చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా - నాయకి నాగమ్మ మల్లమాంబ మొల్ల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,719; 104 తత్వాలు (Tatvaalu) and views 226,019.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈనాటి తెలుగు జాతి ఎంత దిగజారిపోయింది ఎక్కువ శాతం, క్రుతఘ్నత అవకాశ అవసర బానిసత్వములో, మంచికి చేయూత నిచ్చే మనసులు లేవు. ఎందుకంటే, మనము ఎన్నుకునే స్థానిక నాయకుల నుంచి, రాష్ట్ర నాయకులు దాకా, మన ఓటర్ల లక్షణాలు బయటపడుతున్నాయి కదా?

ఆనాటి తెలుగు జాతి పౌరుషాన్ని, ఈ పాటలో చూసి, సిగ్గు పౌరుషము తెచ్చుకుందాము. నాగరికత అంటూ ఆత్మాభిమానము చచ్చి, జీవచ్చవములా కాలం వెళ్ళదీస్తూ, చిన్న దోమ కరోనా చేతిలో పిట్టల్లా ఎగిరిపోతున్నాము, రోగనిరోధక శక్తి పెంచుకునే ఓపిక లేక. ఇప్పుడైనా, మనిషి గా బతుకుదాము.

ఆఖరికి బట్టనెత్తి లేదా నిండు గుండు ఉన్న మా స్నేహితులు గురువులు కూడా, 24 నెలల మాస శిరోముండనము తో, మాకు సంఘీభావము తెలియచేసావు నిండు జుట్టు ఉండి కూడా అని, నోరు తెరిచి మనస్పూర్తి గా అనలేకపోతున్నారు. అవ్వ, మన్నించాలి, మనసు బండబారితే, దేవుడు దూరమౌతారు.

మాది రాగం తానం సున్నితత్వం లేని గార్ధబ గొంతూ అని తెలిసినా, మీలో పౌరుషం తెలుగుతనం నిద్ర లేపడానికి ఈ పాటలు. మీలో ఉన్న పౌరుషాన్ని మేల్కొలిపి, మేము మా పిల్లలు కూడా, ఇంత కన్నా బాగా పాడగలము, రాయగలము, తెలుగు ద్రోహులము కాదు అని మీ ఆత్మకే నిరుపిస్తారని ఆకాంక్ష.

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా

1. వీర రక్తపుధార వార వోసిన సీమ,2
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా... 2
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్,
తాండ్రపాపయ్య కూడ నీవోడోయ్

2. నాయకి నాగమ్మ మల్లమాంబ మొల్ల,2
మగువ మాంచాల నీ, తోడ బుట్టిన వోళ్ళే 2
వీర వనితల కన్న తల్లేరా., ధీరమాతాల కన్నభూమేరా.

3. కల్లోల గౌతమీ, వెల్లువలా కృష్ణమ్మ 2
తుంగభద్రా తల్లి పొంగిపారిన చాలు 2
ధాన్యరాశుల పండు దేశాన,
కూడు గుడ్డకు కొదువలేదోయి

4. ముక్కోటి బలగమొయ్, ఒక్కటై మనముంటే,
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లిఒకటే నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలా

5. పెనుగాలి వీచిందీ, అణగారి పోయింది 2
నట్టనడి సంద్రాన, నావ నిలుచుండాది 2
చుక్కాని బట్టారా తెలుగోడా ..
నావ దరి చేర్చారా మొనగాడా

ఘంటసాల మరియు బృందం పల్లెటూరు సినిమా - రచన వేములపల్లి శ్రీకృష్ణ
Palletooru Telugu Movie, NTR , Savitri , S. V. Ranga Rao
Cheyyetthi Jai Kottu Telugoda - Palletooru NTR , Savitri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,719; 104 తత్వాలు (Tatvaalu) and views 226,019
Dt : 03-Apr-2022, Upd Dt : 03-Apr-2022, Category : Songs
Views : 1084 ( + More Social Media views ), Id : 1326 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : cheyyetthi , telugoda , palletooru , ntr , savitri , svr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content