పరిస్థితులు అనుకూలించలేదని, తాగుడుకో లేదా ఇంకో వ్యసనానికో బానిసలుగా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,402; 104 తత్వాలు (Tatvaalu) and views 225,147.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒకరు, తన ఇంట్లో వారు ఎవరూ, పిల్లలు తో సహా, తన మంచి మాట వినడం లేదు, తనను లెక్క చేయడం లేదని లేదా పరిస్థితులు అనుకూలించలేదని, తాగుడుకో జూదానికో లేదా ఇంకో వ్యసనానికో బానిసలుగా మారతారు, ఏదో ఒక బలహీన క్షణాన, తమను తాము మోసము చేసుకుంటూ, సర్ది చెప్పుకుంటూ.

పరిస్థితులు ఎండా వానా కాలం వంటివి. ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, కాలం అలాగె మన స్థితి, స్థిరము కాదు చరము. ఇప్పుడున్న కష్టాలు మనస్పర్ధలు ఇంకో నెలకే ఉండకపోవచ్చు. కాబట్టి, మన విలువలు దిగ జారకూడదు.

బాధలు, దేవుడు మన మానసిక ధైర్యం ను పరీక్షించడానికి ఇస్తున్నాడు, మనము ధర్మం తప్పకపోతే, చివర నిమిషములో అయినా, కాపాడతారు.

బాధలకు పరిష్కారం, ఇంకో తప్పు చేయడం కాదు, వ్యక్తిత్వమును చంపుకోవడము కాదు. నీతి నిజాయితీ గుణము కు మచ్చ తేవడము కాదు. ఆ తప్పు కు ఎటూ తనూ బలి అవుతాడు.

అందరికీ అంతవరకు మాత్రమే తెలుసు. కానీ పతనం అక్కడ తో ఆగదు.

బలి అయిన వారివి మంచి సలహాలు ఆలోచనలు అయితే, కాలచక్రం లో, వారి పతనం కు కారణం అయిన, కుటుంబ సభ్యులు కూడా, పతనం అవుతారు సుమా. ఇది తద్యం, మరువద్దు.

ఎందుకంటే, సంస్కారము లేకుండా ముందు చూపు లేకుండా, భాగస్వామి మరియు పిల్లలు తప్పుదోవలో పడుతుంటే చెడిపోతుంటే, ఏ మంచి ప్రాణీ చూస్తూ ఉండలేదు. వారిని మార్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు.

కాని కాలం కలసి రాకపోతే, ఎవరూ వీరి మంచిని అంగీకరించరు. గేళి చేసి, తనని మూల కూర్చున పెడతారు.

మనకు దైవము అనుకూలించలేదు అని, ఇంకా కొంత కాలము ఎదురు చూడాలి గాని, తను వ్యసనానికి బానిస అయ్యి, పతనము కాకూడదు. ఓ 2 లేదా 5 ఏళ్ళ తర్వాత, ఎదురు దెబ్బ తగిలి, ఇంట్లో అందరూ మంచి గా మారవచ్చు.

అందుకే దేవుని మీద భారం వేసి, నీతి నిజాయితీ తో, మన మంచి మనము కొనసాగిస్తూనే ఉండాలి సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,402; 104 తత్వాలు (Tatvaalu) and views 225,147
Dt : 04-Feb-2022, Upd Dt : 04-Feb-2022, Category : General
Views : 506 ( + More Social Media views ), Id : 1294 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : conditions , situations , unfavorable , slaved , drinker , alcohol , addiction
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content