Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
రాజకీయ లబ్ధి, కుట్ర ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎన్నికల వాయిదా సక్రమమే అనవచ్చు ఏమో. ఎందుకంటే, ఎవరూ దగ్గరగా ఉండ కూడదు, తిరగ కూడదు అని, సినిమా, షాపు, హోటల్ కూడా మూసేసారు నెలాఖరు దాకా, అక్కడ అన్ని రాష్ట్రాల్లో. మా దగ్గర అసలు బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప, 60 పైన వారు అసలు వద్దే వద్దు అంటున్నారు.
మొన్న ఓ కార్పొరేటర్, నామినేషన్ వేయడానికి వెళితే, 15 అనుచరుల పేర్లు రాసారు పేపర్లో, ఫోటో లో 40 మంది పైన, ఇరుకు గది లో ఉన్నారు, ఆ ఆఫీసర్ ఎదురుగా. అంటే వారెవరికీ తమ కుటుంబం మీద ప్రేమ లేదు అనే కదా, పదవి ధనం మీద వ్యామోహము తప్ప, కరోనా భయం లేదు కదూ? పోటీ చేసే ధనవంతులు, మద్రాసు డాక్టరు దగ్గరకు వెళతారు, మరి అనుచరులు కు దిక్కు వీధుల్లో ఆరెంపీ డాక్టరే కదా?
ఒకరు కి ఆ వ్యాధి ఉన్నా కూడా, పదిమంది కి కనీసం వస్తుంది. వాళ్ళు వెళ్ళే దోవలో, ఇంట్లో ఇంకో పదిమంది కి అంటిస్తారు. వాళ్ళ కు బాధ్యత ఉందా? చిన్న స్ధాయి నామినేషన్ కి ఇలా ఉంటే, మరి మేయర్, ఛైర్మన్ లేదా ప్రెసిడెంట్ కి ఎంతమందో వస్తారు కదా? వేరే రాష్ట్రం లేదా దేశంలో లో వారమే ఆపినా, మన జనాభా ను అదుపు చేయడం తేలిక పనా? ముందు జాగ్రత్తలు మంచిదే కదా?
మనమంతా చేతులు కాలాక ఆకులు వెతికే రకం. ఎలక్షన్ ప్రచారం, పంచడం, వంచడం, దంచడం అంతా జనాలతోనే పని. వాహనాల హోరు, నాయకుల జోరు, ప్రచారాల పోరు, ఆపగలమా? కరోనా చెల్లి కి జగనన్న, చంద్రన్న అభ్యర్థులు అన్న, తార తమ్య బేధం ఉండదు కదా, ఇద్దరుని కాటేస్తుంది ఏమో.
ఏ పోటీ చేసే నాయకుడైనా, ఓటరు ఇంటింటికి పోయి, చేతులు కాళ్లు కు మొక్కి తాకి, రోగం ఇచ్చి లేదా తెచ్చుకోవడం జరుగుతుంది. ఆయన వెంట, మంది మార్బలం కూడా. ఇక జగనన్న స్టైల్లో ముద్దు లు పెడితే, ఓహో కరోనా వచ్చే వచ్చే, అంతే.
ఓట్లు వేసే అప్పుడు కూడా పెద్ద లైన్లు, తోసుకోవడం, నెట్టుకోవడం, తూగడం, తన్ను కోవడం. ఏ విధంగా చూసినా, జగనన్న అభ్యర్థుల లేదా అనుచరుల ఆరోగ్య పరంగా చూసినా కూడా, ఆపడం వాయిదా కరెక్టే కాదా?
ఒకవేళ చంద్రన్న కుట్ర అనుకున్నా కూడా, మన పార్టీ అనుచరులు, మన మత్తు చిత్తు లో తూగేవారు, నెలలో గా అటు ఇటూ, మారరు కదా, అన్ని ఊళ్ల లో? కాకపోతే, కొంత ఖర్చు ఈ నెల అంతా, వాళ్ళ ను మేపడానికి భరించడానికి, రోగం వస్తుంది అని వాళ్ళూ బయటకు రాకపోవచ్చు.
ఎన్నికలు ఆగితే, కేంద్ర నిధులు ఆగుతాయంట. మరి దాని వలన జనానికి ఇబ్బందా లేక మన అనుచరులకు ఇబ్బందా? ప్రభుత్వ మే ఎన్నికలు ఆపిన లేదా జరపని సంఘటనలు లేవా, గతంలో? వీలైతే నచ్చ చెప్పి కేంద్రము నుంచి తెచ్చుకోవడం, కరోనా ను చూపి కరుణ అడగడం, లేదంటే తిలా పాపం పిడికెడు.
ఇంట్లో దాంకుందాం, ఆరోగ్యం కాపాడుకుందాం.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,141; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989
Dt : 16-Mar-2020, Upd Dt : 16-Mar-2020, Category : Politics
Views : 1104
( + More Social Media views ), Id : 415
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
andhra election postpone ,
corona virus
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments