పాటతో పరమార్ధం - బంటు రీతి కొలువు - త్యాగరాజు (రాముడు) కీర్తన - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,476,009; 104 తత్వాలు (Tatvaalu) and views 265,983.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit- Bantu reeti koluvu - Thyagaraja (Lord Rama) Keerthana

బంటు రీతి కొలువు శ్రీ త్యాగరాజు స్వరపరిచిన కృతులలో ఒకటి. పంచరత్న కృతులకు అత్యంత ప్రసిద్ధి చెందిన త్యాగరాజ స్వామి, కర్ణాటక సంగీత గొప్ప స్వరకర్తలలో ఒకరు. బంటు రీతి కొలువు కృతి హంసనాదం రాగం, ఆది తాళంలో స్వరపరచబడింది.

మనము అలా పాడలేకపోయినా, కనీసము రామయ్యను తలచుకుందాము. ఎంతో మంది రామా/ దేవా మీకు సేవ చేస్తాము అని అల్లాడుతున్నట్లుగా పైకి కనపడతారు. కధలు చెపుతారు, కీర్తనలు పాడుతారు, దేవుని చిత్రాలు బొమ్మలు పంపుతారు, కానీ మానవ సేవ చేయరు. కానీ రామయ్యనే, అయోధ్య నుంచి లంక దాకా నడచుకుంటూ వెళ్ళి, ఎంతో మందికి జ్ఞాన బోధ ముక్తి మోక్షం కలిగించారు.

మరి మనము? తోటి మానవులకు నిస్వార్ధముగా సేవ ఏటూ చేయము. మరి కనీసం ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు సేవ చేస్తామా? కనీసం మన సంస్కార పిల్లలతో, మన ముదుసలి తనములో, సేవ చేయించుకునే సంస్కారం అద్రుష్టం, మనకు ఉందా? అబ్బే అసలు నోరు ఎత్తరు. అందుకే చిత్త శుద్ది లేని శివ పూజలేలరా అన్నది.

మనమూ రామా/ దేవా బంటు రీతి కొలువు ఈయవయ్య దేవా అంటే, ఒరే మానవా మొదలు నువ్వు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను వీడాలి. అంటే సజీవ గురువు సేవ చెయ్యాలి. దానికి యాత్రలు యాగాలు ఖర్చు సమయ దండగ వద్దు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నాకు నీ మానసిక నైవేద్యం, ఇది ఏ నాటికీ తరగదు.

నీకు ఇంట్లోనే ఆ అద్రుష్టము ఇస్తాను, 78+ ఏళ్ళ ముదుసలి అమ్మకు సేవకుడి లా ఉండి, నేల చాప పై నిద్ర పోతూ, మంచము పక్క నే రాత్రి పూట, 10+ ఏళ్ళకు పైగా ఉండాలి. 1 మరియు 2, ఎత్తి పోయాలి, తుడవాలి. కూరలు తరిగి ఇవ్వాలి, అంట్లు కడగాలి, ఇల్లు చిమ్మాలి, తుడవాలి, కార్పెట్టు దుమ్ము దులపాలి, మెతుకులు ఎత్తి అమ్మ తిన్న పళ్ళెం కడగాలి. అన్ని పసిబిడ్డకు చేసినట్లు చెయ్యాలి. పౌష్టికాహారము మంచి వైద్యం ఇవ్వాలి.

చేతి కర్రవై, రోజూ చెయ్యి పట్టుకుని మైలు నడపాలి. ఎందుకంటే, మనసు ప్రాణం లేని చేతి కర్ర, అమ్మ పడుతుంటే ఆపలేదు, రోడ్ మీద గతుకులు, జారుడు చూడలేదు. సాక్స్ బూట్లు వేయాలి, అన్ని చోట్లకు నీతో తిప్పాలి, అన్ని సౌకర్యాలు నీతో సమానముగా లేదా ఎక్కువగా ఇవ్వాలి. ఉత్తమ వైద్యం ఇవ్వాలి. ఆసుపత్రులకు ఎమర్జెన్సీ కి తిప్పాలి.

ఇంటి ఆయుర్వేదం నేర్చుకుని, రోగాన్ని అదుపులో ఉంచాలి. కంటికి రెప్పలా, సొంత 6 ఏళ్ళ కన్న కూతురులా చూడాలి. జుట్టు దువ్వాలి, ఊడిన జుట్టు ఏరాలి, రంగు వేయాలి, జడ కట్టాలి.

ఇవన్నీ చేయగలిగితే, నా సేవ చేసినట్లే, నీకు మోక్ష ఇస్తాను. మాత్రు పిత్రు దేవోభవ అని సాక్ష్యం ఉంది కదా. అలాగే నీకు మధ్యలో ప్రభుత్వ ఉద్యోగం/ ధనం/ పించను/ ప్రాపంచిక బ్రమలు కావాలా లేక తల్లి సేవ కావాలా, అని అగ్ని పరీక్ష కూడా పెడతాను. దేనిని వదులుతావో చూద్దాము, ఆ అరిషడ్వర్గ అష్టవ్యసన పరిస్తితిని ఎలా ఎదుర్కొంటావో అన్నారు. నీ స్తితప్రజ్ఞత వాక్సుద్ది చిత్తసుద్ది బయటపడుతుంది అన్నారు.

రామదాసు ఇంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. అన్నమయ్యా, ప్రహ్లాదుడు అంతే. భక్త కన్నప్ప కళ్ళు తీసి ఇచ్చారు. మరి నువ్వు, కనీసం ఈ సజీవ గురువు సేవ చేసి 10+ ఏళ్ళు, అందరికీ ఆదర్శముగా నిలబడగలవా? అన్నారు.

తక్కువేమి మనకు, ఆ సీతా రాముడు పక్క నున్నంత వరకు, అనుకున్నాము ఆనాడు 2014 లో. అది ఎలా జీవిత గమనాన్ని మార్చిందో, మీ ఎదురు ప్రత్యక్ష సాక్ష్యము ఉంది.

ఇంకొంతమంది ఇదంతా వ్రుధా ఖర్చు, సమయం దండగ, రేపు తెలియని వారి కంచి గరుడ సేవ ఎందుకు అన్నారు. వారు, అసలు మా వంశములో నే ఇలా చెయ్యము అని, తమ ప్రాపంచిక బ్రమలు లో మునిగి ఉంటారు. సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామ లేదా ఇతర మానవు ల లో దేవుని చూడలేని వారు, రాయిలో దేవుని చూడగలరా? దేవునికి మనసులో దేవాలయం కట్టగలరా? కనీసం భాగస్వామిని, పిల్లలను సంస్కారంగా చూడగలరా?

మరి మీరు కూడా, ముందు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను వీడాలి, మీ ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సేవ చేసి, మీ సంస్కార పిల్లల తో సేవ చేయించుకునే భాగ్యం కలగాలని ఆశిస్తూ, మీతో కలసి ఈ పాట/కీర్తన పాడుదాం/ ఆలపిద్దాము.

పల్లవి

బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు) 2

అనుపల్లవి
తుంట వింటి వాని, మొదలైన మదా- |
దుల గొట్టి, నేల గూల జేయు నిజ || (బంటు)

చరణం
రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వర ఖడ్గ మివి |
రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)

ఈ కీర్తనలో త్యాగరాజు తనకు కామ, క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు వంటి ఉద్యోగం) ఇమ్మని రామున్ని ప్రార్ధిస్తూ రామ నామమనే ఖడ్గాన్ని, రామభక్తుడనే ముద్రబిళ్ళను, రోమాంచమనే ఘన కంచుకమ (రామనామం తలవగానే ఆనంద పారవశ్యం తో ఒంటిపై నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు అనే కవచం) ఇవ్వమని అడుగుతున్నాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,009; 104 తత్వాలు (Tatvaalu) and views 265,983
Dt : 10-Jan-2024, Upd Dt : 10-Jan-2024, Category : Songs
Views : 414 ( + More Social Media views ), Id : 1986 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bantu , reeti , koluvu , Thyagaraja , Keerthana , Lord , Rama
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content