అంతులేని కథ- దేవుడే ఇచ్చాడు వీధి, ఊరేల సొంత ఇల్లేల, ఏల ఈస్వార్ధం- జయప్రద, రజనీకాంత్, కమల్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,709; 104 తత్వాలు (Tatvaalu) and views 217,607.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*అంతులేని కథ (మనందరిదీ కూడా) - దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఊరేల సొంత ఇల్లేల, ఏల ఈ స్వార్ధం, ఏది పరమార్ధం - జయప్రద, రజనీకాంత్, శ్రీప్రియ, కమల్*

వేదాంతం చెప్పాలి అంటే, పురాణాలు చదివే ఉండక్కరలేదు. జీవిత పాఠాల లోతులు చదివి అర్ధము చేసుకుంటే చాలు అని ఈ పాట చక్క గా నిరూపిస్తుంది.

అందరమూ అద్దెకు వచ్చినా వారిమే, ఈ శరీరం విడిచి పోతాము ఏ క్షణమైనా అని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ అరిషడ్వర్గాల మరియు అష్టవ్యసనాల బానిసత్వం వదలలేరు.

వండుకున్న వారికి ఒకటే కూర, అడిగి తెచ్చుకునే వారికి 10 కూరలు అంటారు చమత్కారముగా. సొంత ఇల్లు ఒక్కటే, కాని అద్దె ఇల్లు వారు, ఎన్ని అయినా మారవచ్చు, ఖర్చు కష్టం చాకిరీ లేకుండా. పోనీ సొంతిల్లు, సొంతగా తుడిచే, శక్తి ఓపికా ఉన్నాయా? అదీ లేదు, 5 మంది సేవకులు.

పోనీ ఒకటి ఇల్లు తో ఆగుతారా? అదీ, లేదు. పూర్తి కష్టాలు అంటారు, ఎవరూ ఆదరించరు, ఎవరినీ నమ్మలేము అంటారు. మరలా మేము అరిషడ్వర్గాలకు బానిసలం కాదు అంటారు, దేవుని కి దగ్గర అంటారు. ఏమిటో ఈ జీవితాలు. మాటలకు చేష్టలకు పొంతన కుదరదు.

ఈ కలలోని సిరికేల, మన సంబరం? ముళ్ళ చెట్టుకు, చుట్టూ కంచే, ఎందుకు చిట్టమ్మా? తప్పుడు వారితో, మంచి బంధం ఏలా సాధ్యం? కళ్ళులేని కభోధి, చేతి, దీపం మనం? తొలుత ఇల్లు, తుదకు మన్ను? ఈ బ్రతుకెంత, దాని విలువెంత ఓ చెల్లెలా/ తమ్ముడా?

మన్నులోన మాణిక్యాన్ని, వెతికే మనము, నిన్ను నువ్వే తెలుసుకుంటే, చాలును పోవమ్మా అంటే మనల్ని ముందు మనం తెలుసుకుంటే చాలు. తప్పు ఒప్పు స్పష్టముగా ధైర్యముగా చెప్పగలిగితే ఒప్పుకోగలిగితే చాలు. దేవుడే మన ఇంటికి తానే వస్తాడు. ఎందుకంటే, మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి.

కమ్మటి జేసుదాసు గళం లోనిది ఈ పాట.

umm ummm .
దేవుడే ఇచ్చాడు, వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరే..ల, సొంత ఇల్లేల...
ఇక ఊరే..ల సొంత ఇల్లేల, ఓ చెల్లెలా . . .
ఏ.ల ఈ స్వార్ధం, ఏ.ది పరమార్ధం 2

నన్నడిగి తలి దండ్రి కన్నారా..ఆ ఆ ఆ 2
నా పిల్లలే నన్నడిగి, పుట్టారా..
పాపం పుణ్యం నాది కాదే, పోవే పిచ్చమ్మా..
నారు పోసి నీరు పోసే, నాధుడు వాడమ్మా..
ఏది నీ.ది, ఏది నా.ది
ఈ వేదాలు, ఉత్త వాదాలే, ఓ చెల్లెలా...
ఏల ఈ స్వార్ధం, ఏది పరమార్ధం...
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. 2

శిలలేని గుడికేల, నైవేద్యం
ఈ కలలోని సిరికేల, నీ సంబరం..
ముళ్ళ చెట్టుకు, చుట్టూ కంచే, ఎందుకు చిట్టమ్మా...
కళ్ళులేని కభోధి, చేతి, దీపం నీవమ్మా..
తొలుత ఇల్లు, తుదకు మన్ను
ఈ బ్రతుకెంత, దాని విలువెంత ఓ చెల్లెలా...
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం . . .

తెలిసేట్లు చెప్పేది, సిద్ధాంతం
అది తెలియక పోతేనే, వేదాంతం...
మన్నులోన మాణిక్యాన్ని, వెతికే వెర్రెమ్మా...
నిన్ను నువ్వే తెలుసుకుంటే, చాలును పోవమ్మా. . .
ఏది సత్యం, ఏది నిత్యం
ఈ మమకారం, ఒట్టి అహంకారం, ఓ చెల్లెలా . . .
ఏల ఈ స్వార్ధం, ఏది పరమార్ధం ....
దేవుడే ఇచ్చాడు, వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు, వీధి ఒకటి

Devude ichadu Veedhi Okati, Anthuleni Katha Movie, Starring Jayaprada, Rajinikanth, Sripriya, Kamal and Phataphat Jayalaxmi, Directed by K. Balachander, Music by M.S.Viswanathan

అంతులేని కథ చిత్రం, తారాగణం జయప్రద, రజనీకాంత్, శ్రీప్రియ మరియు ఫటాఫట్ జయలక్ష్మి, దర్శకత్వం K. బాలచందర్, సంగీతం M.S.విశ్వనాథన్

Devude ichadu Veedhi Okati - Anthuleni Katha, Jayaprada, Rajinikanth, Sripriya, Kamal  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,709; 104 తత్వాలు (Tatvaalu) and views 217,607
Dt : 25-Sep-2022, Upd Dt : 25-Sep-2022, Category : Songs
Views : 487 ( + More Social Media views ), Id : 1536 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devude , veedhi , anthuleni , katha , jayaprada , rajinikanth , sripriya , kamal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content