మన లోని రాక్షస గుణాలనే అరిషడ్ వర్గాలు ను, నిరంతర సాధన తో, అంతమొందించి జయించి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,403; 104 తత్వాలు (Tatvaalu) and views 225,992.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం కరోనా గురవేనమః.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం, ఆత్మ స్వరూపులైన గురువు లందరికీ, 6 ఏళ్లుగా జరుగుతున్న, నమస్సుమాంజలి. నారాయణ స్వరూపులైన, మీ ఆశీస్సులు తో పాటుగా దైవ ఆశీర్వాదం ఉంటుంది. దైవ అనుగ్రహం కోరే వారికి పంపుతారు కదూ.

అందరం బాగుండాలి, అందరి మంచి కోరే సద్బుద్ది, సాత్విక గుణం, హృదయ మనసు స్పందన, ప్రతినమస్కార సంస్కారం ఇవ్వాలి. కోటి రూపాలున్నా నామాలున్నా, నిరాకారుడు నిరంజనుడు ఒకరే.

మన లోని పశు లేదా రాక్షస గుణాలనే అరిషడ్ వర్గాలు ను, నిరంతర సాధన తో మనమే అంతమొందించి జయించి, సాత్విక గుణం పెంచుకోవాలి, దేవుని అండతో. దానికి ఏళ్ళు, కొన్ని సార్లు జీవితాలు జన్మ లు కావాలి.

మంచి విన్నా, చూసినా, చేసినా పుణ్యం, సత్సంగమే. ఇవి అందుకునే, ప్రతి ప్రాణికి, దైవ రక్ష కలగాలి. అమ్మా నాన్న ల పూజ తర్వాతే, ఆ దేవుని పూజకు విలువ. సాంప్రదాయం, ఆరోగ్యం, మనశ్శాంతి. భౌతిక ఆడంబర పూజ కన్నా, మానసిక పూజ ఉత్తమం.

ఇంట్లో పూజ తర్వాత, 75 ఏళ్ల అమ్మ పాద పూజ, మంత్రోచ్ఛారణతో. గుడి లో శివ శనైశ్చర నేతి దీపం, అమ్మ తూలి పడకుండా, చేయి పట్టి నవగ్రహ 9 ప్రదక్షిణలు, 6 ఏళ్లుగా. ఇంటి హాల్లో తులసి కార్తీక నువ్వుల దీపం.

ఆ దేవుని దయ వలన, 55 వ వారం , 108 ప్రదక్షిణలు, పరగడుపున, ఉదయం 10 లోపు, కరమాల వేళ్ళ గీతల లెక్క తో, నారాయణ మంత్ర ఉచ్చారణ జపంతో, ఉత్త పాదాలతో, 1 గంట 15 ని లోపు, 3 బై 3 గది విస్తీర్ణం లో, తిరిగే భాగ్యం కలిగించారు. కరోనా ముక్కు మూతి కవచం, భౌతిక దూరం తో.

నమ్మకం లేని వారికి, 2 మైళ్ల పైన నడక ఉత్తమ వ్యాయామం అనవచ్చు.

శనివారం వెంకన్న కు స్నానం చేపిస్తూ, పూజారులు హరతి ఇస్తుంటే వేదోచ్ఛారణ తో, కమ్మని సువాసనలతో ధూప దీపాలతో వెలుగొందుతుంటే, వారికి కాపలా నారాయణ సేవకుడి లా, గంట చుట్టూ తిరుగే, భాగ్యం ఆరోగ్యం మనోధైర్యం కలిగించి, తడిచే వానకి వణికే చలికి కాలే ఎండ బారిన పడకుండా, తగిన శక్తిని ఇచ్చే, ఆ దైవ రుణం ఏవిధంగా తీర్చుకోగలము, కన్నీళ్ళు తో తప్ప.

మీ పెద్దలు కు మీరు లేదా పిల్లల తో మీకు పాద పూజ భాగ్యం కలిగించి, మాకు చూసే భాగ్యం కలిగించి, స్నేహితులు బంధువులు పిల్లల కు, అలవాటు చేసే ప్రయత్నం చేస్తారని, చేతులు జోడించి విన్నపము, గురువు లు అందరికీ. పదేళ్లు లోపు నేర్చుకున్న ఆధ్యాత్మిక తే, వందేళ్ళు వాళ్ళ ను, సంస్కారం గా నడుపుతుంది.

సంస్కారం కు తొలిమెట్టు, మన ఇంట్లో, మన ఈ చిన్న ధర్మ ఆచరణలో, ధ్యానం, జపం, ప్రదక్షిణ, పెద్దల గౌరవం, మర్యాద, బాధ్యత, శ్లోకం మంత్రం వేద ఉచ్చారణ, . . .

మీ కన్నా పాపాత్ముడిని, పాపాలు పోవడానికి ఇవి చేస్తున్నా, మరి పుణ్యాత్ములైన మీరు చేస్తే, ఇంకా పుణ్యం రెట్టింపు కదా, ప్రయత్నము చేస్తారని ఆ భాగ్యం ఆ మనసు దేవుడు కలిగించాలని ఆశిస్తూ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,403; 104 తత్వాలు (Tatvaalu) and views 225,992
Dt : 31-Oct-2020, Upd Dt : 31-Oct-2020, Category : General
Views : 958 ( + More Social Media views ), Id : 785 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pradakshina , saturday , sani , mother , pada , puja , demonic qualities , arishad varga , practice , overcome , conquer
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content