ప్రవేటు పత్రిక టీవీల ప్రకటనల దుబారా ఖర్చు తగ్గించలేమా? దేశీయ ఉచిత సోషల్ ఉన్నా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,032; 104 తత్వాలు (Tatvaalu) and views 224,930.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దేశ రాష్ట్ర క్షేమం కోరే ప్రభుత్వ నాయకులు, అధికారులు, మరియు ప్రజలు, ఆత్మ విమర్శ చేసుకోండి ఒక సారి మనస్ఫూర్తిగా,

ప్రియతమ సీయం జగనన్న కు, ప్రతిపక్ష నాయకులు కు, పై అధికారులు కు, వాస్తవం అర్ధం అయేలా చెప్పలేరా?

మన ఇంట్లో జరిగే వృధా ఖర్చు ను, అనవసర ఆర్భాటం, మనం బాధ్యత గా ఆపమా?

ప్రజా ధనానికి మనము కాపలాదారులు గా మాత్రమే ఉన్నాము అని, ప్రధాని మోదీ చెప్పారు. జగనన్న మరియు ప్రతిపక్ష ఉద్దేశ్యం, అదే కదా. మరి మనం పాటిస్తూ ఉన్నామా?

ప్రభుత్వ పధకాలకు కుటుంబ పేర్లు పెట్టుకుంటూ, పదేళ్ళు గా ఉన్నాము. ఆత్మాభిమానం ఉన్న వారికి, ఇది తప్పు అని, నీతి నిజాయితీ గల అధికారులు నాయకులు ప్రజలు, సొంత ప్రభుత్వం కు నాయకులకు, ఆనాడు ఈనాడు కూడా, సర్ది చెప్పడం లేదు.

ప్రవేటు పత్రికలు మరియు టీవీల్లో, ప్రకటన ఖర్చులు కోట్ల రూపాయలలో ఉంది, ప్రభుత్వం నుంచి. గతంలో పేపరు టీవీ తప్ప, వేరే ప్రచార మాధ్యమం లేదు, అప్పుడు తప్పదు ఏమో. నేడు కరోనా తో, అసలు పేపర్లు కూడా కొని చదివే వారు లేరు.

అంత పబ్లిసిటీ పేపర్ టీవీ ఖర్చు, నిజంగా ఈ నాడు అవసరమా? మీడియా వారు కూడా, ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు లేదా? ప్రవేటు వ్యక్తులు కంపెనీలు ప్రజలు, ప్రవేటు పత్రిక టీవీ ఎటూ వాడతారు, వారికి మనకు తప్పదు, వాటి మనుగడకు.

దుబారా ఖర్చు తగ్గించలేమా, మనకు ఇంత ప్రజా సంబంధ వ్యవస్థ, ఉండి కూడా? ఈనాడు దేశీయ విదేశీ ఉచిత సోషల్ మీడియా, వచ్చిన తర్వాత కూడా, ఇంత ఖర్చు అవసరమా?

ఓ వైపు రాష్ట్రం అప్పుల కొండ, రోజు రోజుకు పెరుగుతుంది, 10 ఏళ్లుగా. ఆ పాపం మనందరిదీ కాదా, మన పిల్లలు దాని ఫలితాలు అనుభవించ వద్దా?

ప్రజల చేతిలో ఫోన్ ఇంటర్నెట్ తో, ఆఖరికి పల్లెటూరు వారు కూడా వాట్సాప్ అంటూ, ఇప్పుడు ప్రపంచం ను చూస్తున్నారు. పదవ తరగతి లోపు పిల్లల చేతిలో ఫోన్ లో, నెట్ పాఠాలు చెపుతున్నారు వింటున్నారు. సినిమా పాటలు వింటున్నారు.

అధికార ప్రతిపక్ష పార్టీలు కు, స్థానిక నాయకులు ఉన్నారు, ప్రతి గ్రామంలో, పట్టణంలో సోషల్ మీడియా తో.

మన ప్రభుత్వ అధికారులు కు, బ్రహ్మాండమైన వ్యవస్థ ఉంది, ప్రభుత్వ పధకాల ప్రకటన ప్రజలకు చేర్చడానికి. అనంతపురం జిల్లా లో చేసి చూపించారు, ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా స్ధాయిలో అందరు అధికారులు చే, సోషల్ మీడియా నడిపించారు.

జిల్లా స్ధాయిలో కలెక్టర్, పంచాయతీ, రెవెన్యూ, విద్య, వైద్య అధికారులు అలాగే

, పట్టణ మరియు గ్రామ మరియు సచివాలయంలో అదే అధికారులు మరియు వాలంటీర్ లు అందరూ, సోషల్ మీడియా కలిగి ఉంటే సమాచారం అందిస్తే,

ఇంతకన్నా నిబద్ధత కలిగిన, క్షణాలు లో అందరికీ చేరే, పెద్ద సమాచార వ్యవస్థ, ప్రవేటు పత్రిక లకు టీవీలకు ఉందా?

దయచేసి మీ పై అధికారులు నాయకులు తో మాట్లాడి, గ్రామ పట్టణ స్ధాయి అధికారులు నుంచి జిల్లా రాష్ట్ర అధికారులు దాకా, సొంత సోషల్ సమాచారం పంచేందుకు, ప్రవేటు పేపరు టీవీ ప్రకటనల ఖర్చు తగ్గించేందుకు, ముందుకు వచ్చి రాష్ట్రం ను దాని సంపదను కాపాడాలని, ప్రజలు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,032; 104 తత్వాలు (Tatvaalu) and views 224,930
Dt : 09-Mar-2021, Upd Dt : 09-Mar-2021, Category : Politics
Views : 785 ( + More Social Media views ), Id : 1016 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , govt , jagan , reduce , private , paper , tv , ad , cost , free , social media
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content