Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Booloka Swargama - Chakri - Vadde Naveen, Punam Segar
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
ఏ దేశం లో అయినా, ప్రజలు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో మునిగి, ధనం అవసరం అవకాశం వర్గం కు అమ్ముడుబోయి, నక్క పాము పులి గుణాలకు మాత్రమే ఓటు వేసి, ఆవు గుణాలను ఓడిస్తూ గేలి చేస్తుంటే, ఫలితం వారే అనుభవించాలి.
దాని ఫలితముగా, నిరుద్యోగం ప్రభలింది. కారణం జనం మత్తులో వేసిన ఓట్లే అని తెలిసినా, తమ మానసిక బలహీనత ఒప్పుకోలేక, ప్రభుత్వాన్ని నాయకులను అధికారులను నిందిస్తూ కాలం గడుపుతున్నారు.
ఇంకొంత మంది ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళి, బ్రోకర్ల చేతిలో చిక్కి, ధన మాన విలువల ను పూర్తిగా వదిలేస్తున్నారు. నానా కష్టాలు నరకయాతన పడుతూ, తమ వారికి బాధకలగకూడదు అని, అంతా బాగుంది అని అబద్దాలతో కాలం వెళ్ళదీస్తున్నారు. గొప్పలకు పోయి, అప్పుల పాలై, తమ పెద్దలకు కష్ట నష్టాలను ఎక్కువ చేస్తున్నారు.
ఇంక అంతా బాగుండి, స్తిరపడినవారు, క్రుతజ్ఞతలు విశ్వసనీయత మరచి, సొంత ముదుసలి అమ్మా నాన్నలను, పెళ్ళైతే ముదుసలి అత్తా మామలను, తమతో సమాన వైద్య సౌకర్యాలు ఇవ్వకుండా, దగ్గర ఉంచి దేవతలు గా సేవించకుండా, దూరంగా ఉంటరిగా వదిలేస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా.
ఈ పాటలో, లండన్ వెళ్ళి, పౌండ్ ల మీద మత్తులో, నానా బాధలు పడ్డ మనుషుల గురించి ఉంటుంది. కానీ అది ఏ దేశమైనా అవే బాధలు. కాబట్టి అన్ని దేశాలకు వలస వెళ్ళిన వారికి వర్తిస్తుంది.
మంచి మార్గాలు అవకాశాలెన్నో వున్నా, అవి నీకోసం చుస్తూ వున్నా, అందనిదే లండన్/ దుబాయి/ న్యూయార్క్ గొప్పని నమ్మి, అప్పుల కుప్పలతో ఆస్తి పాస్తులన్ని అమ్మి, ప్రాపంచిక బ్రమల ఊహల్లో మేడలు కట్టి, ఫారిన్ లో అడుగే పెట్టి, పరువంత పక్కన పెట్టి, కూటి కోసం కోటి విద్యలు అంటూ కూలీల వేషం కట్టి, చేసిన తప్పులకు అవమానాలెన్నో మోస్తూ, అన్ని పనులు చేస్తూ ఉన్నావా? జీవితమే జీతం తోటి, తూకం వేస్తూ ఉన్నావా? ఎండమావి నీళ్ల కోసం ఎడారిలోన వేతికావా? ముళ్ల దారిలోన నువ్వు గాయమయ్యి నిలిచావా?
మనం సత్వ గుణం తో ఉంటే, మనకు సత్వ గుణం వారే దొరుకుతారు, వారే మంచి మార్గం చూపుతారు. మమ్మల్ని ఆనాడు, ఈనాడు మోసం చేసింది మనవారే, జాగ్రత్తలు సుమా. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు, మన ఇంట్లో, మన చుట్టూ ఉన్నారు.
ఆఖరకు మన తెలుగు సంఘాలు కంపెనీలు కూడా, తమకు చిక్కిన మానసిక బలహీన ప్రాపంచిక బ్రమల, వీసాల పాశాల విద్యార్ధులను ఉద్యోగులను, ఆశలు చూపి, తమ అవసరాలకు ఫంక్షన్లకు రాలీలకు మీటింగ్ లకు యాత్రలకు రాజకీయ అవసరాలకు, బిర్యాని లు కోక్ లు పిజ్జాలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకుంటున్నారు సేవలు చేయించుకుంటున్నారు. తక్కువ జీతాలకు పని చేయించుకుంటున్నారు. హోటల్, మోటల్, పెట్రోల్ బంక్, కిరాణా షాప్, 7 ఎలెవెన్, వంటలు, ఎక్కడ చూసినా మన జనమే. ఆఖరికి ఊరు చూడటానికి వచ్చినా, అమ్మ నాన్న లను కూడా, వీలైతే పనిలో దింపుతున్నారు. దొరికితే దొంగ, లేకపోతే దొర, పలుకుబడి ఉంటే.
+ + +
1 భూలోక స్వర్గమంటూ, ఈ దేశం ఎగిరొచ్చావా
పోలేక ఉండలేక, కంటినీరై నిలిచావా
ఎన్నెన్నో ఆశలతోటి, దేశం దాటివచ్చావా
అడుగడుగున బాధలతోటి, బ్రతుకే పోటీ ఇచ్చావా
కన్న తల్లి చేతి ముద్ద, నేలపాలే చేశావా
అమ్మ కన్న మిన్న లేదు, అన్న మాటే మరిచావా
2 చదువులకే చదువై నిలిచి., అమ్మ కంటి వెలుగై నిలిచి
పౌండు ల్లో పవరే చూసి., లండన్ని లవ్వే చేసి
కన్నోళ్ళ తోడే విడిచి., కని పెంచిన ఊరే విడిచి
నేస్తాల స్నేహం విడిచి., నీ మట్టికి దూరం నడిచి
పై చదువుల కోసం, నువ్వు, పయనం అయ్యి వచ్చావా
నీ మేధకు సమాధి కట్టే, మోసానికి, బలి అయ్యావా
ప్రాణమల్లే వున్న చదువుని, పార్ట్ టైం లా మర్చావా
బాధల్లో ఉన్నా గాని, బాగున్నా నని అన్నవా
3 అవకాశాలెన్నోవున్నా.., నీకోసం చుస్తూ వున్నా,
అందనిదే గొప్పని నమ్మి., ఆస్తి పాస్తులన్ని అమ్మి,
ఊహల్లో మేడలు కట్టి., ఫారిన్ లో అడుగే పెట్టి,
పరువంత పక్కన పెట్టి., కూలీల వేషం కట్టి,
అవమానాలెన్నో మోస్తూ, అన్ని చేస్తూ ఉన్నావా.
జీవితమే జీతం తోటి, తూకం వేస్తూ ఉన్నావా.
ఎండమావి నీళ్ల కోసం ఎడారిలోన వేతికావా.
ముళ్ల దారిలోన నువ్వు గాయమయ్యి నిలిచావా
4 రక్తాన్నే పంచిన తల్లి., రాఖిని కట్టిన చెల్లి
నువ్వు ఆడి పాడిన గల్లి., చూస్తున్నది నీకై మళ్లీ
ఎదిగొచ్చిన బిడ్డల కోసం., ఎద నిచ్చే ఆప్తుల కోసం
గూడొదిలిన గువ్వల కోసం., గుర్తొచ్చే నవ్వుల కోసం
చూస్తున్నది గగనం నిండా, ఎగిరే జండా రమ్మంటూ.
వీస్తున్నది దేశపు గాలి, జెండా ఊంచా అనమంటూ.
ఓ సచిను కలాం కూడా, ఫారిన్ పౌండే దిక్కనుకుంటే
ఈ ఎత్తుకు ఎదిగేవారా, దేశం క్యాతిని పెంచేవారా
నిజం తెలుసుకో( వందే మాతరం), నీ రుణం తీర్చుకో (వందే మాతరం )
భారతీయుడై భువిని గెలుచుకో
వందే మాతరం వందే మాతరం 4
Writer(s): Lalita Suresh, D B Chary
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2262 General Articles and views 2,560,429; 104 తత్వాలు (Tatvaalu) and views 273,730
Dt : 08-Dec-2024, Upd Dt : 08-Dec-2024, Category : Songs
Views : 102
( + More Social Media views ), Id : 2194
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Booloka Swargama ,
Chakri ,
Vadde Naveen ,
Punam Segar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments