మన గొప్ప అధికారులు నాయకులు మంచితనం, మన ప్రజలకు అలాగే ఇతర జిల్లా లలో ప్రచారం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,117; 104 తత్వాలు (Tatvaalu) and views 225,026.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

నాయకులు మరియు అధికారులూ, మేము పంపే సమాచారం లో ఏదైనా తప్పులు ఉంటే మన్నించి దయచేసి సరిచేయండి, అన్ని మాకు తెలుసు అని కాదు, ఆ తప్పు పాపం లో, మేము మెచ్చిన నాయకులు అధికారులు ఉండకూడదు అని మా భావన.

మీ శ్రేయోభిలాషులం, అందుకే దైవ దీవెనలు, ఆరోగ్య రక్షణ లు, తల్లి సేవ గురించి కూడా మీకు పంపుతున్నాం. అందరూ గమ్ముగా ఉంటే, మీరొక్కరే ఎందుకు ధర్మం అడగాలి అంటారా? భీష్ముని బాధ గుర్తు కు వచ్చి. మంచి వారైన మీరు, కర్ణుని లా కాకూడదని, క్షేమం కోసమే.

మీకు మా నుంచి ఓ సందేశం వచ్చింది అంటే, అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా, కనీసం ఒక్క అధికారి లేదా నాయకుడు, ప్రజలతో పాటుగా అందుకుని ఉంటారు. మన జిల్లా భాగోతం చూస్తున్నారు, నవ్వుతూ ఉంటారు. వారెవరైనా, మీ రాష్ట్ర అధికారులు కూ, మంత్రి కీ పంపవచ్చు.

అధికార ప్రతిపక్షాలు కూడా, అందుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మీ నుంచి నిర్లక్ష్యం లేదా బెదిరింపులు ఉంటే, అవి జగనన్న కు చెడ్డ పేరు తెచ్చేవి కాబట్టి, అధిష్టానం కు తెలియాలి కదా? ఎవరు ప్రజలకు దూరంగా ఫోన్ లు ఆపుకున్నారో, అందరికీ తెలియాలి. అలాగే చంద్రన్న, పవనన్న, బీజేపీ నాయకులు కూడా చేరుతున్నాయి. మా తప్పులు ఉంటే, వీళ్ళంతా పెద్దలుగా, మమ్మల్ని తిట్టి ఆపగలరు.

రేపు మనకు లేదా వారికి ట్రాన్సఫర్ అయితే, మన పరిస్థితి వారికి, అవగాహన ఉంటుంది. అలాగే వారి శాఖలో కూడా జాగ్రత్తలు పడతారు, ఓహో ఆ జిల్లా ఆ శాఖలో, ఇలా తప్పులు జరిగింది అని.

ఎవరమైనా తప్పులు చేస్తున్న లేదా నిర్లక్ష్యం వృత్తి రాజ ద్రోహం అయినా, ప్రజల సొమ్ము తీసుకుంటూ, మనం లేదా మన పిల్లలు, ఆ పాప ఫలితాలు తప్పక అనుభవించాలి. ఈ పదేళ్ళు లో జరిగిన ఉదాహరణలు ఎన్నో. మనకు అవసరమా ఆ ఫలితాలు? మనకు తెలియని, కాల మృత్యువు, హోదా ఐశ్వర్యం పదవి స్థితి చూడదు సుమా, కనికరం కూడా చూపదు పాపాలకు.

భీష్ముడు అంతటి వాడే, ద్రౌపది కి అన్యాయం జరుగుతుంటే, ఆపగలిగి ఉండి, గమ్ముగా ఉన్నందుకు, చివరలో శిక్ష తప్పలేదు. మా బాధ్యత, కొన్ని తప్పులు చూపించడం వరకే. అది తప్పు అయితే చర్య తీసుకోవడం లేదా ఇందులో తప్పు లేదు, మిగతా ప్రజలను కూడా అలాగే చేయమని చెప్పడం, మీ బాధ్యత, పౌరులు మీడియా ప్రజాస్వామ్యం ను గౌరవించి.

పై అధికారులు దాకా, వెళ్ళనీయకుండా వారికి తలనొప్పి లేకుండా కిందనే ఆపాల్సిన బాధ్యత సీఐ, గ్రామ పట్టణ అధికారులు, మీద ఉంది, మీకు భారత రాజ్యాంగం అలాగే మీ వృత్తి ధర్మం అలాగే పబ్లిక్ సర్వెంట్ అన్న సృహ ఉంటే, జీతం ఎందుకు తీసుకున్నామని అర్థం తెలిస్తే.

అలా జవాబు చెప్పిన ఆత్మాభిమానం గల నాయకులు అధికారులు ఉన్నారు. వారు మాట పడరు, తప్పులు సహించరు. వారంటే మాకూ గౌరవం, వారి జోలికి పోము ఎప్పుడూ.

మీకు సమస్యలు, స్ధానిక నాయకులు తో ఉంటే, ముందే నిర్భయంగా చెప్పండి. మీ ప్రైవసీ గోప్యత కు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే పై అధికారులు దగ్గర చులకన కాకుండా, ముందే ఎమ్మెల్యే ఆపుతున్నారు అని సమస్య కు కారణం చెపితే, వారి అధిష్ఠానం దగ్గరకు తీసుకొని వెళతాం ఎమ్మెల్యే మోసం ను, అభిజ్ఞ వర్గాల భోగట్టా అని.

ప్రతి చిన్న విషయానికి కలెక్టర్, ఎస్పీ, జిల్లా, ఆ పైన అధికారులు దగ్గరకు మేము వెళితే, ఇక మీకు విలువ ఏముంది? మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు, జిల్లా అధికారులు ఎందుకు ఇవ్వాలి? మీ అసమర్ధత వలన, మాదా కా వస్తే, అన్నిటికి మేమే జవాబు చెపుతున్నాం అనరా?

పిల్లలు తప్పు చేస్తే, పెద్ద వాళ్ళ నే మనం తప్పు పడతాం, పిల్లల ను ఏమీ అనలేం. అలాగే పంచాయతీ సెక్రటరీ లేదా సీఐ తప్పు చేసినా, అడిగేది జిల్లా కలెక్టర్, ఎస్పీ, మరియు జిల్లా అధికారులు ను మాత్రమే, అంతే గానీ మీ మీద కోపం అగౌరవము కాదు.

ఎందుకంటే, వారి నాయకత్వం లో ఓ గ్రామం లేదా పట్టణం లో ధర్మం న్యాయం, ఇంత అధ్వాన్నంగా ఉంది అంటే, ఇక జిల్లా మొత్తం పరిస్థితి ఎలా ఉందో అని వారు, అప్రమత్తం చేయాలి.

దాని పాపం మోయాల్సింది కూడా, జిల్లా అధికారులు మరియు ఆ జిల్లా మంత్రి, నేడు లేదా 50 ఏళ్ల తర్వాత అయినా. కాలం ఏ ఒక్క తప్పు ను వదలదు. మనకు మన తర్వాత తరాలకు, దాని ఫలితాలు ను దగ్గర ఉండి మరీ, రుచి చూపిస్తుంది.

మన గొప్ప అధికారులు నాయకులు మంచితనం, మన ప్రజలకు అలాగే ఇతర జిల్లా లలో ప్రచారం చేయాలన్నదే మన సంకల్పం. చూడండి, మొన్న అనంత కలెక్టర్ ను, ఎమ్మెల్యే దూషించడం, తప్పు అని, మేం ఎలుగెత్తి చాటి, వైకాపా అధిష్ఠానం పెద్దలకు చేరవేసాం.

కొంత అయినా మంచి చేద్దాం, కరోనా మనల్ని ప్రేమతో పలకరించే ముందు. భగవంతుడు అడిగేది పైకి పోయాక మొదటి మాట, అరిషడ్ వర్గాల ను ఎంత శాతం జయించ గలిగావు? వృత్తి ద్రోహం, మాత పిత ద్రోహం చేయలేదు కదా అని. జాగ్రత్తలు సుమా.

ధన్యవాదాలు, మీ శ్రేయోభిలాషులం. మంచి వాళ్ళం కాబట్టే, ఇన్నాళ్లు కలసి సాగుతున్నాం, ఇంకా సాగుదాం, దేవుని ముందు తలవంపులు వద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,117; 104 తత్వాలు (Tatvaalu) and views 225,026
Dt : 04-Apr-2021, Upd Dt : 04-Apr-2021, Category : Politics
Views : 747 ( + More Social Media views ), Id : 1071 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : goodness , prakasam , officers , leaders , propagated , publicity , people , districts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content