Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Eenati Sankranthi - Manchi Rojulu Vachayi - ANR, Kanchana, Krishnam Raju
తెలుగు వారి జీవితాల్లో ఆనందాలు తేవడానికి, ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ, అది బీదసాదలకెల్ల ప్రియమైన పండగ. ఆనాటి శ్రామికుల కష్టాన్ని దోచుకునే, పెత్తందార్లను ప్రశ్నిస్తున్నది ఈ పాట. నేడు అదే పరిస్తితి ఏదో ఒక రూపములో ఉన్నది సుమా.
ఈనాటి సంక్రాంతి, అసలైన పండగ, సిసలైన పండగ, కష్టజీవులకు అది ఎంతో, కన్నుల పండగ అనెది మన ఆచారం. ఎవ్వరేమి అనుకున్నా, ఎంతమంది కాదన్నా, ఉన్నవాళ్ళ పెత్తనం ఊడుతుందిలే. (సోషలిజం - ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, పెట్టుబడిదారీ వ్యవస్త కూడా అంతే, కాబట్టి రామరాజ్యం అందాము) రామరాజ్యం వచ్చే రోజు, దగ్గరుందిలే.
ఏనాడూ పరిస్తితులు ఒకే రకముగా ఉండవు. కరణాలు మునుసుబులు ఆనాడు ఆడిందే ఆట పాడిందే పాట, మరి నేడు వారు లేరు. అలాగే బీదలకు ఎల్లకాలము గుడిసె కాపురాలు ఉండబోవులే, ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే. మార్పు సహజం కదా. ఓడలు బండ్లై, బండ్లు ఓడలై, తారుమారు ఎప్పుడైనా, తప్పదులే.
ప్రజలను పీడించుకుని తినే, అందరిపై ఎగిరిపడే మేక వన్నె పులి బిడ్డలు పాపం, ఏమైపోతారు? రోజులు మారాక, పిల్లుల్లాగా తోక ముడుచుకొని, కిక్కురుమనక కుక్కిన పేనై, చాటుగా నక్కుతారు, చల్లగా జారుకుంటారు.
చూడండి మామను వెన్నుపోటు పొడిచి, రాజ్యం ఏలారు ఇన్నాళ్ళు, మా రోడ్లు మా పాలన అంటూ. కరోనాకు జనం పరుగులు తీసారు హైదరాబాదు. ఇప్పుడు ఢిల్లీ పోయి, పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారు మా పాపాలు శాపాలు క్షమించమని, తెలుగు వారి ఆత్మగౌరవానికి మచ్చ తెస్తూ. ఇంకొకరు ఢిల్లీ మెడలు వంచుతాము అన్నారు, ఢిల్లీ వెళ్ళి, తమ మెడ నే వంచుకుని వెనక్కి వస్తున్నారు. ఎందుకంటే తెలుగు వారు నక్క, పాము, పులి కే ఓటు వేసే స్వయం పతన బుద్ది లో ఉన్నారు.
* * *
ఏటేటా వస్తుంది, సంక్రాంతి పండగ..ఆ...
బీదసాదలకెల్ల, ప్రియమైన పండగ..ఆ.. ఆ
ఈనాటి సంక్రాంతి... అసలైన పండగ.. సిసలైన పండగ.
కష్టజీవులకు అది ఎంతో, కన్నుల పండగ..
అది కన్నుల పండగ. ||ఈనాటి సంక్రాంతి||
ఎవ్వరేమి అనుకున్నా.., ఎంతమంది కాదన్నా.. 2
ఉన్నవాళ్ళ పెత్తనం..., ఊడుతుందిలే..
సోషలిజం/ రామరాజ్యం వచ్చే రోజు... దగ్గరుందిలే.. ||ఈనాటి సంక్రాంతి||
గుడిసె కాపురా.లు మాకు ఉండబోవులే..ఆ..ఆ..
ఈ కారులు మేడలు కొద్దిమందికే, స్థిరము కావులే..ఆ..ఆ. మొత్తము 2 సార్లు
ఓడలు బండ్లై... ఓ.. ఓ.. ఓ ఓహోయ్..
బండ్లు ఓడలై..ఆ..ఆ..ఆ
ఓడలు బండ్లై... బండ్లు ఓడలై
తారుమారు ఎప్పుడైనా... తప్పదులే తప్పదులే ||ఈనాటి సంక్రాంతి||
ఎగిరిపడే పులిబిడ్డలు పాపం, ఏమైపో.తా.రు... ఏమైపోతారు..ఆహా హా హా
పిల్లుల్లాగా తొక ముడుచుకొని... మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక..ఆ..ఆ..ఆ..ఆ...
కుక్కిన పేనై..ఆ..ఆ..ఆ..ఆ
కిక్కురుమనక కుక్కిన పేనై...
చాటుగా నక్కుతారు.. చల్లగా జారుకుంటారు. ||ఈనాటి సంక్రాంతి||
చిత్రం : మంచిరోజులు వచ్చాయి (1972); సంగీతం : టి. చలపతిరావు;
గీతరచయిత : కొసరాజు; నేపథ్య గానం : ఘంటసాల
Starring: ANR, Kanchana;Music :T Chalapathi Rao ; Singers :Ghantasala;Producer:SS Balan; Director: V Madhusudhana Rao; Year: 1972 Manchirojulu Vachayi
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,755; 104 తత్వాలు (Tatvaalu) and views 226,323 Dt : 07-Feb-2024, Upd Dt : 07-Feb-2024, Category : Songs
Views : 101
( + More Social Media views ), Id : 2011 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Eenati ,
Sankranthi ,
Manchi ,
Rojulu ,
Vachayi ,
ANR ,
Kanchana ,
Krishnam ,
Raju ,
Manchirojulu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments