ఏ భాషా లేదా ప్రాంత గురువు అయినా ఒకటే అని వాదించే వారికి, పామర భాష జవాబు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,707; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏ భాషా ప్రాంత గురువు నైనా గౌరవించాలి, కానీ ముందు నెత్తిన పెట్టుకొని పూజించాలసింది, స్ధానిక తెలుగు గురువు నే కదా? మనకు సొంత శక్తి లేనప్పుడు అర్థం చేసుకునే మనసు లేనప్పుడు, వీరు మనకు అర్థం అయే భాషలో, వివరంగా చెబుతున్నారు కదా? పామర భాష అర్థం చూద్దాం.

మా ఇంట్లో నీళ్ళు లేదా కరెంటు కనెక్షన్ (ఆధ్యాత్మిక శక్తి) పని చేయలేదు, దేశములో ఏ ముఖ్యమంత్రి (గురువు, మార్గదర్శి) అయినా ఒకటే అని, మన బాధ వింటారు అని, మనం గౌరవించాలని పూజించాలి అని, ఆంధ్రా సీఎం ను వదలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి అర్జీ పెడితే, ఆయన ఏమంటారు? ఆయన చుట్టూ తిరిగితే, విమానం రైళ్లలో ముంబై వెళ్లి, ఏమి చేయగలరు మనకు?

ఒకటి మనం పిచ్చి వాళ్ళమని, మోసగాళ్ళం ఏదో దురుద్ధేశాలు తో వచ్చాం అని భావించి, గమ్ముగా ఉంటారు. వీడు వ్యాపారస్తుల బ్రోకర్లు మాయ మాటలు నమ్మి, వాస్తవం మరచి, భ్రమలో అర్జీ పంపి ఉంటారు లేదా వచ్చి ఉంటారు లే అని ఏమీ పలకరు.

ఈ లోపు అందరితో పాటుగా, మన కనెక్షన్ కూడా, స్ధానిక తెలుగు ఆంధ్రా అధికారులు చే పంపబడిన, పని వారిచే బాగవుతుంది. మనము లేకపోయినా, అడగకపోయినా, కొత్త మీటర్లు బిగించారు కదా, సహజంగా నే. కొత్త రోడ్డు వేశారు, లైట్లు వేశారు, అడగకుండానే ఇన్నాళ్లు. అంటే మన ప్రాప్తి ని బట్టి, పనులు ధనం వస్తుంది కదా?

మనం మోహంలో బ్రమలో, అబ్బో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మా గోడు విని మనుషులను పంపి, మా కనెక్షన్ బాగు చేయించారు అని, అబద్ధాలు ఢాంభికముగా ప్రచారం చేస్తాం, ఇతరుల మాయమాటలు నమ్మి. పిచ్చి జనం కూడా నమ్మి, కొత్త గుడులు గోపురాలు వ్యాపారం భజనలు మంత్రాలు వ్రతాలు మొదలు, పాత వాటినుంచి కాపీ కొట్టి. మరి ఇది అంతా, దండుగ వృధా కాదా?

ఆ మహా రాష్ట్ర సీఎం కి కూడా, అర్థం కాదు, ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం అజ్ఞానాంధకారంలో చేస్తున్నారో. ఆంధ్రా వాళ్ళ కు జరిగిన పనులు కు, తనకు సంబంధం ఏముందో ఎవరికీ తెలీదు.

అదే ప్రధానమంత్రి (అంటే భగవంతుడు) అర్థం వేరు, అందరికీ సంబంధం ఉంది. కానీ ఢిల్లీ వెళ్ళకుండా నే హిందీ రాకుండా నే, కొత్త భజనలు గుడులు చేయకుండానే, పనులు అవుతున్నాయి కదా? అందాల్సిన శాతం, మన ఊళ్ళో నే అందుతుంది కదా? ప్రతి పధకం లో, కేంద్ర వాటా ఉంది కదా?

మహా రాష్ట్ర దాకా వద్దు, మన తెలుగు తెలంగాణ సీఎం కూడా, మన గోడు వినరు, చేయరు, చేయలేరు, చేయకుడదు. వాళ్ళ దగ్గర ఉన్న జన సేవకే, వారికి సమయం లేదు. ఉన్నా, పక్కన రాష్ట్ర సీయం ను అవమానించరు కదా?

అంటే పక్క రాష్ట్ర భాష గురువు ను అవమానించరు కదా? గురువు దోవ మాత్రమే చూపుతారు, ఆయన ఏమీ చేయరు.

మనలో చిత్తశుద్ధి ఉందని గ్రహిస్తే, మన కళ్ళు తెరిపిస్తారు, ఆంధ్రా కి కూడా సీఎం ఉన్నారు. ఆయనకు అర్జీ పెట్టు, కావాలంటే మేమూ రికమెండ్ చేస్తాం అంటారు.

అంతెందుకు అందరూ కలెక్టర్ లు, వారి శక్తి విధులు, ఒకటే కదా? మన గోడు విజయనగరం లేదా కడప కలెక్టర్ వింటారా? ఆఖరికి కడప మంత్రి కూడా, ఓరి బాబో, మీ ప్రకాశం జిల్లా మంత్రి లేదా కలెక్టర్ వెంట పడు నాయనా, మమ్మల్ని వదిలి అంటారు.

పోనీ కనీసం, రాష్ట్రములో మున్సిపల్ కమీషనర్ లేదా పంచాయతీ ఈవో, అందరూ ఒకటే గా? సిద్ధాంతం ప్రకారం ఒకటే, కానీ ఆచరణలో, కేవలం మన పంచాయతీ మన మున్సిపల్ అధికారులు మాత్రమే, మన మాట విని, పని చేసే, అవకాశం మాత్రమే ఉంది.

ఆఖరికి, సెల్ ఫోన్ పని చేయకపోతే, స్ధానిక షాప్ కు వెళతాం గానీ, బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీసు కోసం, పక్క జిల్లా రాష్ట్రం కు పోము కదా?

కాబట్టి, వ్యాపారస్తుల అవకాశవాదుల మాయ మాటలు నమ్మి, పోలోమని ధనం ఖర్చు చేసుకుని, మహారాష్ట్ర పంజాబ్ అస్సాం సీఎం లు, పక్క జిల్లా ల కలెక్టర్ లు, పక్క మున్సిపల్ పంచాయతీ అధికారులు కు తలనొప్పి కాకుండా, వారి బ్రాంచీలు మన ఊర్లో ఉన్నాయి అని నమ్మకుండా,

వారి స్ధానికులకే వారిని వదలి, మన పని లేదా మన ఆధ్యాత్మిక గని, మన స్ధానిక గతించిన లేదా నిజమైన ఆచరణలో చూపే తెలుగు గురువు ల దగ్గర నే క్షేమంగా ఉంది అని, మనకు చిత్తశుద్ధి ఆత్మశుద్ధి, త్రికరణ శుద్ధి గా ఉంటే గ్రహించండి. అసలు మనలో నే ఉన్న ఆత్మ శక్తి ని గ్రహిస్తే, బయట గురువు తో పని లేదు.

తల్లి దండ్రల సేవ చేయని వారే, తమలో ధ్యానం లో దేవుని చూడటానికి భయపడే వారే, ఈ పరాయి గురువు ల వెంట పరిగెత్తుతూ, ఇతరుల ను కూడా వ్యామోహం లో పడవేస్తూ ఉంటారు సుమా.

మనం ఇలా అజ్ఞానంలో, పరాయి భాష రాష్ట్ర గురువు ల వెంట పరిగెత్తుతూ ఉంటే, మన అమాయకత్వం అవకాశవాదం అజ్ఞానం వ్యామోహం చూసి, పరాయి దేశ గురువు లు మతాలు కూడా, ధనం తో భయంతో, మనల్ని వాళ్ళ లోకి లాక్కుని, మార్చాలని చూస్తున్నారు. ఆ పిచ్చి మాయలో పడుతున్నాము.

ఈమెయిల్ లేదా ఫోన్ ఉందని, పరాయి మత గురువు లాగా, అమెరికా అధ్యక్షుడు కు మా ఇంటి కరెంటు నీళ్ళు విషయం, అర్జీ పెడితే ఏమి జరుగుతుంది? చెత్త బుట్టలో వేస్తారు. లేదా నిజమైన పెద్ద సమస్య అయితే, మరలా ఇండియా ఎంబసీ కి పంపి, చేతులు దులుపుకుంటారు. అంతే గానీ వారు వేలు పెట్టరు, లైన్ మాన్ ని పంపరు.

ఎంబసీ నుంచి, ఢిల్లీ నుండి, అమరావతి వచ్చి, మరలా మన జిల్లా కలెక్టర్ కే చేరుతుంది. నిజంగా పెద్ద సమస్య ఉంటే చీవాట్లు పెట్టి సరిచేస్తారు, లేదా చెత్త బుట్టలో వేస్తారు. ఆ ఏడుపు ఏదో ఇక్కడనే, ముందుగానే జ్ఞానము బుద్ది తో, మన కలెక్టర్ కు ఇస్తే సరిపోతుంది కదా?

పరాయి దేశ గురువు లు మతాలు ఉన్న దేశాల, దయనీయ దుస్థితి చూడండి. నేటికీ కూడా, ఆ మతాల వర్గాల తెగలలో, ఒకరినొకరు ఆధిపత్యం కోసం, నిరంతరం మారణహోమం సృష్టించబడుతున్నాయి. అక్కడ కూడా బీదవారు, కష్టాలు పడేవారు, అన్నానికి దిక్కు లేక, వీధుల్లో ఉన్నారు. ఆ మతాలు ఏలే దేశాలలో నే, కరోనా కు ఎక్కువ మంది పిట్టలు లా రాలిపోయింది.

కళ్ళు తెరవండి, వాస్తవం తెలుసుకోండి, తల్లి దండ్రులు ను సేవించడం, నిరాకారుడు నిరంజనుడు , మన ఆత్మ అంతరాత్మ లో ఉండే, పరమాత్మ ను ధ్యానించడం ఒకటే మార్గం, వంద జన్మలు ఎత్తి న తర్వాత అయినా. బీదవారు కు కూడా ఇది సాధ్యమే కదా.

పరాయి దేశ మతాల గురువు లు కూడా, చేతులు పైకెత్తి, పరమాత్మ నే ధ్యానం చేశారు. ఫోటోలు చూడండి.

అబ్బాయి, తెలుగు లో వేమన చెప్పిన పద్యాలు చదివి, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి, ఆత్మ జ్ఞానం తెచ్చుకో అంటే,

లేదండి నాకు అవి ఎక్కువు అర్థం కావు తలనొప్పి. తర్జుమా చేసిన పరాయి భాష లేదా మతాల వి మాత్రమే, ఎక్కుతాయి అంటాము. అవ్వ, ఎంత మూర్ఖత్వం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,707; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 871 ( + More Social Media views ), Id : 961 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : argue , language , region , guru , layman answer , andhra , telangana , maharashtra , cm
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content