మనసున్న మంచి మాటల పాట - ఆది భిక్షువు వాడినేది కోరేది, ఈ గాలి ఈ నేల (సిరివెన్నెల) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,935; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మంచి మనసు విలువలు ఉన్న దర్శకుడు విశ్వనాధ్ గారు, ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఓ మంచి సినిమాకు కలిస్తే పనిచేస్తే, సంగీత ప్రియులకు మనసు పులకిస్తుంది.

శివయ్య చేసిన పనులు చమత్కారంగా చెపుతూ, ఆయనను ఏమి అడుగుతాము, ఏమి ఇస్తారు అని నర్మగర్భముగా వేదాంతాన్ని సరళ పదాలతో చెప్పారు. బాలు గొంతు మాధుర్యాని ఈ పాటలో కూడా ఆస్వాదించండి. పుణ్యం తో పాటు, మనశ్శాంతి కలిగిస్తుంది, భక్తి పెరుగుతుంది. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు సుమా, మరి ఆయనను పట్టుకుని, పొగడుతూ తెగడుతూ, సున్నితముగా ఎలా రాశారో మీరూ చదివి పాడి ఆనందించండి.

ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు, నను గన్న నా వాళ్ళు అంటూ మన మాత్రు భూమి అలాగే మన వారిని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందము తో మనమూ పాడుకోవచ్చు. ఎన్నాళ్ళో గడిచాక, ఇన్నాళ్ళకు కలిసాక, ఉప్పొంగిన గుండెల కేక, ఎగసేను నింగిదాక అని మనమూ సంతోషముగా అనవచ్చును.

1) ఆది భిక్షువు వారినేది కోరేది, బూడిదిచ్చేవారినేది అడిగేది
ఏది కోరేది.., వారినేది అడిగేది. - 2 సార్లు

తీపి రాగాల ఆ కోకిలమ్మకు, నల్లరంగు నలమిన, వారినేది కోరేది 2
కరకు గర్జనల, మేఘముల మేనికి, మెరుపు హంగు, కూర్చిన వారినేది అడిగేది
ఏది కోరేది, వారినేది అడిగేది 2

తేనెలొలికే పూలబాలల కు, మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన, వారినేది కోరేది 2
బండరాళ్ళను చిరాయువుగ, జీవించమని ఆనతిచ్చిన, వారినేది అడిగేది
ఏది కోరేది, వారినేది అడిగేది 2

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప, దరిజేరు మన్మధుని, మసిచేసినారు ...వారినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప, తలపోయు దనుజులను, కరుణించినారు... వారినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి, ఉగ్గుశంకరులు... వారినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి భోళాశంకరులు ||ఆది భిక్షువు||

2)Ee Gaali Ee Vela
S. P. Balasubrahmanyam, P. Susheela
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు 2
ననుగన్న నా వాళ్ళు ఆ ఆ ఆ ఆ, నా కళ్ళ లోగిళ్ళు 2 ||ఈ గాలి ఈ నేల||

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక - 2 లైన్లు 2 సార్లు
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక 2
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక 2
ఎగసేను నింగి దాక ||ఈ గాలి ఈ నేల||

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను - 2 లైన్లు 2 సార్లు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను 2
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను 2 ||ఈ గాలి ఈ నేల||

కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినుకులై - 2 లైన్లు 2 సార్లు
గగన గళము నుండి అమరగాన వాహిని ఆ... 2
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడె
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే ||ఈ గాలి ఈ నేల||

LYRICS - SIRIVENNELA, MOVIE - SIRIVENNELA, SINGER - SP BALU, 1986
Stars - Benergy, suhashini  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,935; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003
Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019, Category : Songs
Views : 2276 ( + More Social Media views ), Id : 117 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sirivennela , Aadi Bhikshuvu , Eegali Eenela , Benarji , Suhasini , Mun Mun Sen , meena , Samyuktha , Viswanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content