గోరంత దీపం, కొండంత ఆధ్యాత్మిక ఆశ - రాయినైనా కాకపోతిని రామపాదము శోకగ - శ్రీధర్, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,920,970; 104 తత్వాలు (Tatvaalu) and views 229,540.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దేవుని మానసిక నైవేద్యము వాక్సుద్ది ద్వారా అంటే, ఈ పాటలో చెప్పిన విధముగా ఆలోచన ఉండాలి. దేవుని కే సేవ, జీవునికి మాత్రం సేవ చేయము అంటే? సొంత ముదుసలి తల్లి దండ్రి వద్దు, కనపడని దేవునికి సేవ మాత్రమే అంటే? ఫలితం శూన్యం.

ఇప్పుడు మాకు మనశ్శాంతి ఉంది, కడుపు నిండింది అని గమ్ముగా చాటుగా ఉంటే, ఇంక దేవుడు ఇచ్చిన, ఆత్మ ఆధ్యాత్మిక జీవ మానవత్వ క్రుతజ్ఞత జ్ఞానం, దేనికి ఉపయోగం? తర్వాతి జన్మ, మతి లేని మాణిక్యం గా ఉండమా?

తోటి దేవుని సంతానం మరియు వారి పిల్లలు అరిషడ్వర్గాలలో అష్టవ్యసనాలు లో పతనము అవుతుంటే, కనీసం మాటలు పాటలు రాతలతో అయినా, వారిని వారి కుటుంబాన్ని పతనం కావద్దని, రోజూ సంవత్సరాలుగా, నిస్వార్ధముగా వేడుకోవద్దా, మేల్కొలపవద్దా?

ఇది నరుని, అలాగే నారాయణ సేవ కదా? ఆయన మెచ్చడా? 2 నెలలలో, లక్ష మంది పైగా, యూట్యూబ్ లో మన మాటలు పాటలు పద్యాలు విన్నారు కదా? కార్తీక దీపం పాట, 2 రోజులలో, 2 వేల మందికి చేరింది, ఆయన చలవే కదా?

గాయకులు గా ఎవరైనా పాడవచ్చు, గొంతుతో ఈ పాట. కానీ ఆధ్యాత్మిక మనసుతో, చిత్తశుద్దితో పాడాలి అంటే, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు ప్రాపంచిక భ్రమలు జయించి ఉండాలి సుమా. లేదంటే, గరుడ పురాణ శిక్షలు తప్పవు. పంచభూతాలు కూడా నమోదు చేస్తున్నాయి, మన నటనలను.

దేవుడు మనకన్నా తెలివైన వారు, ఆత్మ బలానికే లొంగుతారు, ధనం ఆడంబర ఆర్భాటాలకు కాదు. ధనం మరియు నాగరికత తెలియని, భక్త కన్నప్ప అడవిలో ఏ చదువు సంధ్య ఏమీ నేర్చుకోలేదు, కానీ భగవంతుడు కనపడ్డారు కదా?

ఆయనకు అరిషడ్ వర్గాలు, అష్ట వ్యసనాలు అసలు లేవు. నిస్వార్ధం గా ఇవ్వడం మాత్రమే తెలుసు, తన సొంత కళ్ళు కూడా తీసి ఇవ్వగలరు సుమా.

ఎందుకంటే వారికి చిత్తశుద్ధి ఉంది. తనకేం కావాలో ఎప్పుడూ అడగలేదు, కోరలేదు. ప్రాపంచిక వాసనలపై ఆసక్తి అసలు లేదు. సంసారం లో ఉన్నా, తామరాకు నీటిలో ఉన్నా తడవనట్లే, తనూ ఉన్నారు, అలాగే ఇంకెందరో నేటికీ ఉన్నారు.

భక్త శబరి అంతే. భద్రాచల రామదాసు అంతే. కాల జ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు అంతే. వేమన కూడా అంతే. వీరి ఆలోచన, పూజ, తమ స్వార్ధం గురించి ఉండదు, కేవలము ఇతరుల క్షేమం గురించి మాత్రమే ఉంటుంది.

మరి మనం మన స్వార్ధం? ఇతరుల బాధ విని సేవ చేయడానికి, ఉచిత సమయం కూడా లేదంటాం. మరి మన పిల్లలూ, కనీసం మన మాట కూడా వినే లెక్కన లేరు. ముదుసలి వయస్సులో, ఇంక మనల్ని ఇంట్లో ఉంచుతారా? అందుకే పెద్దలకు, పిల్లలకు సంస్కార పెంపకం, విశ్వసనీయత, క్రుతజ్ఞత, మానవత్వం ఆధ్యాత్మిక మానసిక బలం ఉండాలి.

అది లేకుండా, మోక్షం దైవ దర్శనం ఎన్ని జన్మలెత్తినా కాదు. మరి ఈ భక్తి గీతం మనసుతో, పాడుకుందామా, ఆచరణలో దైవత్వం చూపిస్తూ? భక్తుడు పలు రకాలుగా భగవంతునికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు, ఈ పాటలో చెప్పిన విధముగా.

రాయినైనా.. కాకపోతిని, రామపాదము శో.క.గ..
బోయనైన కాకపోతిని, పుణ్య చరితము పా.డగ..
పడవనైనా కాకపోతిని, స్వామికార్యము తీ.ర్చ.గ..
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యము నేలగా..

అడవి లోపల పక్షినైతే, అతివ సీతను కా.చనా.
అందువలనా. రామచంద్రుని, అమిత కరుణను నోచనా.
కడలి గట్టున ఉడతనైతే, ఉడత సాయము చేయనా..
కాలమెల్ల, రామభద్రుని, వేలిగురుతులు మోయనా ||రాయినైనా.. కాకపోతిని||

కాకినైన కాకపోతిని, ఘాతుకమ్మును చే.యు.చూ.
గడ్డిపోచను శరము చేసె, ఘనత రాముడు చూపగా
మహిని అల్ప.జీవులే, ఈ మహిమలన్ని నోచగా
మనిషినై జన్మించినానే, మత్సరమ్ములు రేపగ
మదమత్సరమ్ములు రేపగ ||రాయినైనా.. కాకపోతిని||

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Music K.V. Mahadevan; Performer Susheela;Writer Aarudra; Gorantha Deepam, Year 1987.Gorantha Deepam Songs, Rayinaina Kakapothini, Sridhar, Vanisri

గోరంత దీపం పాటలు, రాయినైనా కాకపోతిని, శ్రీధర్, వాణిశ్రీ

Gorantha, Deepam, Goranta, dipam, Rayinaina, Kakapothini, Sridhar, Vanisri
Gorantha Deepam movie Song, Rayinaina Kakapothini, Sridhar, Vanisri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,920,970; 104 తత్వాలు (Tatvaalu) and views 229,540
Dt : 03-Nov-2022, Upd Dt : 03-Nov-2022, Category : Songs
Views : 436 ( + More Social Media views ), Id : 1606 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gorantha , deepam , mountain , spiritual , hope , rayinaina , kakapothini , sridhar , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content