చీరాల నగర్ - జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ అమోఘం - కలెక్టర్, బాలినేని, ఆమంచి, కరణం, పోతుల - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,476; 104 తత్వాలు (Tatvaalu) and views 230,703.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సీఎం జగన్‌ రాష్ట్రంలో శుక్రవారం లాంఛనంగా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ఈ పథకం కింద మొదటి దశలో, 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా, రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు.

175 నియోజకవర్గాల్లో, నేటి నుంచి 15 రోజుల పాటు, పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా, అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం​ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేదల కష్టాలను కళ్లారా చూశాను అన్నారు.

ఆ కార్యక్రమం లో భాగము గా, శభాష్ బాలినేని గారు, కలెక్టర్ గారు, ఉప్పు నిప్పులైన 2 వర్గాలను, ఒక చోట చేర్చి, ఎవరినీ బాధపెట్టకుండా, వ్రుధా ఖర్చుతో 2 మీటింగ్ లు పెట్టకుండా, ప్రభుత్వం పరువు పోకుండా, అమోఘముగా అట్టహాసముగా, జగనన్న ఆశయం ఇళ్ళ పట్టాల కార్యక్రమాన్ని విజయవంతము చేసారు, చీరాల వచ్చి, ధన్యవాదములు.

ఆంధ్ర మొత్తము ఒక ఎత్తు, చీరాల మాత్రమే ఒక ఎత్తు. చంద్రన్న అయినా, జగనన్న అయినా, ఎప్పుడూ ఏదో ఒక విచిత్ర తంటా ఇబ్బందీ. అదే చీరాల లో కనపడని, అభివ్రుద్ది విచిత్ర పరిస్థితి. ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్, చీరాల జిల్లా, జిల్లా శాఖలు, ఇతర అభివ్రుద్ది ఎప్పుడు వస్తుందో.

చీరాల నియోజకవర్గం లోని, చీరాల నగర్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, వైయస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం, మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేతుల మీదుగా, కలెక్టర్ పోలా భాస్కర్ గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో, చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ గారు మరియు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గారు, మరియు మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత గారు, వెంకటేష్, తదితర వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది.

చీరాల వై యస్ ర్ సి పి నాయకులు సమక్షంలో మహిళామ తల్లులకు ఇళ్లపట్టాలు పంపిణీ మరియు ఇళ్లకు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,476; 104 తత్వాలు (Tatvaalu) and views 230,703
Dt : 25-Dec-2020, Upd Dt : 25-Dec-2020, Category : Politics
Views : 826 ( + More Social Media views ), Id : 884 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , distribution , jagannanna , housing scheme , collector , balineni , amanchi , karanam , potula
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content