Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. 60 దాటిన వారైనా లేదా 40 కే జబ్బున పడిన వారికి, మొదట మానసిక ప్రశాంతత, ధైర్యాన్ని ఇచ్చే చెయ్యి కావాలి/ ఉండాలి.
1)మన ఇంట్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట మందులు వేసుకునే, జబ్బుతో ఉన్నవారు లేదా పెద్దలు, వారికి ఇది చాలా ఉపయోగం.
బీపీ, షుగర్ లేదా వేరే జబ్బు ఉన్న వారు, తప్పనిసరిగా ప్రతి పూట, ఒక టాబ్లెట్ కనీసం తీసుకోవాలి. ఏ పూట మరచి పోయినా, జబ్బు తీవ్రమైన ప్రభావం వలన, ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు.
అమ్మ కు ఇందులో, వారం మొత్తానికి టాబ్లెట్ లు, పెట్టి ఉంచుతాను. ఏ పూట మరచినా, మనకు అక్కడ మిగిలి ఉంటాయి, తెలుస్తుంది. లేటుగా అయినా, వేసుకోవచ్చు. ఇబ్బంది కలిగినా, డాక్టర్ కు ఏమి వేసుకోలేదో వివరంగా చెప్పవచ్చు.
కొంతమంది కి, నేను తెచ్చి ఇచ్చాను ఉచితముగా. డాలర్ షాపుల్లో ఉంటుంది, ఒక డాలర్ మాత్రమే. 3 పూటలా, రోజూ టాబ్లెట్ తీసుకునే వారికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఊరికి వెళుతున్నా కూడా, వారం మందులు, ఈ చిన్న పెట్టెలో ఉంచుకోవచ్చు మన వెంట.
2) పెద్ద వాళ్ళు తిరగటానికి, మడిచే చేతి కర్ర కూడా ఉపయోగము. కావలసినప్పుడు వాడుతూ, అనవసరము అయినప్పుడు మడిచి సంచిలో పెట్టవచ్చును.
3) చలవ కళ్ళ జోడు, బీపీ మెషిన్, షుగర్ పరీక్ష మెషిన్
4) మంచము మీద పడుకునే, ఫాన్, లైట్ వేసుకునే రిమోట్
5) ఒక సంచిలో, అరటికాయ, కారెట్, ఆపిల్, బిస్కట్టులు, పెరుగన్నము, చిన్న మడిచే గొడుగు, నీళ్ళ సీసా తో, ఎప్పుడూ పక్కన ఉంటే, చాలా బాగుంటుంది. కారు ఉంటే, తేలికపాటి కుర్చీ కూడా ఉంచుకోవచ్చు.
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,709; 104 తత్వాలు (Tatvaalu) and views 256,766 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments