Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Bharata Vedamuga - Pournami - Prabhas, Trisha, Charmi
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
మీకు వచ్చే సందేశాలు అన్ని, 50 మందికి పైగా అందరికీ పంపే సహజమైనవి. మీకు మాత్రమే వస్తే, స్పష్టముగా మీ పేరుతో వివరము తో ఉంటుంది సుమా. అనవసరముగా అపోహలు, ఆరాటాలు ఆలోచనలు పోరాటాలు టెంక్షన్స్ వద్దు. ఆ సందేశాలు అన్నీ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ వీడమని, పంచభూతాల శిక్షణకు అలాగే వెన్నుపోటు గుండెపోటు రోగపోటుకు దూరం గా ఉండమని, వేడుకోలు మాత్రమే.
మన ఎదురు జరిగేది ఏదీ వాస్తవం కాదు, నేడు ఉన్నది రేపు ఉండదు. అంతా మిధ్య. అది ఆచరణ శివ విష్ణు దేవీ భక్తులు మాత్రమే అర్ధం చేసుకుని రోజూ ఆచరణలో పెట్టి, తమ సాధనలు నీతి నియమాలు త్యాగాలు కష్టాలు కన్నీరు, అందరికీ తెలుపుతారు.
ముఖ్యముగా శివ భక్తులు, ఎన్ని పూజలు యాత్రలు చేసినా, శివయ్య శ్మశాన వైరాగ్యం, మాత్రం నేర్చుకోలేరు, ఆచరణలో చూపలేరు, 100 జన్మలు ఎత్తినా. అందుకే, శివ దీక్ష చాల కష్టమైనది. ఏదీ నాది కాదు, నాకు ఏ సౌకర్యాలు అవసరము లేదు అని చాప నిద్ర చేస్తారు, శాఖాహారమే తింటూ జీవ హింసను వదలి, మనశ్శాంతి తో ప్రశాంతముగా ఉంటారు.
మరి అలాంటి వైరాగ్యమూర్తి శివయ్యకు ఇంకో రాగ నాద పాట నైవేద్య పెడదామా? మనము భక్తులమని, మన ప్రతి పాట మాట వాక్సుద్ది తో, నడవడికలో కనపడాలి మిత్రమా. ఈ పాట పాడి పంపిస్తారు కదూ, చాలా కష్టమైనది.
నీలకంధరా, జాలిపొందరా, కరుణతొ నను గనరా? అర్ధం ఉందా? మనం ప్రపంచ బ్రమలో ఉంటే, మనలో ఉన్న శివుని కనలేక, ఈ మాటలు అనడమే. శివునికే జాలి లేకపోతే, మనలో జ్యోతి ఉండదు, అప్పుడు మనకు బతుకే లేదు. శివం పోతే మనలో, మనము శవం అవుతాము సుమీ. నేలకందరా, శైలమందిరా, మొరవిని బదులిడరా? ఇది అర్ధం లేదు, మన ఆత్మ మొర, మనం వినడం లేదు. అది వింటే, ఆత్మే మన శివయ్య అని మనకు తెలుస్తుంది జీవా.
నిరంతర కఠిన సాధనతో, మానసిక నియంత్రణతో, మంచి మాటల వ్రాతతో ప్రచారముతో, నమక చమకముల నాదాన, యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన, ప్రణవనాద ప్రథమనాథ శృతి వినిపిస్తే, దానికి మనలో ఉన్న ఆత్మ కదిలేతే, మనమే శివుడము. దేహమే దేవాలము, జీవుడే సనాతన దైవం. శివ కేశవులు జీవులు వేరు కాదు, అది తెలుసుకుని బతికుండగానే ప్రాపంచిక బ్రమల నుండి ముక్తి పొందడమే జీవిత లక్ష్యం.
కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలేసి వెళ్లాలని అంతరార్థం చెపితే మనవారికి ఇంకా ఎక్కలేదు. ఇంకా తగవులు అప్పులు యాత్రలు మోహాలు రోషాలు ఆశలు ఆరాటాలు. అదే వదిలేయడం ఇంటి దగ్గరే వదిలేసి, సజీవ గురువు సేవ చేస్తే, కాశీ వెళ్ళి గంగలో మునిగిన పుణ్యం వస్తుంది అని వీరికి తెలీదు. అదే పని మన బ్రహ్మం గారు, వేమన, రాఘవేంద్ర స్వామి చేసారు. ఉన్న చోటనే, ముక్తి పొందారు.
కాయపేక్ష అంటే శరీరానికి ఆపేక్షమైనవని అర్ధం. శరీరంపై మమకారం ఉంచుకోవదని పరమార్థం. ఆ మమకారాన్ని వదిలియేమని కాశీ యాత్ర చెబుతోంది. కాశీలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు నువ్వు కోరికలను వదిలేయమని శాస్త్రం చెబుతోంది. ఫలాపేక్ష అంటే ప్రతిఫల ఆపేక్షను వదిలేయమని అర్ధం.
ఇప్పుడైనా కళ్ళు తెరచి, బీద సత్వగుణ సంపన్నులకు, మన ఉద్యోగాల గురించి చెప్పి, రాముడు సీత క్రిష్ణుడు రుక్మిణీ లాంటి ఉత్తములను ప్రోత్సహిస్తారు కదూ. మనము ఏది ప్రపంచానికి ఇస్తే, అదే మనకు మన సంతానానికి మన మనుమలకు అందుతుంది - అది మంచా చెడా, బద్దకమా నిర్లక్ష్యమా మోసమా 2 నాల్కలా మీ ఇష్టం. ముదుసలి తల్లి దండ్రులకు అత్త మామలకు ఇరుగు పొరుగుకు సేవ చేయని వారు, భక్తులు ఎలా అవుతారు? మానవ సేవ మాధన సేవ అని ఎక్కడ మీరు సాధన చేసారు?
+ + +
శంభో శంకర
హర హర మహాదేవ 4
తద్ధింతాదిది ధింధిమీపరుల తాండవకేళీ తత్పర
గౌరీమంజుల సింజిణీజతుల లాస్యవినోదవ శంకర
భరత వేదముగ, నిరతనాట్యముగ, కదిలిన పదమిది ఈ.శ.
శివ నివేదనగ, అవని వేదనగ, పలికెను పదము పరే.శ.
నీలకంధరా, జాలిపొందరా, కరుణతొ నను గనరా.
నేలకందరా, శైలమందిరా, మొరవిని బదులిడరా..
నగజామనోజ జగదీశ్వర మాలేందుశేఖరా, శంకరా.. ||భరత వేదముగ||
హర హర మహాదేవ... 4 ఆ....
హ... అంతకాంత నీ సతి, అగ్నితప్తమైనది, మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది.
ఆదిశక్తి ఆకృతి, అద్రిజాత పార్వతి, తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. ఆ...
భవుని భువికి తరలించేలా . ధరణి దివిని తలపించే లా.
రస తరంగిణీ లీ.ల, యతిని నృత్యరతులు చేయగలిగే ఈ, వేళ ||భరత వేదముగ||
జంగమ సావర గంగాచ్యుత శిర, భృతమణి పుటకర పురహరా
భక్త శుభంకర, భవనా శంకర, స్వరహర దక్షాత్వర హరా
పాలవిలోచన, పాలిత జనగణ, కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష, అథనాశ విశాషణ, జయగిరీశ బృహదీశ్వరా
హర హర మహాదేవ 2
వ్యోమకేశ, నిను హిమగిరి, వరసుత ప్రేమపాశమున, పిలువంగా
యోగివేష, నీ మనసున కలగద, రాగలేశమైనా..
హే మహేశ, నీ భయదప దాహతి, దైత్య శోషణము జరుపంగ
భోగిభూష, భువనాళిని నిలుపవ, అభయముద్రలోన
...
నమక చమకముల నాదాన, యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణా.న, ప్రణవనాద ప్రథమనాథ శృతి వినరా..
హర హర మహాదేవ
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2262 General Articles and views 2,560,390; 104 తత్వాలు (Tatvaalu) and views 273,726
Dt : 09-Dec-2024, Upd Dt : 09-Dec-2024, Category : Songs
Views : 77
( + More Social Media views ), Id : 2195
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Bharata Vedamuga ,
Bharatha Vedamuga ,
Pournami ,
Prabhas ,
Trisha ,
Charmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments