతే, అతను ఇంకా కాలుస్తూ పోతున్నాడు.

ఈ వార్త వినంగాల్నే, ఎంత ఘోరమో చూడండి, విదేశాల్లో ఎంత విచ్చల విడి తనమో, ఎంత నిర్దయనో పిల్లలకు పిల్లలపై అంటాము, తుపాకి ఎలా వచ్చింది అంటాము. మన దగ్గర అలా కాల్చుకోవడం లేదు, ఎందుకంటే ఇంకా పిల్లల దగ్గరకు తుపాకులు రాలేదు, వస్తే, అంతకన్నా ఘోరం గా ఉంటుంది, కదా?

తుపాకి మన దగ్గర లేకపోతే, దొంగల దగ్గర మాత్రమే తుపాకి ఉంటే, మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని, ఒక వైపు ఓ పార్టీ ఓ జనసమూహం వాదన. తుపాకులు అందరి దగ్గరా ఉంటే, ఇదుగో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి వద్దు అని ఇంకొకరి వాదన.

మనము విపరీత స్వేచ్చ తో, ఎంత పతనము అయ్యము అంటే, వేశ్యా వ్రుత్తి వద్దు అంటే, ఒక వైపు సమస్యలు. పోనీ మీ ఇష్టం అంటే, ఇంకో వైపు సమస్యలు.

పెరుగుట విరుగుట కొరకే అన్నది, ఇందుకే. ఇటు 50 మంది వాదనలు, అటు 50 మంది వాదనలు, ఎందుకు వాదిస్తున్నారో ఇద్దరికీ తెలీదు, మరలా కొంతమంది అటు ఇటూ మారతారు.

ఎందుకంటే, ఎవరికి నీతి నియమం నిబద్దత మానసిక బలం లేవు, అవకాశ అవసర అరిషడ్వర్గాల బానిసలు.

రామయ్య తండ్రి అని రంగనాధ్ సత్యనారాయణ నటించిన, సాంఘీక సినిమా ఒకటి వచ్చింది 1975 దగ్గరలో, యూట్యూబ్ లో ఉంది ఇప్పుడు కూడా చూడండి. సినిమా చివర్లో, ఒకే ఇంట్లో పెరుగుతున్న ఇద్దరు పిల్లల మధ్యలో, ఒకరి ఈర్షా ద్వేషాలతో, అమ్మ గారాభ చెడు పెంపకం లో, వారి మధ్యలో తన్ను లాటలో, అహంకారము తో ఉన్న ఒక పిల్లవాడు, ఇంట్లో గోడ పై ఉన్న తుపాకి తీసుకుని, రెండో పిల్ల వాడిని కాల్చడానికి చంపడానికి, రోడ్ పై వెంటపడతాడు. ఆనాడే అలా ఉంటే, ఇప్పుడు మన పిల్లలలో ఆలోచన తగ్గి, ఆవేశం ఎంతో ఎక్కువ ఉంది?

ఎక్కడో ఒక చోట జరిగిన విషయాలో సినిమాలు గా తీస్తారు, వాస్తవ పరిస్థితి తెలియచేయడానికి. మన దేశం లో ధనం ఉన్న వారి పిల్లలు లేదా పెద్దలు ఏమి చేసినా, ఆ వార్త బయటకు రాదు, ధన అధికార బలం తో మూసేస్తారు. అవి అన్నీ బయటకు వస్తే, మనము ఇంకా ఘోరమైన వార్తలు వింటాము. పశ్చిమ దేశాలు ముక్కున వేలేసుకుంటాయి.

హీరో ఇంట్లో జరిగిన కాల్పులు, పిచ్చివాడు అన్న సర్టిఫికేట్ తో మాయం చేసారు. ఇక బయటకు రానివి, అర్ధం మార్చినవి ఎన్నో. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో కొత్త కేసు, కారులో బాలిక అని, అధికార వ్యక్తుల పిల్లలు ఉన్నారు అని, అంతా గందరగోళం, గప్ చిప్ సాంబార్ బుడ్డి, ఏమీ కనపడదు చట్టానికి.

అలాగే జిల్లా పేరు మార్చితే లేదా ఇంకో దానికి ఇంకోసారి, అది నచ్చినా నచ్చకపోయినా, ఎవరి ఇష్టం వచ్చిన విధము గా వారు, మూకలు రోడ్ ఎక్కి, తగల బెట్టి బండ్లు పడదోస్తూ నష్టం చేస్తే, ఎవరి లాభం ఎవరికి నష్టం? రేపు పన్నులు గా మన మీదనే వేస్తారు? ఆ పార్టీ వారని వీరు, ఈ పార్టీ వారని వారు, మధ్యలో మనల్ని వెధవలను చేస్తారు. సరే అది వారి రాజకీయం, రెండు వైపులా గేం అది. దానికి కోర్టులు వ్యవస్థ ఉంది.

కాని అందులో పాల్గొన్న, మన పిల్లల పరిస్తితి ఏమిటి? ఆ రోడ్డున వెళుతున్న స్నేహితులు బంధువుల జనాల పరిస్థితి ఏమిటి? ప్రాణం పోతే, జైలు కు పోతే? ఎందుకు ఈ ఆలోచన తల్లి దండ్రులకు, బంధువులు, స్నేహితులకు రాదు?

ఒకవేళ బతికి బయట పడితే, అతనికి పార్టీ పదవులు, అంతేనా? గత ఎన్నికలకు ముందు, అరటి తోటలు కాల్చిన వారికి, ఇప్పుడు పదవులు ఇచ్చారు. ఇప్పుడు కాల్చిన వారికి, రేపు పదవులు ఇస్తారు.

ఇదంతా తల్లి దండ్రుల పెంపక లోపం కాదా? పై మనవడి సంఘటనలో, పిల్లాడు అమ్మతో గొడవపడి, తాతా అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. ఇంట్లో తుపాకి కొని పెట్టుకుని, ఫొటోలు నెట్ లో పెడితే, ఎవరూ పోలీసులకి చెప్పలేదు. ఇది అమ్మ, అమ్మమ్మ, తాత, స్నేహితులు, బంధువులు తప్పిదము కాదా? ఆ పాపములో వీరందరికీ భాగం లేదా?

చెడ్డ వాడు మన బిడ్డ అయితే, మనము దాచిపెడితే ఇరుగు పొరుగు పోలీసులకు చెప్పకుండా, ఇంకో 18 మంది పసి పిల్లల ప్రాణాలు తీసిన పాపం, ఎన్నో కుటుంబాల్లో చిచు రగిల్చిన పాపం ఎవరిది? పిల్ల వాడిదా? అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత దా, బంధు స్నేహితులదా? మన వ్యవస్త దా?

అర్ధరాత్రి మన పిల్లలను పబ్ లకు పంపడం లేదా? లేక అలా ఇంట్లో పాములను పెంచుతూ, వారి తప్పుడు బుద్దులను వెనకేసుకు వస్తున్న మనదా? రేపు ఆ పిల్లాడు లేదా అలాంటి పిల్లలు, సొంత తల్లి తండ్రినే చిదిమేయడా/రా? ఈ లోపు ఎన్ని కొంపలలో చిచ్చు పెడతారో కదా?

Grandson try to do bad on grandmom and children, district name change Ravanakashtam - insane upbringing of parents?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1588 General Articles, 54 Tatvaalu
Dt : 03-Jun-2022, Upd Dt : 03-Jun-2022, Category : General
Views : 334 ( + More Social Media views ), Id : 1414 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : grandson , bad , kill , grandmom , children , district , name , change , ravanakashtam , insane , parents , upbringing
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content