చంద్రన్న, జగనన్న, పవనన్న, వీరన్న మరియు పురాణ సలహాదారులు - భాగం 1 చంద్రన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,048,069; 104 తత్వాలు (Tatvaalu) and views 235,611.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మీరు చెప్పే సలహాలు అన్ని, ప్రభుత్వం కు ఉపయోగం, ఉదాహరణతో సహా చూపిస్తున్నారు. కలెక్టర్, మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ ఎవరూ సరిగ్గా పధకాల అమలు, సోషల్ మీడియా లో సమాచారం ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం లో అమలు లో ఉన్న, సోషల్ మీడియా కూడా ఆగిపోయింది.

1. మరి (A) గతంలో మరియు (B) ఇప్పుడు, లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న, సలహాదారులు మంత్రులు, ఎందుకు ఇంత నిజాయితీగా చెప్పి, మన జగనన్న భవిష్యత్తు ను, చంద్రన్న లాగా పాడు చేయకుండా ఆపరు?

2. పురాణాలలో సలహాదారులు ఉన్నారా? వారి మాట, నాటి నాయకులు విన్నారా? ఉత్తమ సలహాదారులు ఎవరు, అందులో?

జవాబు, ఇవి పార్టీలు కే కాదు, మన ఇంట్లో నిర్ణయం అయినా మోహం లో ఒకటే, అందుకే ఇవి రాస్తుంది. ప్రతి ఇల్లు, ఓ చిన్న పార్టీ నే సుమా. రాజకీయ తప్పులు, మన ఇంట్లో కూడా జరగకుండా చూసుకోవాలి.

సలహాదారులు, అనుభవజ్ఞులు అయి ఉంటారు ఆయా రంగాలలో లేదా సమాజ పోకడలో. కానీ మరలా వ్యక్తిత్వం, నిజాయితీ, ధన అధికార దాహం లేకుండా, నాయకుని క్షేమం కోరే వారయి ఉండాలి. బయట లోకం చూసి కూడా, నిజాయితీ గా చెప్పేవారు ఉంటారు, మన లాగా.

కానీ వినేందుకు, పెద్దలు సిద్ధంగా కూడా ఉండాలి కదా. అధికార భ్రమలలో మత్తులో, వినరు వినలేరు. ఎందుకంటే పెట్టుబడి దారులు లేదా వర్గ నాయకులు, వారిపై ఎప్పుడూ తీవ్రమైన వత్తిడి తెస్తూ ఉంటారు. వారి సొంత లాభమే వారికి ముఖ్యం. మేము పార్టీ కోసం ఇంత విరాళం ఇస్తే ఇంత పని చేస్తే, ఎవరో చెప్పారు అని, మా పనులు ఆపుతారా అంటారు. నాయకులు, రెండు వైపులా సరిచేసుకోవాలి, మధ్యస్తంగా పోవాలి, పార్టీ భవిష్యత్ కి నష్టం లేకుండా.

పెట్టుబడి దారుల లేదా వర్గ నాయకుల చేతిలో లొంగిపోతే, రేపు పార్టీ దిగిపోతే సీట్లు కోల్పోతే, అందరికీ అంతకంటే పెద్ద నష్టం అనేది, గ్రహించాలి. దానిని కూడా బేరీజు వేయాలి ముందు చూపుతో, వారి కోరికలను అవసరాలను స్వార్ధ లాభాలను, అదుపులో పెట్టాలి.

సలహా దారులకు మంత్రులు కు లక్షల జీతం, ఆదాయం, హోదా, సౌకర్యాలు, ఫించన్లు, వస్తున్నప్పుడు, పార్టీ నాయకుడి మాటకి పనులకు ఎదురు చెప్పి, అవన్నీ పోగొట్టుకోవడం అవసరమా? మిగతా వారు, మనల్ని ఇతర పార్టీ కోవర్టు అంటే, అనిపించుకోవడం అవసరమా? అని అవకాశవాదముతో గమ్ముగా ఉండి, నాయకులు చేసే ప్రతి తప్పుడు పనికి, ఈలలు వేసి, చెడు ను ప్రోత్సాహం చేసి, వీరూ మరియు వారూ అందరూ, తర్వాత అధికారం పోగొట్టుకుని, అవమాన పడతారు నష్ట పోతారు.

ఇప్పుడు బీహార్ నుంచి లేదా ఇతర కన్సల్టెంట్ ల ను పెట్టుకుని, వ్యవహారాలు నడిపిస్తున్నారు, తమ మీద తమ అనుచరుల మీద నమ్మకము విశ్వాసము లేక. జనం లో నమ్మకం గౌరవం లేనిదే, వీరి వలన గెలిపించడం అవుతుందా? ముగ్గురు దగ్గర ధనం తీసుకుని, నచ్చిన వారికి ఓటు వేస్తున్నారు కదా, తెలివిగా. 151 సీట్లు వచ్చింది, కన్సల్టెంట్స్ వలన కాదు, చంద్రన్న ప్రభుత్వ తీవ్ర వ్యతిరేకత వలన అని వీరు గుర్తిస్తారా?

ఈ మొదటి భాగంలో, చంద్రన్న ప్రభుత్వం లో, మనం సలహాదారులు గా ఊహించుకుని, ఈ కిందివి చెప్పుకుందాం. అధికారంలో ఉండగా వారు కూడా ఇవి వినరు ఆలోచన చేయరు, కొన్ని ఇప్పుడు కూడా జీర్ణం చేసుకోలేరు.

1. పంట భూములు తాక కుండా, మీరు ఏమైనా చేయండి అని మనం చెపితే, ఆనాడు వారు వింటారా? అటు ఇటు, ఎటైనా జరగండి, జరుపుకోండి, రాజధాని పంటలు కు నష్టం వాటిల్లకుండా అంటే వింటారా?

2. సింగపూర్ కు భూమి ధారాదత్తం చేయవద్దు, ధన సహాయం తీసుకుని, వడ్డీ చెల్లింపు వరకే ఉంచుదాం. గతంలో రాజన్న, తీర భూములు దుబాయ్ వ్యవహారం చూసాము. ఇలా వద్దు అంటే వినే వారా?

3. గ్రాఫిక్స్ తో ఊహాగానాలు హైప్ లు వద్దు. గాలిలో మేడలు కట్టి, మనకు మనమే దొంగలము కావొద్దు అంటే, వింటారా? మామూలు రాజధాని, నేరుగా కట్టుబడి చేద్దాం. ముందు ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు వరకు చాలు. కేంద్ర సంస్థలు ఎటూ వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు ప్రభుత్వం తరపున, అంటే వినేవారా?

4. చింతమనేని లాంటి వారిని వార్నింగ్ ఇచ్చి, వినకపోతే, అవసరం అనుకుంటే అతనిని వదులేద్దాం, ఆ సీటు ని కూడా అంటే వినే వారా? ఈరోజు 23 సీట్లు కన్నా నష్టమా, ఆ సలహా? అతను భయపడి మారేవాడేమో? ఇతరులకు కనువిప్పు, వచ్చేది ఏమో?

5. పారాయణ కోచింగ్ కోసం, ప్రభుత్వ బడుల విలువ తగ్గించవద్దు, మూయవద్దు. పారాయణ అక్రమాలను ఆపండి, ఆ వ్యక్తి కాదు ముఖ్యం. పార్టీ అంటే వింటారా? అదే విధంగా, జేసీ బస్సులు బాగోతం, చర్యలు తీసుకోవాలని చెపితే వింటారా? సుజనా, రాయపాటి లాంటి బాంకు రుణాలు పై వారిపై చర్యలు లేదా మందలింపు, ఒప్పుకుంటారా? దూరంగా పెట్టమంటే అంగీకరిస్తారా?

6. లోకేష్ ఎమ్మెల్సీ వద్దు, ఓ నియోజకవర్గంలో తిప్పి కష్టపడి చెమటోడ్చి గెలిపిద్దాం. భవిష్యత్తు కు పునాది ఇప్పుడు వేద్దాం. ఒకవేళ ఓడితే, తర్వాత ఎమ్మెల్సీ ఉపయోగించుకుందాం, అంటే వినేవారా? జగన్ కష్టం లో మనం కొంత అయినా చేయవద్దా?

7. ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు వద్దు వారికి పదవులు వద్దు, రాజీనామా తో గెలిపించి తెద్దాం అలాగే, జగన్ ను గేళిచేయవద్దు, అంటే వింటారా?

8. ఆనాటి సలహాదారుని గా, కాంగ్రెసు తో కలవద్దు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది, బీజేపీ జనసేన తో గొడవ వద్దు, అంటే, నాడు మన మాట వింటారా?

9. టీటీడీ లో చైర్మన్ మెంబర్లు గా, రాజకీయ వాసనలు లేని వ్యక్తులు కనీసం 2 ఏళ్ళనుంచి, స్వాములు, జీయరు, గరికపాటి, చాగంటి లాంటి వారిని పెట్టమంటే వింటారా?

10. కనీసం ఇప్పుడు కూడా మారలేదు, ఎదగడానికి అవకాశం ఉన్న చీరాల లాంటి నియోజకవర్గంలో కూడా, సొంత పార్టీ ని, వాళ్ళే గొంతు నులిమి చంపుతున్నారు, పక్క పార్టీ లోకి పోయిన తమ వ్యక్తి కోసం.

11. ఇలాంటి అన్ని నియోజకవర్గాల్లో, కనీసం కొత్త యువకులు ను తయారు చేసి, మన మాటలతో ధర్నా లు దీక్షలు తో పైకి ఎదగవచ్చు, నలుగురు నోళ్ళల్లో నానవచ్చు.

12. ఆంధ్రా లోనే నివాసం చేయండి, అభిమానులను కలవకుండా నే, అన్నా వినడము లేదు. కరోనా సమయములో ఏ నాయకులు బయటకు రాలేదు, వెళ్ళమన్నా వెళ్ళలేదు.

ఇంకా రెండు ఏళ్ల ఎన్నికల సమయం ఉంది, కానీ చేయరు. ఎందుకంటే వైకాపా వ్యతిరేక ఓటు తో గెలవచ్చు అని. మన మంచితనం తో గెలిస్తే శ్రీ రామ రక్షణ, ఇతరుల తప్పులు తో గెలిస్తే, గాలిలో మేడ.

అందరూ మనల్ని ఎగతాళి చేసి, వైకాపా కోవర్టు అని, భయస్తుడు అని, సలహాదారుడు గా మమ్మల్ని తీసేసేవారు కాదా? ఇలాంటి నిర్ణయాలు ఎన్నో, తలా పాపం, పిడికెడు. ఇవన్నీ నిజాయితీ గా ఎవరు చెపుతారు, దూరద్రుష్టితో? హోదా పదవికి ఆశ పడితే, ఇవి చెప్పగలమా? చెప్పినా కూడా, అధిష్టానం అధికార మత్తులో, దూర చూపుతో వీటిని అంగీకరిస్తుందా?

రెండో భాగం లో, నేటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని, మూడో భాగం లో పురాణం చూద్దాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,048,069; 104 తత్వాలు (Tatvaalu) and views 235,611
Dt : 23-Dec-2020, Upd Dt : 23-Dec-2020, Category : Politics
Views : 783 ( + More Social Media views ), Id : 878 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , jagannanna , pavananna , veeranna , purana , advisors
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content