పేపర్ టీవీలో భజన మానరు, వర్గ ధనవంతుల నాయకుల, చిన్న పనులు ను కూడా - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1163 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1192 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వాట్సాప్ స్టేటస్ మరువద్దు, గొప్ప సమాచారం, దైవ స్మరణ సాత్వికత విడువద్దు.

వడ్డించేవాడు మన వాడైతే, మనం ఏ మూల కూర్చుని ఉన్నా, ఎంత లేటుగా వచ్చిన కూడా, మనకు అన్ని గౌరవ మర్యాదలు తిండి అందుతాయి, హాయిగా కడుపు నిండా తినవచ్చు.

చిన్న విషయం కూడా, అసలు విషయాలు తప్పులు దాచి, భూతద్దంలో గొప్పగా పొగుడుతూ చూపిస్తారు 70 ఎమ్ఎమ్ లో, తాము పుచ్చుకున్న తాంబూలానికి న్యాయం చేస్తూ, టీవీ పత్రికల లో.

అలాగే మనం పలుకుబడి ధనం హోదా అధికారం ఐశ్వర్యం, ఉన్న వారమైతే మన వేలు తెగినా కూడా, అన్ని ప్రముఖ పేపర్లు లో, ప్రముఖ అబ్బాయి లేదా తండ్రి గారి వేలు తెగితే, టించరు వేసి, కుట్లు వేసి, ధారలుగా కడవలతో కారుతున్న రక్తం ను, పదిమంది పేదలకు పంచుతూ కూడా, అతి కష్టం మీద చెన్నైలో అపోలో వైద్యులు, అమెరికా పేరొందిన సీనియర్ డాక్టర్లు సాయంతో, జూం వీడియోలో చూస్తూ, నిరంతర పరివేక్షణలో లక్షల ప్రజా ధనం ఖర్చు తో, ఐసీయూలో ఉంచి, అత్యుత్తమ వైద్యం అందించి, 3 నెలల తర్వాత, కన్నీటి వీడ్కోలుతో ఇంటికి లేదా ఇంకో చోటికి పంపారు అంటారు.

వారి కుటుంబ సభ్యులు, హుటాహుటిన అమెరికా ఢిల్లీ బెంగుళూరు నుంచి వచ్చి, తండ్రి తల్లి తమ్ముడు చెల్లెలు ఇక్కడే 3 నెలలు ఉన్నారు, వారి కోట్ల సంపాదన వదిలి, మొత్తం ఐసీయూలో నే 24 గంటలు అన్ని రోజులు గడిపారు, ఆసుపత్రిలో క్రమశిక్షణ మరియు నర్సులు అందుబాటులో ఉండరు, ఇతర పేషంట్ లకు అసలు ఇబ్బంది ఉండదు కాబట్టి అంటారు.

రాష్ట్ర ప్రముఖులు కూడా, గంట గంటకు పలకరింపు లకు వచ్చి, తమ సానుభూతిని అభిమానం ను తెలియజేసారు. డాక్టర్లు ప్రతి గంటకు, ప్రత్యేక రిపోర్ట్ బులిటెన్లను, విడుదల చేశారు, బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు కోసం.

డబ్బు ఎక్కువ ఇస్తే ఇలా రాస్తారో లేదా జర్నలిజం అంటే కేవలం వ్యక్తి కుటుంబ భజన మాత్రమే అనుకుని రాస్తారో తెలీదు, ఆ పేపర్ టీవీ లేదా ఆ విలేఖరి. జనం ముసి ముసి నవ్వులు నవ్వు కున్నా, ఆ పేపర్లు టీవీలలో భజన మానరు, తమ వర్గ లేదా ధనవంతుల లేదా నాయకుల, చిన్న చిన్న పనులు ను కూడా.

ఇందులో మనకు అర్థం కానివి, విచిత్ర మైనవి, జనం నవ్వు కునేవి గమనించండి. వేలు తెగినా, కరోనా వచ్చిన కూడా, మామూలు ఆసుపత్రిలో నే మన వైద్యం తోనే, మనము ఎవరమైనా దానితో పోరాడుతాం, బయట పడవచ్చు లేదా నేరుగా పైకి పోవచ్చు. డబ్బున్నా, మ్రుత్యువు వదలదు.

వాళ్ళ పిల్లాడిని లేదా తల్లి దండ్రులు ను, అమెరికా, బెంగుళూరులో లేదా ఢిల్లీలో, వారితోనే ఉంచుకుని, అత్యుత్తమ వైద్యం అందించవచ్చు, పది ఏళ్లుగా, కోట్లు ఉన్నాయి కాబట్టి. కానీ మాతో ఉండడు ఉండరు అంటానికి వారికి వంద కారణాలు ఉంటాయి, చెపుతారు కూడా, ఆత్మ ద్రోహం చేసుకుంటూ, ఇతరులను నమ్మించటానికి.

ఒంటరి వారిని, ముదుసలి తల్లి ని తోడుగా ఉంచుకోమంటే, నేను సంపాదించాలి, బయట తిరగాలి, సరదాలు సంతోషాలు వినోదాలు, కష్టం ఇంట్లో ఎవరూ అమ్మ కు తోడుగా ఉండరు అంటారు.

పైళ్ళైన వాడిని అడిగితే, మా ఆవిడ ఒప్పకోదు లేదా ఆయన ఒప్పుకోరు అంటారు, ఏవేవో సాకులు. మేము బాధ్యత లేని పిల్లలం, మా తల్లి ఇలాగే ఆనాడు అనుకుని ఉంటే, రోడ్డు న పడి ఉండే వాళ్ళం అని ఒప్పుకోరు.

ఐసీయూలో అసలు లేదా ఒకరికి మించి ఉంచరు ఎక్కడ కూడా, మరి ఇంతమంది 3 నెలలు 24 గంటలు ఉంటారా తోడుగా ఐసీయూలో. అంటే ప్రతి దానికి, ఎంత ఎక్కువ భజనలు చేస్తున్నారో కదా, అబద్ధాలు తో.

అయితే అతి ప్రచారం అయినా కూడా, కనీసం వారు వచ్చి 3 నెలలు అందబాటులో ఉన్న విషయం అభినందించాలి. వీరిని చూసైనా, ఇంకొంతమంది తల్లి దండ్రులు లేదా బిడ్డలు ను, తమతోనే ఉంచుకుని బాధ్యత గా చూసిన, ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

ఇప్పుడు మనం కూడా ఓ నాయకులు పత్రికలు టీవీ అండ ఉంటే, 7 ఏళ్లుగా కన్నతల్లి ని కన్నుల్లో చూసుకుంటూ, 3 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం ఆదాయం వదిలి, ఉన్నది ఖర్చు చేస్తూ, ఇంటి వైద్యం తో, మంచం మీద వి ఎత్తి పోస్తూ, ప్రపంచ అత్యుత్తమ వైద్యం ఇప్పిస్తూ, 73 వారాలు 108 ప్రదక్షిణలు చేస్తూ, 20 ఏళ్లుగా నేల నిద్ర తో శాఖాహారం తింటూ, తల్లిని పసిపాప లా కూతురు లా, చూసుకుంటున్న కొడుకు ఉన్నాడు, అని రాసి ఉండేవారు కదూ. అవ్వ, మన మొఖం ఫోటోలు హోదా ఆస్తి జీతం అవసరమా ఇతరులకు, సొంత తల్లి కొడుకు సేవకు?

మనకు కావాల్సింది, మన ఫోటోలు వీడియో లతో భౌతిక ప్రపంచ ప్రచారం కాదు, మన మనసులో పరమాత్మ కు కృతజ్ఞతలు తెలుపుతూ, సత్కార్యం సంస్కారం తో ఆచరణలో రోజూ పాటిస్తూ, ప్రపంచానికి కేవలము మన పనులు మాత్రమే తెలియాలి, ఫోటో లు వీడియోలు కూడా పని గురించి మాత్రమే ఉండాలి, అదీ ఇతరులు పాటించడానికి దానిని చూసి. మన ముఖ ఫోటోలు హోదాలు ప్రదేశం ఐశ్వర్యం జీతం సంపద గురించి ప్రచారం, అవసరం లేదు కదూ మిత్రమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1192 General Articles, 47 Tatvaalu
Dt : 07-Mar-2021, Upd Dt : 07-Mar-2021, Category : General
Views : 123 ( + More Social Media views ), Id : 1009 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhajans , paper , tv , rich , class , people , leaders , small deeds , things
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content