పాటతో పరమార్ధం- ఎవరి చక్కని వాడు(చక్కని జీవి పేరడీ) - ఖైదీ కాళిదాసు - శోభన్ బాబు, మోహన్ బాబు, దీప - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,854; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evari Chakkani Vadu (Evari Chakkani Jeevi Parody) - Khaidi Kalidasu - Shoban Babu, Mohan Babu, Deepa

మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva; మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఎవరీ చక్కని జీవి, ఏమిటీ స్తిర మానసిక బలం, ఎక్కడిది ఈ భగవద్గీత ఆచరణ శక్తి, ఎంతకూ చిక్కని జీవి, మాకే తలనొప్పి పుట్టిస్తున్నదే, ఎప్పటికి దారికొస్తుందో, మన బ్రమలు మోహాలలో మునిగి, అంటూ మాయ మన వెంట పడాలి, అయోమయముతో అర్ధం కాక, ఇంత బండ జీవి ని ఎలా పట్టుకోవాలో తెలియక.

ఎవరీ చీకటి మాయ, మానసిక బలహీనతతో దీనికి లొంగి పోతే, పతనం దీని ఫలితం కాదా, కాదన్నా వెంట పడుతోందీ జీవితాంతం అని మనము ఇంకా జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండాలి మిత్రమా, ఏ రూపములో అయినా అది మనల్ని కబళించడానికి, అన్ని విధాల ప్రయత్నము చేస్తుంది.

ప్రాపంచిక మాయలకు లొంగినవారు, పతనము అవుతారు. దానికి ఎన్నో ఉదాహరణలు మన పెద్దలు తమ జీవితాలను పణంగా పెట్టి చూపారు. అందుకే బ్రమలు, మాయలు మనల్ని నిత్యం పరీక్షిస్తుంటాయి, అదే విష్ణు మాయ, అదే జగన్మాయ.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి

మనము స్తిర చిత్తముతో, దైవ గుణాల ఆచరణతో, త్యాగాల సాధనల దండతో, ఆ దేవునికి మానసిక పూజ చేస్తూ, ఆ మాయకు దూరంగా తప్పించుకుంటూ ఉంటూ, కేవలము సాక్షీభూతులుగా ఉండాలి.

చూడండి, మాయ మనల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో అని చూస్తుంటే, మనము మాయకు దండం పెట్టి దూరంగా ఉంటున్నామని, మాయలు బ్రమలు ఎంత బాధపడుతున్నాయో, వాటి జీవితం ఎందుకీ మాయజన్మ వోయమ్మా అంటూ.

కదలిక వుందీ, మబ్బులో కదలిక వుందీ, నీటికీ వేగం వుందీ, గాలికీ చలనం వుందీ, కానీ ఈ స్తిర చిత్త జీవిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ అనీ మాయ ఆశ్చర్యపోవాలి మనల్ని చూసి మిత్రమా. ప్రపంచాన్ని జయించవారు కూడా, తమను తాము జయింపలేకపోయారు.

వయసొచ్చిందీ, దానితో మరపొచ్చిందీ, అందుకే మోహాలు తొందర పడుతోందీ/ పెడుతోందీ అని, మనము వాటికి దూరముగా ఉండాలి. ఏ వయసు అయినా, వదిలిపెట్టదు.

మన మంచి నడత పై కన్నేసిందీ, ఎలాగైనా మోహంతో కట్టేసిందీ, ప్రాపంచిక అవసర అవకాశాల మాయతో చంపేస్తుందీ, కోరికలు అనే ఆశతో బ్రతికిస్తుందీ, అమ్మమ్మో దాని బ్రమలు చాలా టక్కరివీ! అని నిత్య సాధనతో మనము ముందుకు పోవాలి.

* * *

ఎవరీ చక్కనిజీవి.. ఎంతకూ చిక్కనిజీవి.. ఎప్పటికి దారికొస్తుందో..
ఎవరీ చీకటి మాయ.. పతనం దీనిఫలితం కాదా..
కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ
- 2 సార్లు
ఆఆ.. ఆ..ఆ

కదలిక వుందీ.. మబ్బులో కదలిక వుందీ..
నీటికీ వేగం వుందీ.. గాలికీ చలనం వుందీ..
జీవిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ! - మొత్తము 2 సార్లు

వయసొచ్చిందీ.. దానితో మరపొచ్చిందీ.. 2హా.. ఆ.. ఆ..
అందుకే మోహాలు తొందర పడుతోందీ.. 2
ఆఆ..ఆఆ.. అ ||ఎవరీ చక్కనిజీవి||

కన్నేసిందీ.. మోహంతో కట్టేసిందీ..
మాయతో చంపేస్తుందీ.. ఆశతో బ్రతికిస్తుందీ..
అమ్మమ్మో.. బ్రమలు చాలా టక్కరివీ!- మొత్తము 2 సార్లు

జీవితో ఔననిపించి.. కష్టాలముడి వెయ్యకపోతే 2
ఎందుకీ మాయజన్మ వోయమ్మా.. ఎందుకీ మాయజన్మ వోయమ్మా..
ఆఆ..ఆఆ.. ఆఆ ||ఎవరీ చక్కనివాడు||

Original
ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో..
ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క..
కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ
- 2 సార్లు
ఆఆ.. ఆ..ఆ

కదలిక వుందీ.. మబ్బులో కదలిక వుందీ..
నీటికీ వేగం వుందీ.. గాలికీ చలనం వుందీ..
వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ! - మొత్తము 2 సార్లు

వయసొచ్చిందీ.. దానితో వలపొచ్చిందీ.. 2హా.. ఆ.. ఆ..
అందుకే చిన్నది తొందర పడుతోందీ.. 2
ఆఆ..ఆఆ.. అ ||ఎవరీ చక్కనివాడు||

కన్నేసిందీ.. కళ్ళతో కట్టేసిందీ..
చూపుతో చంపేస్తుందీ.. నవ్వుతో బ్రతికిస్తుందీ
అమ్మమ్మో.. కుర్రది చాలా టక్కరిది!- మొత్తము 2 సార్లు

వీడితో ఔననిపించి.. కొంగుముడి వెయ్యకపోతే 2
ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. ఎందుకీ ఆడజన్మ వోయమ్మా..
ఆఆ..ఆఆ.. ఆఆ ||ఎవరీ చక్కనివాడు||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,854; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249
Dt : 16-May-2024, Upd Dt : 16-May-2024, Category : Songs
Views : 244 ( + More Social Media views ), Id : 2103 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Evari Chakkani Vadu , Parody , Khaidi Kalidasu , Shoban Babu , Mohan Babu , Deepa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content