పాటతో పరమార్ధం - ఎడారిలో కోయిల (పేరడీ) - పంతులమ్మ - రంగనాథ్, లక్ష్మి, దీప, శరత్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,645; 104 తత్వాలు (Tatvaalu) and views 226,496.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Edarilo Koyila (Parody) - Panthulamma - Ranganath, Lakshmi, Deepa, Sarath Babu

ఎవరినైనా తాత్కాలికముగా లేదా శాశ్వతముగా పోగొట్టుకున్నప్పుడు ఎంతో బాధ, అది స్నేహితుడు కానీ, భాగస్వామి కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ. ఆ బాధ సమయములో కన్నీరు మున్నీరుగా విలవిల లాడు తాము. అప్పుడు ఎన్నో కవితలు పాటలు కూడా వస్తాయి, కొంతమందికి. అలాంటిదే ఈపాట. కొంచెము చిన్న మార్పులు చేసాము అందరికీ ఉపయోగపడాలి, కేవలం భాగస్వామి కోసమే కాకుండా అని, కాబట్టి ఒక్క పదము మార్చినా అది పేరడీ అనాలి కదా.

ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా: !
ఋణక్షయే క్షయంయాంతి కాతత్ర పరివేదనా !!

పశువులు, భార్యా పిల్లలు, ఇంక ఎవరైనా ఏదైనా బంధము స్నేహము ఉద్యోగము అయినా, ఋణానుబంధం వలన కలుగుచున్నారు/ వస్తాయి. ఆ ఋణము తీరిన తరువాత అవి నశించుచున్నవి (దూరమగు చున్నవి). కాబట్టి వాటిని గూర్చి వేదనపడ తగదు అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది.

పల్లవించు ప్రతిపాటా, బ్రతుకు వంటిదే, రాగ మొకటి లేక పోతే, తెగిన తీగవంటిదే అని అనిపిస్తుంది గాయకులకు సంగీత సామ్రాట్ లకు. కానీ, మన పాటలు అలాగే ఉంటాయి కదా. మీ అందరినీ ఆరోగ్యం కోసము పాడండి, సంగీత రాగాలు పట్టించుకోకుండా అని మనము ఉత్సాహపరుస్తుంటే, ఎవరో ఒక సందేశము పెట్టారు, మమ్మల్ని పాడవద్దు హతవిధీ వినలేను అని, ఆరోగ్యం కోసం తప్పదు అన్నా అని చెప్పడం కన్నా ఏమి చెయ్యగలము, అతను పాడాలి, ఊపిరితిత్తులపై ప్రేమ ఉంటే. అక్కడ తెర మీద కనపడేదన్నా చదివితే, వారికి జ్ఞానోదయము అయ్యేది.

ఒకసారి మోహములో చిక్కు కుంటే, అది కల అయితే, మనసు శిల అయితే, మిగిలింది ఈ గుండె కోతా, అంతే కదా? రగిలింది ఈ రాలు పూత, విధి రాత చేతా, మన స్వర్ణ గీతా మారుతుంది.

అందుకే చిన్నప్పటి నుంచి భగవద్గీత అలవాటు చెయ్యాలి, అప్పుడు ఇలాంటి విపత్కర పరిస్తితులకు లొంగరు. మనము ఏడ్చినా, ఎవరూ తిరిగి రారు కదా. ముదుసలి తల్లి దండ్రులు ఒంటరిగా లేదా అనాధాశ్రమము లో ఉండి, అయ్యో ఏమి సాధించాము జీవితము లో అని కుళ్ళి క్రుశించిపోతే, వారి పిల్లలు వచ్చి తీసుకుని వెళతారా?

కొన్ని పాటలింతే, గుండె కోత లోనే చిగురిస్తాయ్, కొన్ని బ్రతుకులంతే, వెన్నెలతో చితి రగిలిస్తాయ్. కానీ స్తిత ప్రజ్ఞునికి, వెన్నెల అలాగే అమావాస్య ఒకటే, తను తొణకడు బెణకడు సుమీ.

మనము ఎంత మంచి వారమైనా, దేవుడు పరీక్షపెట్టినప్పుడు, చలిమంటలే, చితిమంటలై, చెలరేగె కలి లేని మన ముంగిట, తప్పదు ఎదుర్కోవాలి జీవితములో అన్ని ఆటుపోటులను మిత్రమా.

ఎడారిలో. కోయిలా.., తెల్లారనీ. రేయిలా.. 2
పూదా.రులన్ని, గోదా.రికాగా ..2 పాడింది, కన్నీటి పాటా ||ఎడారిలో||

పల్లవించు ప్రతిపాటా, బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక, తెగిన తీగవంటిదే - మాటలు ఇవి
ఎద వీణపై .., అనురాగమై.., తలవాల్చి నిదురించు మన దేవతా
కల అయితే.., శిల అయితే.., మిగిలింది ఈ గుండెకోతా..
మన కోసమే .. విరబూసినా.. మనసున్న మనసైన మనమల్లికా,
ఆమనులే .., వేసవులై.. , రగిలింది ఈ రాలుపూత ...
రగిలింది ఈ రాలుపూత.., విధి రాత చేతా.., మన స్వర్ణ గీతా..||ఎడారిలో||

కొన్ని పాటలింతే.., గుండెకోతలోనే చిగురిస్తాయ్
కొన్ని బ్రతుకులంతే.., వెన్నెలతో చితి రగిలిస్తాయ్ - మాటలు ఇవి
ఆ రూపమే.., మన దీపమై .., వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో .., వెన్నెలగా.., వెలిగించి తమ కంటిపాపా
చలిమంటలే .., చితిమంటలై.. , చెలరేగె కలిలేని మనముంగిట
బ్రతుకంటే .. మృతికంటే.. చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట ..కలి లేని పాటా..ఒక చేదుపాటా.. ||ఎడారిలో||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,645; 104 తత్వాలు (Tatvaalu) and views 226,496
Dt : 27-Jul-2023, Upd Dt : 27-Jul-2023, Category : Songs
Views : 314 ( + More Social Media views ), Id : 1855 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Edarilo , Koyila , Parody , Panthulamma , Ranganath , Lakshmi , Deepa , Sarath , Babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content