పదేళ్ళు గా ఎదగని రాష్ట్ర సున్నా సీట్లు కు, కదలని పలకని అరవని, బీజేపీ అనుభవజ్ఞులు ఎందుకు? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* సోము, సునీల్, జీవిఎల్ తప్ప
* తెలంగాణా బీజేపీ నాయకులను
* యువ నాయకత్వ స్థాయి వాడి వేడి
* కోవర్టులు గా, 3 ముక్కల ఆట
* పురందేశ్వరి, సత్యకుమార్, డీకే అరుణ
* విమర్శించడానికి భయం
* జగన్, పవన్, లోకేష్ లాంటి
* తిరుపతి లో స్ధానిక పార్టీ
* మోదీ తో చెప్పి, రాష్ట్ర జిల్లా
* వైసీపీ నాయకులకు కూడా
* గూగుల్ లాంటి సెర్చ్ సంస్ధలు
* స్ధానిక బీజేపీ, తెదేపా, జనసేన
* గెలిచి అధికార ధర్మవరం ఎమ్మెల్యే
2 min read time.

బీజేపీ నాయకులు రా, మీరు ఎంత గట్టిగా జవాబు చెబుతున్నా, అవి ప్రజలకు చేరడం లేదు సరిగ్గా, అని 2 ఏళ్లుగా మొత్తుకుంటున్నాము, మీలో చలనం మార్పులు దిద్దు బాటులు లేవు. link.

సోము, సునీల్, జీవిఎల్ గార్లు తప్ప, గట్టిగా గర్జించే ఇంకో గొంతు, కనపడడం వినపడడం లేదు.

మీటింగ్ ల లో కనపడితే ఏవో 4 ముక్కలు పలికితే, ఉపయోగం లేదు.

ఎంత ఘాటు గా తేలిక పదాలలో, బొమ్మలతో వీడియోలతో విమర్శించాలో, ప్రజలకు చేరేటట్లుగా హత్తుకునేటట్లుగా, తెలంగాణా బీజేపీ నాయకులను చూసి నేర్చుకోవడం లేదు. మీకు సొంతముగా రాకపోయినా, టీం ని పెట్టుకుని నడిపించవచ్చు, అదీ చేయడం లేదు.

తాతయ్య అమ్మమ్మ స్థాయి, చల్లటి ఆవేశ విమర్శల స్థాయి నుంచి, యువ నాయకత్వ స్థాయి వాడి వేడి విమర్శలకు ఎప్పుడు వస్తారు?

ఉత్తర దేశ సునీల్ గారి అరుపులు ఎంత కష్టపడి నా, తెలుగు వారు పట్టించుకోరు.

కనీసం పవన్ ను మచ్చిక చేసుకుని, ఆయన ద్వారా అరిపించి మురిపించి, లాభం పొందడం కూడా చేతకాదు.

మల్లెపూలు చేతిలో ఉన్నా, ఏం చేసుకోవాలో తెలియని, కనీసం ముక్కుతో వాసన చూడాలి లేదా దేవునికి దండ వేయాలని కూడా తెలియని, అద్వాన్న అమాయక దిక్కుమాలిన పరిస్థితి, ఆంధ్రా రాష్ట్ర బీజేపీ ది. అంగట్లో అన్ని ఉన్నా, అల్లుడు నోట్లో శని, వీరికి సరిగ్గా సరిపోతుంది, 2 ఏళ్ళు గా చెపుతున్నాము.

రాష్ట్ర అధ్యక్షుడు సోమూకు ఎవరూ సహకరించడం లేదు, గోతులు తీస్తున్నారు, కోవర్టులు గా, 3 ముక్కల ఆట ఆడుతూ. వీరు ఎదగరు, ఇంకొకర్ని ఎదగనీయరు, పార్టీని నిలబడ నీయరు.

కేంద్ర పురందేశ్వరి గారు, కనీసం తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్ధాయిలో కూడా పోటీ పడటం లేదు. ఒక్క సారి దయచేసి అరుణ గారి ఫేస్బుక్ చూడండి, కనీసం అదే పద్దతి అనుసరించండి, తప్పులేదు. ప్రకాశం జిల్లా కు, చీరాల పర్చూరుకు, కనీసం సంవత్సరము గా తెచ్చింది ఏమీ లేదు.

ఇంకొకాయన కేంద్ర తెలుగు సభ్యుడు సత్యకుమార్, అసలు అమావాస్య చంద్రుడు. అసలు ఎందుకు ఇచ్చారో పదవి తెలీదు. ఈయన కన్నా, పురందరేశ్వరి గారు నయం, ఎదో ఒకటి ఫేస్బుక్ లో పెడుతున్నారు.

జగనన్న ను విమర్శించడానికి భయపడుతున్నారు. లేదా రాజీనామా చేసి, ఇంకొకరి కి అవకాశం ఇవ్వండి, అన్నం పెట్టి హోదా ఇచ్చి గౌరవించిన పార్టీకి, మౌనముగా పట్టనట్లు ఉండి, అన్యాయం చేయకండి.

రాష్ట్ర ప్రధాన బీజేపీ నాయకుల ను, మొత్తం టీం ను మార్చి, రెండో శ్రేణి చురుకైన యువ నాయకులకు ఇవ్వాలి, అని బీజేపీ శ్రేణుల అభిలాష.

వైసీపీ జగన్, జనసేన పవన్, తెదేపా లోకేష్ లాంటి యువ నాయకులు ఉంటే, ఆవేశపూరిత ఉపన్యాసాలు ఇస్తుంటే, రాష్ట్ర బీజేపీ కదలలేని అరవలేని రాయలేని చెప్పలేని, వృద్ధ నాయకుల నాయకత్వం లో, ఆయాస పడుతుంది. కనీసం మోదీ అమిత్షా లాగ కూడా, పరుగులు మాటలు చేతలు లేవు.

పదేళ్ళు గా సొంతగా ఎదగని రాష్ట్ర సున్నా సీట్లు కు, కదలని మెదలని పలకని అరవని, అనుభవజ్ఞులు ఎందుకు? రెండో మూడో శ్రేణి చిన్న చురుకైన నాయకులు సరిపోరా అంటున్నారు అభిమానులు.

తెలుగు ప్రజలు, ఏళ్ళు గా స్ధానిక పార్టీలు ను ఆదరిస్తున్నారు కాబట్టి, తిరుపతి లో స్ధానిక పార్టీ, జనసేన పవన్ ను ముందు పెట్టుకుని, ఆంధ్రా లో పాగా వేయాలని కూడా, కనీస జ్ఞానం ఆలోచన లేదు, రాష్ట్ర నాయకులు కు అని గుసగుసలు.

ఇలాంటివి పదేళ్ళు గా వింటూ, దులుపుకు పోతూ కళ్ళు చెవులు మూసుకునే ప్రయత్నం లో, ఆంధ్రా బీజేపీ నాయకులు.

ఇన్నాళ్లు కేంద్రంలో మోదీ ఉన్నప్పుడు కూడా, ఒక్క సీటు సాధించే ప్రయత్నం చేయని , పనికిరాని తెలివిలేని నిబద్దతలేని రాష్ట్ర నాయకులు, మోదీ తర్వాత, వందేళ్లు కు అయినా, సీట్లు సాధిస్తారా?

వీళ్ళను నిద్ర లేపేది ఎవరు, ముందుకు నడిపించేది ఎవరు, మాటలు చేతలు నేర్పేది ఎవరు?

గతంలో ఎన్నోసార్లు రాష్ట్ర బీజేపీ నాయకులు కు ఎంపీలు కు విన్నవించాము. ప్రతి వీడియో తో పాటుగా, నాలుగు ముఖ్య పాయింట్లు, తెలుగు లో రాయండి సోషల్ మీడియా లో అని. link.

మోదీ తో చెప్పి, రాష్ట్ర జిల్లా పట్టణ గ్రామ అధికారులు తో, సోషల్ మీడియా లో ప్రభుత్వ పధకాల ప్రచారం చేయాలని, అలాగే కేంద్ర శాతం, రాష్ట్ర శాతం స్పష్టం గా చెప్పాలని. వీరు అడగరు, కేంద్రముతో చేయించరు.

రాష్ట్రం లో వైసీపీ నాయకులకు కూడా, జగనన్న ప్రచారం, అధికారులతో సోషల్ మీడియాలో చేయించడం, చాతకావడం లేదు.

మీకు అనుచరులు, సెక్రటరీ, పార్టీ సభ్యులు ఇలా ఎంతోమంది సహాయం గా ఉంటారు. ఎందుకు వారి సహాయం తీసుకుని, విమర్శలు కూడా తెలుగు మాటలలో, అలాగే సారాంశం కొన్ని ఇంగ్లీషు పదాలలో రాయవచ్చు ను.

గూగుల్ లాంటి సెర్చ్ సంస్ధలు, మీరు పెట్టే పోస్ట్ లను, ముందు మాటలను బట్టి ఇండెక్స్ చేస్తాయి. మీరు ఉత్త వీడియోలు ఫోటోలు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. మాటలు రాయడం లేదు.

చీరాల లేదా ఇతర స్ధానిక బీజేపీ, తెదేపా, జనసేన పేజీలు, స్ధానిక సమస్యలు అభివృద్ధి నాయకత్వం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్ధితిలో ఉన్నాయి, రెండు ఏళ్లుగా మేం నిద్ర లేపినా వారు, మేము లెగవం గాక లెగవం అంటున్నారు, రాష్ట్ర నాయకుల పాద సేవలో నిద్ర పోతూ.

రాష్ట్ర నాయకులు ముందు మారి, జిల్లా, పట్టణ మరియు గ్రామ నాయకుల ను మార్చండి. వారిని నిద్ర లేపి, వారికి తెలియజేయండి, స్ధానిక నాయకత్వం ఎవరో, స్ధానిక ప్రజలకు తెలియాలి అని. వార్డులు తిరుగుతూ, రోజూ ఫోటోలు వీడియో లు పెట్టమని. రోజుకో స్థానికి పోస్ట్ పెట్టని నాయకులను, మార్చండి.

గెలిచి అధికారం లో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే, రోడ్లు వార్డులు పట్టుకుని అధికారులు ప్రజలు తో , తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే ఎండలో పొద్దున్నే , కనీసం వార్డు అభ్యర్థులు పెట్టుకో లేని మనం, ఇంట్లో చాటుగా ఉంటే, ఇక జీవితంలో గెలుస్తామా?

గెలవకపోయినా పర్లేదు, కనీసం మోదీ చేస్తున్న మంచి కూడా, స్ధానిక కార్యకర్తలు స్ధానిక బీజేపీ ఫేస్బుక్ లో, తమ సొంత మాటలు ఫోటోలు వీడియో లతో నింపకపోతే, ఊరక ఎవరో పంపినవి షేర్ చేస్తూ గమ్ముగా ఉంటే, ఇంక దేనికి ఈ పార్టీ వ్యవస్థ, అని పలువురు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 04-Jun-2021, Upd Dt : 04-Jun-2021, Category : Politics
Views : 135 ( + More Social Media views ), Id : 1191 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : zero , seats , state , bjp , andhra , veterans , young , leaders , somu , sunil , gvl , kanna , purandaresvari , satya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content