Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
మాత్రుదేవోభవ, పిత్రుదేవోభవ అని చిన్నప్పుడు నేర్చాము, పెరిగాక అవసరాలు తీరాక అర్ధము లేని వ్యక్తిగత స్వేచ్చ తో దాని అర్ధం మరచాము, అలా మనల్ని నిరుపయోగము గా తయారుచేసిన, కన్నవారిని ఆనందముగా క్రుతఘ్నత లేదా శిక్ష తో దూరంగా విడచాము.
కానీ కనీసం ఓ 25 శాతం మంది, తమ దగ్గర ఉంచుకుని సమాన సౌకర్యాలతో, కన్న వారి రుణం, అలాగే పితరుల రుణం తీర్చుకుంటున్నారు, తర్వాత తరాలకు పాప భారం తగ్గిస్తున్నారు. వారికి ధన్యవాదములు.
కానీ అంతకన్నా గొప్పది, మన తల్లిని కూడా కన్న, ఈ నేల, ఈ ఊరు, ఈ రాష్ట్రం, ఈ భాష, ఈ దేశం. మరి దేశ రుణం తీర్చుకోవడం ఎలా?
రాష్ట్ర సంపదను దోచుకుంటున్నా, తాకట్టు పెడుతున్నా, 3 మాగాణి పంటలు కాంక్రీట్ చేస్తున్నా, గుండాలు రౌడీలు వెన్నుపోటు ఆర్ధికనేరాలు వెన్నుపోటు కేసులు స్టేలు ఉన్నవారు నాయకులు అవుతున్నా, ఓట్లు అవసరాలకు అమ్ముకుంటున్నా, మనక ఉలుకు పలుకు ఉండదు, తమ పేర్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నా మనకు పట్టదు, ఎందుకంటే బద్దకం నిర్లక్ష్యం కావచ్చు, ఓటు అమ్ముకోని ఉండవచ్చు, లేదా వారు మన వర్గం వారు కావచ్చు లేదా అవసరాలు ఉండవచ్చు. ఇది మన కే తెలిసి తెలియని దేశ భక్తి.
దాని ఫలితాలు ఇప్పుడు, దేశభక్తి బాధ్యత లేని ప్రజలు, శ్రీలంకలో అనుభవిస్తున్నారు. ఒక్క రోజుకో, పెట్రోలు ఉంది అంటా, ఈ రోజు వార్త. వచ్చే 2 లేదా 3 నేలలు, అయోమయ పరిస్థితి, కొత్త అప్పులు లేవు. ఆకలి కేకలు, జనము నాయకుల మీద తిరుగుబాటు.
మాత్రుభాషలో 10 ఏళ్ళు గా, 10 మాటలను సోషల్ మీడియాలో, రాయలేని దౌర్భాగ్య స్థితిలో 10 వ తరగతి మరియు ఆ పైన చదివిన వారు ఉన్నారు.
ఇక ఇప్పుడు వస్తున్న, కరోనా దయతో పాసైన 10 వ తరగతి మేధావుల చేతుల్లో, భవిష్యత్ దేశ పరిస్థితి ఉండబోతుంది, అయినా మాకు నష్టం లేదు, మేమే కరెక్ట్ అనుకునే వారు ఉన్నారు. ఎందుకంటే, అప్పటికి వారు ఉండకపోవచ్చు, కానీ మన తర్వాత తరాలు, ఆ ఘోర పరిస్థితులను ఎదుర్కోవాలి. కానీ ముదుసలి తనం మనకూ వస్తుంది అని, ధనం కాపాడలేదని, తప్పకుండా తెలుసుకుంటాము.
ఇలాంటి దౌర్భాగ్య పరిస్తితిలో కూడా, దేశ సేవ కున్న, ఒకే ఒక ఉత్తమ మార్గం, సైనికుడు. వారు, సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే, మనము లోన, హయిగా ఒకర్ని ఒకరు దోచుకుంటూ, ఒకర్ని ఒకరు ఇబ్బందులు పెట్టుకుంటూ తగవులు తన్నులాటలతో రాజకీయాలు నడుపుతూ, సుఖము గా ఉన్నాము.
అందుకే, సైనికులు కనపడ్డప్పుడు వారిని మనము గౌరవించాలి, మనకోసం వారు, ఇల్లు వాకిలి తమ వార్ని విడచి, కఠిన శిక్షణతో, కఠిన పరిస్తితులలో, కఠిన పోరాటాలు చేస్తున్నారు సుమా. దేశ రక్షణ కోసము, వారు ఎంతో శ్రమించాలి, నరసిమ్హ అవతారము తో, శత్రువులను జయించాలి.
కానీ దేశం లో ఉన్న, కుళ్ళు ను కూడా కడగడానికి, ప్రతి సారీ, దేవుడే రాకుండా, కొంతమంది వ్యక్తులను ముందు పంపి ధర్మ ప్రచారం చేస్తారు, రామానుజ, ఆదిశంకరులు వాంటి వారుతో. అప్పటికి వినకపోతే, మారకపోతే, వర్గ పోరాటాలు మొదలు, ప్రజల తిరుగుబాటు.
40 ఏళ్ళ ముందు, కాంగ్రెస్ పాలనలో ఉన్న కుళ్ళు ను కడుగుతూ, తీసిన ఈ సినిమా గీతాలను చూడండి, ఒకసారి పాడండి, ఎంత భావోద్వేగము తో ఉన్నాయో. అలాంటి ఉత్తమ సినిమా తీసిన దర్శకుడు దాసరిని, నిర్మాత వడ్డే రమేష్ లను అభినందించాలి. ఆ తర్వాతనే గాయకులు, నటులు సుమా.
1)
జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి, స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో… ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి. స్వర్గాదపీ గరీయసి
నీ తల్లి మోసేది… నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి… కడవరకురా, కట్టే కాలే వరకురా
ఆ ఋణం… తలకొరివితో తీరేనురా
ఈ ఋణం… ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవానురా… త్యాగానికి మరో రూపు నువ్వురా
జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి, స్వర్గాదపీ గరీయసి
గుండె గుండెకు తెలుసు… గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు… గుండె కోత బాధేంటో
ఈ గుండె రాయి కావాలి… ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ… మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం… నీ మనుషుల కోసం, నీ మనుషుల కోసం
జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసి, స్వర్గాదపీ గరీయసి
2)
పరిత్రాణాయ సాధూనాం... వినాశాయ చదుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... యుగే యుగే... యుగే యుగే
సంభవం నీకే సంభవం... సంభవం నీకే సంభవం
ధర్మానికి నువ్వే రాజువై... న్యాయానికి నువ్వే మూర్తివై 2
అవినీతినే అణచివేయ్... అన్యాయమే తుడిచివేయ్
అది నీకే సంభవం... సంభవం... సంభవం
చరణం 1 :
తల్లి కడుపు పండగా... పుట్టినావు కొడుకుగా
తల్లి కట్టే కాలగా... చేరినావా కాటికి
చెల్లి వలపు పంటగా... వీడినావు ప్రేమని
చెల్లి గుండె రగలగా... ఆర్పినావా మంటను
ఆ రగిలే మంటలు ఎక్కడివి?, ఆ పగిలే గొంతులు ఎవ్వరివి?
నీ తల్లివా... నీ చెల్లివా....2
దిక్కులేని అనాధలవా...రోడ్డు పక్క అభాగ్యులవా
ఆ పాపుల పాలిటి పులివై బెబ్బులివై
బొబ్బిలిపులివై... బొబ్బిలిపులివై సాగిపో..
సంభవం నీకే సంభవం... సంభవం నీకే సంభవం
చరణం 2 :
రక్తానికి రక్తం సిద్దాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం
గుండెకు గుండె మార్పిడి, స్వార్ధానికి స్వార్ధమే దోపిడీ
అసత్యానికి నాలుక కోసెయ్, అధర్మానికి చేతులు నరికెయ్
అన్యాయానికి అక్రమానికి... కాళ్ళు చేతులు తీసేయ్...
కన్నెపిల్లలను పిల్ల తల్లులను తార్చే
దిగజార్చే, తెగమార్చే, తార్పుడు గాళ్ళను
రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి
మసి పూసేసే, కను మూసేసే, దేశద్రోహులను
చీల్చాలి చెండాడాలి... చీల్చి చీల్చి చెండాడాలి
చిత్రం : బొబ్బిలి పులి (1982), నేపధ్య గానం : బాలు
Release date: July 9, 1982, Director: Dasari Narayana Rao, Music by: J. V. Raghavulu, Starring: N. T. Rama Rao; Sridevi
దర్శకత్వం: దాసరి నారాయణరావు, సంగీతం: J. V. రాఘవులు, నటీనటులు: N. T. రామారావు; శ్రీదేవి
Vijaya Madhavi Combines, Vadde Ramesh
Bobbili Puli Janani Janmabhoomicha svargadapi Sambhavam nike - ntr sridevi
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2273 General Articles and views 2,688,440; 104 తత్వాలు (Tatvaalu) and views 284,360
Dt : 16-May-2022, Upd Dt : 16-May-2022, Category : Songs
Views : 1123
( + More Social Media views ), Id : 1392
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
bobbili ,
puli ,
janani ,
janmabhoomischa ,
svargadapi ,
sambhavam ,
ntr ,
sridevi ,
dasari ,
vadde
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments