APLatestNews.com top Banner

Social Media links
చీరాల వేటపాలెం, నాయకులు అధికారులు, నా జగనన్న ఫించన్ ఇప్పించరూ - దేవన - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 920 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

విన్నపము 1 -

గౌరవ చీరాల వేటపాలెం, నాయకులు మరియు అధికారులు కు నమస్కరించి వ్రాయు విన్నపము,

ఈ అర్జీలో ఉన్న వివరాల ప్రకారం, చీరాల దేవాంగపురి కి చెందిన దేవన కుమారి గారు, ఫించన్ విషయం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వితంతు ఫించన్ అందడం లేదని, ఒకరు పంపారు. పించను ఐడి - 245674.

దయచేసి, మీలో దయార్ద్ర హృదయం, మంచి మనసున్న వారు, ఎవరైనా వారితో, వెంటనే మాట్లాడి సహాయం చేసి, వారిని ఆదుకోవాలని మనవి.

అర్హత సమస్యలు ఏమైనా ఉంటే చెప్పగలరు. వారు మీకు మిగతా వివరాలు ఇవ్వగలరు.

ఫలితం ఏదైనా సరే, మనకు తెలియజేసిన, అందరికీ మీ సంపూర్ణ సహకారం సహాయం గురించి, తెలుపగలము. ధన్యవాదములు.

విన్నపము 2 -

చీరాల వేటపాలెం ఎమ్మార్వో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎంపీడీవో, మాజీ ఎమ్మెల్యే గార్లు, అధికారులు నాయకులు,

మన ముఖ్యమంత్రి జగన్ గారు, అభాగ్యులు అందరికీ, ఫించన్లు అందాలని, అందించాలని ఆరాటం ఆశయం. మనమంతా బాగా అందిస్తూ, ప్రజలకు సహాయం చేస్తున్నాము, అని వారు భావిస్తున్నారు.

పొద్దున్న పంపిన, అర్జీ లో లేక ప్రాసెస్ విధానం లో తప్పు ఉంటే, దయచేసి వివరంగా చెప్పగలరు. మీకు చెందిన విషయం కాకపోతే, సంబంధించిన అధికారులుకు పంపగలరు మరియు వారి, పేరు నంబర్ ఇవ్వగలరు. మేమూ వారిని కోరుతాము.

మీ విఫల సమాచారం తర్వాత, పెద్దలు కలెక్టర్, బాలినేని గార్ల దగ్గరకు పంపుదాము. వీలున్న అన్ని దోవలు ప్రయత్నం చేయాలి ఫలితాలు ఏమినా, ముందు ఊరు స్ధాయి లో, తర్వాత జిల్లా, రాష్ట్ర స్ధాయిలో. బాధ్యత గల అధికారులు ఎప్పుడూ, నాయకుల జోక్యం లేకుండా నే స్పందించిన బాగుంటుంది.

ఆమంచి లేదా కరణం గార్లు, ముందుకు వచ్చి, చీరాల స్ధాయిలో నే , ఈ చిన్న విషయాన్ని, పరిష్కరిస్తారని ఆశిద్దాం.

సహృదయంతో అభాగ్య ప్రజలకు సహాయం చేస్తున్న, మిమ్మల్ని మీ మంచితనాన్ని పొగిడే అవకాశం, మాకు కలిగించ ప్రార్ధన.

update : Dec/8/2020

మొర ఆలకించే వారు ఉన్నారా స్ధానిక అధికారులు, నాయకుల లో చూద్దాం అనుకున్నాం, గుర్తు ఉందా కొద్ది రోజుల క్రితం.

ప్రజల పన్నులు తో జీతాలు సౌకర్యాలు తీసుకుంటున్న, స్ధానిక నాయకులు మరియు అధికారులు, ఎవరూ జవాబు ఇవ్వలేదు, మొర ఆలకించలేదు, ఇంకో దోవ చూపలేదు. అంటే ఇది ఇంకో, స్ధానిక అధికారులు పని అని కూడా, సమాధానం లేదు. వారి నిర్లక్ష్యం, ఉదాసీనత చూసారా?

జగనన్న ఈ వ్యవస్థ లో, మార్పులు తేవాలి. చిన్న పనులు కు కూడా, జిల్లా మరియు రాష్ట్ర అధికారులు కు, ఇబ్బందులు ఎక్కువ చేయరాదు కదా, ఇంతమంది స్ధానిక అధికారులు ఉండి కూడా.

చీరాల ఎమ్మార్వో గారి వాట్సాప్ ఫోన్, ఆ తర్వాత పని చేయలేదు. మరి సెలవులో ఉన్నారో, కావాలని ఆపారో తెలీదు. గతంలో నే, వేటపాలెం ఎమ్మార్వో, ఒంగోలు ఆర్డీవో, ప్రకాశం డీఆర్వో గార్లు, ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఫోన్లు, వాట్సప్ ఆపిన విషయం మీకు తెలిసిందే, ఇంకా పునరుద్ధరణ చేయలేదు. ఆదాయ రెవెన్యూ అధికారులు అంటే, సామాన్య జనం ను విలేఖరుల ను, పట్టించుకోరు అని, ఎంత బాధ్యత గా ఉన్నారో, ఈ ఉదాహరణ చాలు కదా.

చీరాల వివేకానంద సమితి వారు, జిల్లా మరియు రాష్ట్ర అధికారులు కు కూడా, అర్జీ లు పంపారు. మొత్తానికి ఏ దోవ అయితే నే, కదలిక వచ్చింది. ఫోన్ లో సమాచారం చెప్పారు అంట, జనవరిలో మొదలు అవుతుంది ఫించన్ అని.

వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గార్లు కు, ఇతర అధికారులు కు ధన్యవాదాలు. మన జిల్లా కలెక్టర్ గారు, శనివారం చీరాలలో గంజిపాలెం సచివాలయంలో, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధన్యవాదాలు.

స్ధానిక అధికారులు మరియు నాయకులు, ప్రజలను గుర్తించి వారి సమస్యలను గౌరవించి, తమ బాధ్యత నెరిగి, తమ స్ధాయిలో నే పరిష్కరించి, జిల్లా మరియు రాష్ట్ర అధికారులు కు పని ఒత్తిడి తగ్గించాలని, చెడ్డ పేరు తొలగించాలని పలువురు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 948 General Articles, 46 Tatvaalu
Dt : 27-Nov-2020, Upd Dt : 27-Nov-2020, Category : Request
Views : 137 ( + More Social Media views ), Id : 827 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , vetapalem , leaders , govt , officials , help , pension , devana , kumari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content