విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి - చంద్రన్న, లోకేష్, విజయసాయి, వీరన్న, పవన్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2137 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2172 General Articles and views 2,211,106; 104 తత్వాలు (Tatvaalu) and views 244,633.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మా వాట్సప్ స్టేటస్ లో, మంచి విషయాలు మిస్ కావద్దు మిత్రమా. ధనం కు పేద అయినా, సాంప్రదాయం లో మిన్న ఫోటో చూడండి. అరుణాచల నంది ఫోటో. అలాగే నవ్వుతూ నవ్విస్తూ, గలగల మాట్లాడుతూ ఉండే, స్వర్గీయ నాయకుని పాత ఫోటో చూడవచ్చు.

విమర్శలు ఎప్పుడూ ఆరోగ్య కరంగా ఉండాలి. మా 4 పిల్లలు, బీజేపీ తెదేపా వైకాపా జనసేన, భవిష్యత్తు బాగుండాలి అన్నది తప్ప, వేరే దురుద్ధేశాలు మనకు లేవు.

మనము సద్ విమర్శలు చేస్తుంటే ఒకరు అడిగారు, భయం లేదా అని? ఎందుకు భయం లేదు, పట్టణ స్ధాయిలో ఆమంచి అన్న, సునీత అక్క, కరణం బాబాయి అన్నా భయమే. ఇంక జిల్లా రాష్ట్ర స్ధాయి నాయకులు అంటే, ఇంకా ఎక్కువ భయమే కదా. చంద్రన్న ఐటీ అభివృద్ధి అనుభవం, జగనన్న 3 వేల మైళ్ళ నడక 151 సీట్లు గెలుపు, వీరన్న పార్టీ భక్తి పోరాటం, పవనన్న స్వచ్ఛ మనసు మంచితనం, ముందు మనం మాట్లాడగలమా?

కాకపోతే వారూ మరియు మనమూ నమ్మేది, ఒక నిత్య సత్యం ఉంది. అదేమిటంటే, జనం ఎప్పుడూ, మంచి వినరు పట్టించుకోరు అని. కాబట్టి, వారికీ ఇబ్బంది లేదు, ఏదో పోనీలే వృత్తి ధర్మం రాసుకుంటూ ఉన్నాడు లే, మన దగ్గరకు వచ్చి, చెయ్యి పట్టుకుని, మన పని ఆపలేదు కదా, అని వారూ నవ్వుకుంటారు, మంచి మనసుతో. అనుచరులు లాగా, నాయకులు ఎప్పుడూ, విలేఖరులు మీద ఆవేశపడరు.

రెండోది మన స్లోగన్ కూడా వారికి నచ్చుతుంది - తప్పు ఎప్పుడూ అధికారులు నాయకులు ది కాదు, కేవలం ఎన్నుకున్న ప్రజలదే అని.

మూడోది, మనం అమర్యాదగా ఎవరినీ అనలేదు, వారు తప్పు చూపిస్తే , సరిచేసుకోవాలి క్షమాపణ లతో. నేరుగా పార్టీ పెద్దలు కే పంపుతున్నాము.

* విగ్ర‌హాలు ధ్వంసం చేసింది దొంగ‌లు, పిచ్చోళ్ల‌ని నిన్న చెప్పిన డీజీపీ దొరా.. నేడు రాజ‌కీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేప‌ల్లి కొంపలో జగన్ మార్క్ భోగి ప‌ళ్లేమైనా మీకు పోశారా - అని లోకేశ్ సెటైర్లు వేశారు.

లోకేష్ గారి మాటల్లో చమత్కారం, పదును పెరిగింది.

* భోగి రోజు అనుకుంటా, చంద్రన్న అన్నారు - నేనేం తప్పు చేశానో తెలియదు అని.

వెంటనే, విజయసాయి గారు ఊర్కోరు కదా రెడీ గా ఉంటారు, సెటైర్లు చూడండి - పండుగ పూట ఇంత పెద్ద ప్రశ్నలు ఎందుకండి, ఆ తప్పులు అన్ని రాయాలంటే పుస్తకాలు అవుతాయి, అన్నారు.

* బీజేపీ వీరన్న గారు, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ డిమాండ్ చేశారు, అధికారులు మీద చర్యలు అడిగారు. కడపలో కరోనా టీకా గురించి వేసిన పోస్టర్ లో అందరితో పాటూ, మోదీ గారి ఫోటో ఎందుకు వేయలేదు అని. కరెక్టే గదా, కేంద్రం పంపుతుంది.

* రామతీర్థ పోరాట కమిటీ ని వేశారు పవనన్న.

మనం మొన్న ఆర్టికల్ కూడా రాశాము, టీకా ప్రచారం లో మోదీ గారి బొమ్మ పేరు వేసుకోలేదు. రాష్ట్రంలో, మన స్టిక్కర్ వేస్తారు ఏమో అని. అదే వీరన్న గారు అంటున్నారు కదూ.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2172 General Articles and views 2,211,106; 104 తత్వాలు (Tatvaalu) and views 244,633
Dt : 15-Jan-2021, Upd Dt : 15-Jan-2021, Category : Politics
Views : 911 ( + More Social Media views ), Id : 926 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : criticisms , healthy , chandranna , lokesh , vijaysai , veeranna , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content