పాటతో పరమార్ధం - దేశమంటే మట్టి కాదోయ్ - చండశాసనుడు - NTR, రాధా, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,547; 104 తత్వాలు (Tatvaalu) and views 226,515.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Desamante Matti Kaadhoy - Chanda Sasanudu - NTR, Radha, Sarada

దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్ అన్నారు మన మహాకవి, మరి అది ఎంత మందికి గుర్తు ఉంది? ప్రజలు అంటే, ఎలక్షన్ అప్పుడు గుర్తుకు వచ్చే వారు, ఎందుకంటే వారిని ఎలా అయినా కొనవచ్చు అనే కాడికి నాయకులు వచ్చారు, ఎంత కో కొంతకు లేదా వర్గం అవకాశం అవసరం కోసం అమ్ముడు పోవటానికీ మనము సిద్దముగా ఉన్నాము. అందుకే మన నాయకులు, పార్టీలు మార్చడం అంటే, పై కండువా అంత తేలికగా మార్చేస్తారు.

నువ్వు తినే కూడు, నువ్వు కట్టే బట్ట, నువ్వుండే మేడా, తేరగ వచ్చాయనుకున్నావా - అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. రేయి పగళ్ళు మనందరికోసం, దుక్కి దున్ని, నేత నేసి, ఇటుక మోసి, నెత్తురునే చెమటగ పిండిన, రెక్కలనే ముక్కలు చేసిన, బక్క రైతులు, బడుగు కూలీలు, కష్ట జీవులు ఎంతో మంది ఉన్నారని మనకు తెలుసా? వాళ్ళ బిచ్చమే నీ నా మెతుకు, వాళ్ళ పుణ్యమే మీ మా బ్రతుకు అని తెలుసా? అది తెలిస్తే, కేవలం 10% ధనవంతులు ఉంటే, 90 శాతం దరిద్రులతో దేశం ఎలా ముందుకు పోతుంది? కలియుగ పాపం 3 పాదాలతో ఎలా నడుస్తుంది?

దేశం లేదమ్మా, మీ ఏసీ రూముల్లో, మీ స్ప్రింగ్ బెడ్డుల్లో, మీ టీవీ సెట్టుల్లో, మీ డిస్కో పాటల్లో, మీ అపార్ట్మెంటు బంగ్లా విల్లా ల్లో, మీ బెంజ్ కారుల్లో, మీ కోకాపేట భూముల్లో, రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో, నల్ల మార్కెట్లో, మీ చేతి ఫోనుల్లో.

మరెక్కడుందో తెలుసా, రోడ్ మీది బతుకుల్లో, పైకి తేలిన ఎముకల్లో, పస్తులుండే కడుపుల్లో, చస్తూ బతికే మనుషుల్లో, అక్కడుంది దేశం, ఆ పీడిత తాడిత వంచిత వర్గాల్లో, సల సల కాగే ఆవేశం ఏదో ఒకనాడు కట్టలు తెంచుకుంటే ఏమౌతుంది?

పాలు లేక చచ్చే పాపలు ఒకవైపు, గూడు లేక వణికే అనాధలూ ఇంకో వైపు,
డిగ్రీల మూట మూపున కట్టుకుని ఆఫీసుల చుట్టూ తెగ తిరిగే నిరుద్యోగులు, నిర్భాగ్యులు ఇంకో వైపు. ఉన్నారని తెలుసా, మనలో ఉన్నారని తెలుసా? తెలిస్తే ఇంత నిర్దయ, అహంకారం ఎందుకుంటుంది? వస్తుంది, అది తెలిసే రోజొస్తుంది, పంచభూతాలు మనకు బుద్ది చెప్పే రోజోస్తుంది. 7 జిల్లాలను కొన్నా కూడా, 700 సోనా మసూరి బస్తాలను కొన్నా, ధన మదాంధకారముతో, 7 అడుగుల నేల పాతి పెట్టడానికి దొరకదేమో తర్వాత మిత్రమా?

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ వీడదాం, అందరమూ దైవ సంతానముగా భావించి, కలసి మెలసి ఉందాము.

దేశమంటే మట్టికాదో.యి, దేశమంటే మనుషులో.య్ 2
అన్నాడు.. మన మహాకవి, అదే అదే.., నా పల్లవి ||దేశమంటే ||

1) నువ్వు తినే కూడు, నువ్వు కట్టే బట్ట.
నువ్వుండే మేడా.., తేరగ వచ్చాయనుకున్నావా..

దుక్కి దున్ని, నేత నేసి, ఇటుక మోసి.
నెత్తురునే చెమటగ పిండిన, రెక్కలనే ముక్కలు చేసిన, బక్క రైతులు,
బడుగు కూలీలు, కష్ట జీవులు..
వాళ్ళ బిచ్చమే నీ మెతుకు.., వాళ్ళ పుణ్యమే మీ బ్రతుకు.. ||దేశమంటే ||

2)దేశం లేదమ్మా, మీ ఏసీ రూముల్లో, మీ స్ప్రింగ్ బెడ్డుల్లో
మీ టీవీ సెట్టుల్లో, మీ డిస్కో పాటల్లో

మరెక్కడుందో తెలుసా,
రోడ్ మీది బతుకుల్లో, పైకి తేలిన ఎముకల్లో
పస్తులుండే కడుపుల్లో, చస్తూ బతికే మనుషుల్లో
అక్కడుంది దేశం..,

పీడిత తాడిత వంచిత వర్గాల్లో...సల సల కాగే ఆవేశం ||దేశమంటే ||

3)పాలు లేక చచ్చే.. పాపలు, గూడు లేక వణికే.. అనాధలూ..
డిగ్రీల మూట మూపున కట్టుక ఆఫీసుల చుట్టూ తెగ తిరిగే నిరుద్యోగులు, నిర్భాగ్యులు..
ఉన్నారని తెలుసా, మనలో ఉన్నారని తెలుసా..
వస్తుంది, అది తెలిసే రోజొస్తుంది,

ఆ ధనమధాంధుల తాట వలిచే రోజొస్తుంది,
తేరగ తింటూ పెంచిన కొవ్వు, తెంచే రోజు వస్తుంది,
ఆనాడే.., ఆనాడే..,
నిరు పేదల పూరిళ్ళకు, శ్రమ జీవుల ముంగిళ్ళకు
దిగి వస్తుంది ఆసనం...,
నడిచి వస్తుంది మీ వర్గం.., పడి చస్తుంది మీ వర్గం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,547; 104 తత్వాలు (Tatvaalu) and views 226,515
Dt : 14-Aug-2023, Upd Dt : 14-Aug-2023, Category : Songs
Views : 453 ( + More Social Media views ), Id : 1876 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Desamante , Matti , Kaadhoy , Chanda , Sasanudu , NTR , Radha , Sarada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content