గోపీ గోపికలు, మానసిక బలహీనతతో, ఎప్పుడూ ఎదుటి వారినే నెగెటివ్ గా చిత్రీకరిస్తారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,935; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Gopi Gopika, mentally weak, always portray others negatively?
- Our Writing Naivedya Seva మన వ్రాత నైవేద్య సేవ

Our vocal, Writing, Photo, Video, Talk, Social service, Mental, Physical Naivedya Seva, for Manasik Chaitanya AcharaNa divine devotees - Satsangam

మన గాత్ర, వ్రాత, ఫోటో, వీడియో, మాట, సామాజిక సేవ, మానసిక, శారీరక నైవేద్య సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం

గోపీ గోపికలు (అంటే గోడమీద పిల్లులు, మానసిక బలహీనులు, ప్రాపంచిక మోహ బ్రమల దాసులు, చంచల స్వభావులు), ఎప్పుడూ ఎదుటి వారినే, నెగెటివ్ గా చిత్రీకరిస్తారు, తమను పాజిటివ్ గా (పతన మార్గం అని తెలిసినా సరే) అనుకుంటారు. వీరు 75 శాతం ఉంటారు మన చుట్టూ, జాగ్రత్తలు సుమా. కలియుగం 3 పాదాల పాపం అని చెప్పింది కదా, కానీ వారే పుణ్యం అనుకుంటారు. మంచి వాటికి స్పందన ఉండదు, కానీ చెడు వాటికి మాత్రం, వెంటనే అన్ని కదులుతాయి.

చిత్రం ఏమిటి అంటే, వారి గొయ్య వారే తీసుకుంటున్నారు అని, వీరికి చివరి దాకా అర్ధం కాదు. వీరే అంటారు, లోకమంతా పాపం పెరిగిపోయింది అని. ఆ నలుగురితో నారాయణ, మేము పాపులమే, మాతో పాటుగా, ఇంకో పది మందికి పతనం లో స్వర్గం చూపిస్తాము అని మాత్రం ఒప్పుకోరు.

చూడండి ఆయన సందేశాలు, ఎంత నెగటివ్ గా ఉంటాయో. ప్రతి దానికి భయం ఏమిటి అండి, తిని తాగి తిరుగు ఎంజాయ్ చెయ్యి, రోగం తో అర్ధాంతరముగా పో, ఆస్తులు అమ్ముకుని లేదా వెన్నుపోటు గుండెపోటు, లాగా ఉండాలి. మాలాంటి పాజిటివ్ (పతన) మైండ్ పీపుల్ కి అసలు నచ్చవు అంటూ ఈ ఉదాహరణలు చెపుతున్నారు

1. మా సొంత పాపపు డబ్బు తో, మా పిల్లలు కు చాక్లెట్స్ కేక్ ఐస్ క్రీం లు బేకరీ మసాలాలు పెట్టి బయట తిండి పెట్టించి, రోగిష్టి వారిగా, మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్ తో చేయవద్దా? పుణ్యం గా వచ్చిన ధనం అయితే, బాధ్యతగా మంచికే ఖర్చు పెడతాం కదా.

2. జంతువులు ను చంపి లేదా ఫ్రిజ్ లో నాన పెట్టుకుని, లేదా హోటల్ లో కుళ్ళినా తింటే తప్పా? అంటే మాకు రోగాలు రావద్దా, ఆసుపత్రికి పోవద్దా, గోఫండ్ కలెక్షన్స్ వద్దా? రేపు బకాసురుడు వస్తే, ఇంట్లో అందరినీ ఆనందం గా ఆహారం గా ముందు గానే పంపమా, తప్పించుకోలేకపోతే చివర మేము వెళతాము?

మేము తిన్నట్లే, వారు తినాలి కదా? ఎవరి ఇష్టం వారిది, నాలుక రుచి వారిది, పాప పుణ్యం భూతదయ మాకు అనవసరం, బలవంతులదే రాజ్యం మా లెక్కలో. అడవిలో క్రూర జంతువులు మాత్రం, మనుషులను తినకూడదు, ఇదే మా సమ న్యాయం. తిరుపతిలో కర్రలు ఇచ్చారు కదా.

ఇప్పుడు రింగ్ రోడ్ మీద, పిల్లలకు బండ్లు ఇచ్చి, స్వర్గం తొందరగా చూడండి అని పంపటం లేదా? కాలేజీ లో బయట మత్తు మందు ఆపగలమా? పెద్దలు చిన్నలు కలసి, మత్తు పుచ్చుకోవడం లేదా? అదేమన్నా ఇబ్బందా మాకు?

3. మా ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు కు సమాన వైద్యం ఇవ్వం, కృతజ్ఞతలు విశ్వసనీయత మా వంశం లో లేవు, అసలు వాళ్ళు కే అవి తెలీదు, అట్లాగే వారు కోట్లు సంపాదించింది, కేవలం అవసరం అవకాశం ధనం ఆస్తి తో. ఇది కూడా తప్పా?

4. సంతానం కు సంస్కారం ఎందుకు నేర్పాలి, ఎవరికి కావాలి, అంత సమయం ఎక్కడ ఉంది, సంపాదన పరుగులో. రేపు మాకు ముదుసలి తనం/ రోగం రాదు, చేతులు కాళ్ళు మైండ్ అన్ని బాగా కదులుతాయి 70 వయసు అయినా. డబ్బుతో ఆశ్రమాలలో ఉంటాము ఉన్నన్ని రోజులు, తర్వాత శరీరం కదలనప్పుడు ఆశ్రమం వారు బయటకు నెట్టినప్పుడు రోడ్ కు ఓకే. ఆసుపత్రులో ఉచితముగా కానుపు కు బదులు సిజేరీన్ చేస్తారు కదా, అనారోగ్యశ్రీ డబ్బులు వారికే. మేము పిల్లలు దగ్గర ఉండం‌, ఉండలేము ఇన్నాళ్ళ మా పాపపు పెంపకం వలన.

5. సంతానం కు సంస్కారం అవసరం లేదు, మొన్న పెళ్ళి సంబంధానికి వెళ్ళి మాట్లాడాము, మీ సంతానం తాగుబోతు, తిరుగుబోతు, ఇంకే బోతు అయినా పర్లేదు, ఆస్తి ఉంది, బీజం/ క్షేత్రం ఉంది చాలు, విడాకులకు వెళితే సగం వస్తుంది చాలు అంటున్నారు. 15 ఏళ్ళకే మాట వినకుండా, మమ్మల్నే దండించద్దా? చిన్నవయసులో నే, రోగాలతో టాబ్లెట్ లు మింగవద్దా, కళ్ళ జోడు వద్దా?

6. సంతానం కు భగవద్గీత, రామాయణం, భాగవతం అవసరం లేదు. రేపు ఇతర మతాల వారు వచ్చి, మీ కష్టాలు రోగాలు తగ్గించి కోటీశ్వరులను చేస్తాం అంటే, మా సంతానం మానసిక బానిసలుగా మతం మారవద్దా? కాలేజీలో ఇతరుల మాయలో పడవద్దా? ఇతర మతాల బాబాయిల దగ్గరకు పోవద్దా? మా తాతకు కూడా, బ్రహ్మం వేమన రాఘవేంద్ర స్వాములు తెలీదు. తెలుగు వారిని నమ్మద్దు అంటారు కదా, అందుకే మేము మరాఠీ లేదా ఇతర భాషల/ మతాల గురువు నే నమ్ముతాము. వారి పేరు మీద వ్యాపారాలు చేస్తాము.

7. అవునండి మేము చంచలం, మాకు 2 నాల్కలు ఉన్నాయి. మా వంశములో, మిత్రులు, బంధువులు అందరూ అంతే, నష్టం ఏముంది? ప్రొఫైల్ ఫోటో పెట్టం, రీడ్ రిసీప్ట్ ఉంచం, అంతా మాయ అని తెలిసినా, వేల స్నేహితులు మాతో. మా పిల్లలు మాట మీద ఉండరు, అలాంటి వారికే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇప్పుడు.

మేము 3 ఇళ్ళు, 30 లక్షల అప్పు, 3 కార్లు, 3 బంధాలు, 3 పదవులు, 3 ఆదాయాలు, 3 చెడు అలవాట్లు, 3 నాల్కల వారితోనే తిరుగుతాము, వారికే స్పందిస్తాము, వారికే తలవంచుతాము, అదే మా సర్కిల్, ఇతరులకు ప్రవేశం లేదు. నక్క పాము పులి లాంటి సుగుణాలే, మా బాచ్ లో ఎక్కువ. మా భాగస్వామి మరియు సంతానం, ఎక్కడ ఉన్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏమి చేస్తున్నారో కూడా మేము అసలు పట్టించుకోం, పాజిటివ్గా, స్వేచ్చ ఉండాలిగదా.

రాముడు క్రిష్ణుడు అమ్మ వారి పూజ, ప్రసాదం కోసమే కానీ, రాముని సీత గుణాలు అసలు మాకు తెలీవు, మేము ఆచరణ భక్తులము కాదు. గుళ్ళు గోపురాలు యాత్రలు సేవలు అన్ని కాలక్షేపానికి, ఆచరణలో చెయ్యడానికి కాదు. మా ఇంట్లో ఎవ్వరు, ఉదయం 5 కి లెగవరు, చాలా? ఎందుకు లెగవాలి? మేము లెగవం. శాఖాహారం నచ్చదు, రోగాలు కల్తీలు ఖర్చు నీసు కన్నా తక్కువ ఎవరికి కావాలి? ఇంట్లో నిలకడ ఉండదు, ఊరిమీదే తిరుగుళ్ళు.

8. ఆయనవి చదవం, గొంతు విప్పి పాడం, మంచి రాయం పెంచం పంచం మెచ్చం, యోగా చెయ్యం, ధ్యానం చెయ్యలేము, మేకప్ లేకుండా ఇంట్లోనే తిరగము, గుణ ఆభరణాలు మాకు వద్దు, ఖర్చుతో నగ ఆభరణాలే మాకు ఇష్టం, దొంగలకు కూడా ఇష్టం. మేము మా సంతానం మానసిక బలహీనులం అని తెలిసి, మమ్మల్ని ఇలాంటి కష్టమైనవి అడగవచ్చా? అదే షాపింగ్ 3 గంటలు చేస్తాం, టీవీ ఓటీటీ సోషల్ మీడియా 3 గంటలు చూస్తాం, హోటెల లో తిండికి గంట గడుపుతాం.

అసలు ఈయనకు ఎందుకు మా కుటుంబ క్షేమం? ఈయన ఎవరు, ఏమిటి సంబంధం? మా సంపాదన, మా బ్రమలు, మా పతనం, మా గొయ్యి, ఎవరికీ మేము జవాబు దారీ కాదు. మాకు మిత్రులు సునామీ, భూకంపం, వరదలు, తుఫానులు, యాక్సిదెంటులు. అంతా పాజిటివ్. ఇంకా ఎన్నో కలియుగ సుగుణాలు మావి, చెప్పుకుంటూ పోతే, పేజీలు పేజీలు.

అసలు ఏ గురువు అయినా, సాధన స్టేటస్ మార్పులు వారం వారం అడుగుతారా, మేము చెపుతామా? చెప్పడానికి మా దగ్గర ఏముంది, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం తప్ప? అడిగితే, ఆచరణలో చూపమని, ఆ ఆశ్రమములో ఒక్క పనికిమాలిన వాడు ఉంటాడా, మరలా అక్కడకు వెళతారా? వారికి ఆదాయం వస్తుందా?

అసలు మా పెద్దలు, భాగస్వామి, పిల్లలు ఎప్పుడూ కుటుంబ సంస్కార క్షేమం గురించి, భవిష్యత్ మంచి గురించి, అసలు మాట్లాడము. అన్ని మామ వెన్నుపోటు, బాబాయి గుండెపోటు, పంచభూతాల శిక్షణ తర్వాతనే. మంచి మాట్లాడినా ఎవరూ వినరు, ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే.

అలా పాజిటివ్ గా ఉండాలి కానీ, సంస్కారం గా ఉండాలి, ఇంట్లో నే శాఖాహారం తినాలి, ఆసుపత్రులకు రోగాలతో వెళ్ళకూడదు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వద్దు, పెద్దల మాట విని గౌరవించాలి, ముదుసలి వారి సజీవ గురువు సేవ చెయ్యాలి సొంత అమ్మ అయ్యకే దిక్కులేదు, ఇలాంటి తప్పుడు నెగటివ్ మాటలు మా వంశములో అనుకోము, అసలు మాకు తెలీదు. అందుకే మేము స్పందించం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,935; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500
Dt : 15-Feb-2024, Upd Dt : 15-Feb-2024, Category : General
Views : 164 ( + More Social Media views ), Id : 2021 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gopi , Gopika , mentally , weak , mind , always , portray , others , negatively
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content