ఏనాడు మొదలిడితివో విధీ, ఏనాటి కయ్యెనీ నాటక సమాప్తి - చంద్రహారం - NTR, Sriranjani, SVR, Savitri - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,261; 104 తత్వాలు (Tatvaalu) and views 217,393.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మానవుడు కు వచ్చే ఇబ్బందులు 2 రకాలు, ముందు జన్మల మరియు ఈనాడు అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వములో చేసిన తప్పులకు, శిక్షలు. తనను తాను నిందించుకోడు, తప్పు ఒప్పుకోడు, సరిచేసుకోడు ఆత్మజ్ఞానము తో. వీలైతే ఇతరులను నిందిస్తారు, లేదంటే దేవుని నిందిస్తారు, ఇంకొంత పాపం మూటగట్టుకుంటారు. ఈ పాటలో కూడా అంతే.

ఎప్పుడు మొదలు పెట్టారో దేవుడి విధిరాత, మనకు అవసరము లేదు. మనము ఎప్పుడు మొదలు పెట్టాము కపట నాటకము, ఎప్పుడు దాని నుంచి పశ్చాత్తాపముతో బయటపడ్డామో కావాలి, అది ఆలోచన చెయ్యాలి, కానీ చెయ్యము.

జనన మరణాలతో, సుఖ దుఃఖములతో, ప్రాణులను ఆడించి, పీడింతువేమయ్య అంటుంటాము. నిజానికి తోటి ప్రాణులను ఆడించి పీడించేవాడు, మానవుడే కదా? తనకు తానే ఎన్నో తాత్కాలిక వేడుకలు సుఖాలు బ్రమలు స్రుష్టించుకుని, అవి దూరమవగానే, బ్రమలు తొలిగి, మాయ చేసావు అని దేవుని అంటాము. అసలు మాయగాడు మానవుడే కాదా?

నేను నాదను ఆశ, తల కెక్కించుకుని, అది ఇంకొకరు లాక్కుని, వారికీ అదే ఆశ కదా, అంతలోనే పాతాళమున దించు తారు. ఎందుకంటే, మనకు కారు/ పదవి/ ఆస్తి/ అధికారం కావాలి అని ఆశపడి, ఎన్నో తప్పులు చేస్తే, మన పిల్లలు బంధువులు స్నేహితులు కూడా, అవి తమకు కావాలని, వెన్నుపోటు పొడుస్తారు. ఆశ మనలో ఎప్పుడు కలుగుతుందో, అప్పుడే మన చుట్టుపక్కల వారికి కూడా కలుగుతుంది కదా? ఎవరు మాయం చేసింది?

తనువు శాశ్వత మనుచు, మైమరువచేసుకుని, ఎన్నో మోసాలు ద్రోహాలుతో, ఎన్నో సంపాదించుకుంటే, తనువును, జీవిని, విడదీత తప్పదు కాల చక్రములో, ఈ లోపు మనల్ని కాటేసే నాగులు ఎన్నో కదా?

ప. ఏనాడు మొదలిడితివో .., విధీ
ఏనాటి కయ్యెనీ., నాటక సమాప్తి. - 2

చ. జనన మరణాలతో, సుఖ దుఃఖములతో 2
ప్రాణులను ఆడించి, పీడింతువేమయ్య.. 2
ఎన్నెన్నొ వేడుకల యీ సృష్టి కల్పించి.. 2
కనుమూయునంతలో, మాయ జేసేవయ్య ||ఏనాడు ||

నేను నాదను ఆశ, గగనాని కెక్కించి 2
అంతలో, పాతాళమున దించు వేమయ్య.. 2
తనువు శాశ్వత మనుచు, మైమరువచేసి.. 2
తనువును, జీవిని, విడదీతు వేమయ్య ||ఏనాడు ||

చిత్రం: చంద్రహారం (1954); రచన: పింగళి; సంగీతం: ఘంటసాల; గానం: ఘంటసాల
N.T. Rama Rao, Sriranjani, S.V. Ranga Rao, Savitri.
ఎన్.టి. రామారావు, శ్రీరంజని, ఎస్.వి. రంగారావు, సావిత్రి.

Chandraharam - Yenadu Modalidithivo vidhi - NTR, Sriranjani, SVR, Savitri  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,261; 104 తత్వాలు (Tatvaalu) and views 217,393
Dt : 03-Jan-2023, Upd Dt : 03-Jan-2023, Category : Songs
Views : 386 ( + More Social Media views ), Id : 1679 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandraharam , yenadu , modalidithivo , vidhi , ntr , sriranjani , svr , savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content