చదువు సంస్కారం - ఆగండి ఆగండి మన సంస్క్రుతికే, దీపానికి కిరణం ఆభరణం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,849; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చదువు మరియు సంస్కారం కలసి ఉంటేనే ఆ మనిషి కి దేవుని, పంచభూతాల మరియు సాత్విక మనుషుల దగ్గర విలువ ఉంటుంది. ఉత్త సంస్కారం ఉన్న మహనీయులను కూడా దేవుడు కరుణించారు.

చదువూ సంస్కారం, ప్రతిమనిషికి అవసరం, అందరిలో అవి రెండూ నిండుగ ఉంటేనే, ఉన్నత విలువలతో పురోగమించును సమాజం.

చాలా మందికి సంస్కారం అంటే తెలియదు, తల్లి దండ్రులు కూడా చెప్పరు. ఎందుకంటే వారు కూడా, తమ తల్లి దండ్రులను దగ్గర ఉంచి చూడరు. తమ పిల్లలను, ఊళ్ళో ఉన్న తాత నానమ్మ దగ్గర ఓ నెల రోజులు కూడా ఉంచరు, తాము కూడా కలసి ఉండరు.

ఎందుకంటే, ప్రపంచము ఆగిపోతుంది మేము లేకపోతే అని, సంపాదన తగ్గుతుంది అని, తిరుపతి వెళ్ళినట్లు మొక్కుబడిగా ఓ రోజు గడిపి, వెంటనే పారిపోతారు తమ పేరెంట్స్ బాధ్యతలనుంచి. ఇక అలాంటి వారు, తమ స్నేహితులు బంధువులు జీవితభాగస్వామి పిల్లలతో కూడా, ఎలా ఉంటారో ఊహించవచ్చు.

మేము ఇంజనీరింగ్ కంప్యూటర్స్ కామర్స్ లేదా ఇంకోటి చదివాము, బెంగుళూర్ లేదా విదేశాలలో, కోట్లు సంపాదిస్తున్నాము, ఇదే గొప్ప అనుకుంటారు. అక్కడనే మనకు వారి సంస్కారం కనపడుతుంది.

సంస్కారం అంటే నీతి, నియమం, మాటకు కట్టుబడి ఉండటం, మూలాలు గతం గుర్తు ఉండటం, దయ, జాలి, క్రుతజ్ఞత, తనమన, విశ్వసనీయత, పరోపకారం, సమత, మాత్రు మూర్తి దేశ భాష మమకారం, లాంటి గుణాలు కూడా ఉండాలి.

ఉదాహరణకు, పేద్ద కంపెనీలో కోట్లు సంపాదించినా స్థిరపడినా, తమను ఆ స్థితికి పంపిన, తన తల్లి దండ్రులను మాత్రమే, తను పుట్టిన ఊళ్ళో నో అరకొర సౌకర్యాలతో మగ్గమని కనికరం లేకుండా, ధనమిచ్చి వదిలేస్తారు.

అలాగే, పెళ్ళి చేసుకునే భాగస్వామి ని కూడా గుణం చూడకుండా, అవసరం అవకాశం కోసం మాత్రమే చూస్తారు.

పోనీ వారైనా బాగుపడేది ఉందా, అదీ లేదు, మాయలో ఉండి తాము ఏదో గొప్ప అని, ప్రాపంచిక భోగాలు లో అహంకారము తో మునుగుతూ, అందరికన్నా సంపాదనలో ఐశ్వర్యములో హోదా అధికారం లో మిన్న అని గాలి లో తేలిపోతుంటారు, ఎవరినీ లెక్క చేయరు. బంధాలు అనుబంధాలు ఆప్యాయతలకు వారి దగ్గర విలువలేదు, ఇవన్నీ చెల్లని మాటలు.

చివరకు తాము తీసిన గోతిలోనే తాము పడతారు, ఒక సారి అనారోగ్యం లేదా సంపాదన ఆస్తి తరగడం పోవడం లేదా ఇంకో దానితో, మూలన కూర్చున్నాక, ఆనాడు ఎవరూ వారిని పట్టించుకోరు.

ఈ పాటలలో అంతరార్ధాన్ని మీరే మనసుతో ఆస్వాదించండి.

1) ఆగండి.. ఆగండి, మన సంస్క్రుతికే ఇది మచ్చండి
దేశానికి వెన్నెముకలైన, మన విద్యార్ధులకిది తగదండి
ఆడపిల్లలను తోబుట్టువులా, అభిమానం.తో చూడండి

ఎవరి చెల్లినో అల్లరి చేసి, ఆనందించావా రోజు
నీ చెల్లినే అల్లరి చేస్తే, బాధపడేవు ఈ రోజు
బాధపడేవు.. ఈ రోజు

చదువూ.. సంస్కారం, ప్రతిమనిషికి.. అవసరం
రెండూ నిండుగ ఉంటేనే., పురో.గమించును సమాజం ||చదువూ||

స్వలాభానికై స్వార్ధ నాయకులు, చెప్పే మాటలు వినకండి..
ఉద్రేకములో మన సంపదను, మనమే కాల్చుట వలదండి..2 మొత్తం లైన్లు

చూసారా... చూసారా, ఈ దగా పడిన మన తమ్ముడు
అమానుషంగా అనామకంగా, ప్రాణా.లను కో.ల్పోయాడు
ఏదో ఏదో సాధిస్తాడని, ఎన్నో ఆశలు పెట్టుకుని
పగలు రేయి కష్టపడి, చదివించింది బిడ్డను
ఈ తల్లి గోడు విను వారెవరు.., మీరా.., మీరా.., ఆ నాయకులా..
ఎవరు.

మనం ఎవరిమో తెలుసుకుని, మన బాధ్యత గుర్తుంచుకొని
కన్నవారి బంగారు కలలకు, రూపం దిద్దాలి..
మన కన్న దేశాన్ని, సౌభాగ్యం తో తీర్చిదిద్దాలి.. ||చదువూ||

2) ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ..

దీపా.నికి కిరణం ఆ.భరణం.., రూపా.నికి హృదయం ఆ.భరణం
హృదయా..నికి.. ఏనా..టికీ..
తరగని సుగుణం.. ఆ.భరణం 2 ||దీపానికి కిరణం||

నిండుగ పారే యేరు, తన నీటిని, తానే తాగదు
జగతిని చూపే కన్ను, తన ఉనికిని, తానే చూడదు
పరుల కో.సం బ్రతికే. మనిషి.. 2
తన బాగు, తానే కోరడు..2 ||దీపానికి కిరణం||

తాజమహలులో కురిసే వెన్నెల, పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ, పేద ముంగిట విరియదా
మంచితనము, పంచే.వారికి..2
అంతరాలతో పని ఉందా..2 ||దీపానికి కిరణం||

వెలుగున ఉన్నంత వరకే, నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే, అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం, తెలిసిన నా.డే..2
బ్రతుకు, సార్థకమౌతుంది2 ||దీపానికి కిరణం||

Chaduvu Samskaram Movie Songs Jukebox | Satyanarayana | Gummadi | Ranganath | 1974 Movies
Deepaniki Kiranam, aaganDi aaganDi mana samskruti - chaduvu samskaaram  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,849; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249
Dt : 28-May-2022, Upd Dt : 28-May-2022, Category : Songs
Views : 1442 ( + More Social Media views ), Id : 1407 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : deepaniki , kiranam , agandi , samskruti , chaduvu , samskaaram , Ranganath ,
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content