పాటతో పరమార్ధం- కలసి పాడుదాం తెలుగు పాట - బలిపీఠం - శోభన్ బాబు, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,945; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Balipeetam - Kalasi Padudam telugu pata - Shobhan Babu, Sharada

చూడండి, మన పెద్దలు ఎంత ముందు చూపుతో, మనకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలని, ఆత్మలు అన్ని ఒకటే అని, చాటాలని, అందరూ కలసి మెలసి ఒకరి కొకరు తోడుగా ఉండాలని, ఎంత బాగా రాసారో.

మరి మనము ఆ బాటలో ఉన్నామా? ఎవరికి వారు ఆత్మ విమర్శలు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితములో ఏదో ఒక సమయములో ఒంటరి వ్యక్తే, చుట్టూ 100 మంది ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా. సొంత ముదుసలి అమ్మా నాన్నల పైనే జాలి లేదు, సొంత భాగస్వామి పిల్లలపైనే దయ సంస్కారం సమయం లేదు. కేవలం స్వార్ధం అవసరం అవకాశం.

మగవాడెంతటి, ముసలాడైనా, మళ్ళీ పెళ్ళికి, అర్హత వుంటే? బ్రతుకే, తెలియని, బాల వితంతువుకెందుకు లేదా హక్క౦టాను అని మొదటగా వీరేశలింగం పంతులు గారే గళం విప్పారు. మరి మనలో జరుగున్న అన్యాయాలకు, మనకు నోరెత్తే ధైర్యం ఉందా? పోనీ నోరెత్తిన వారికి మనం అండగా ఉంటామా? దొంగల గుంపులో, దొంగ బుద్ది తో, దేవునికి పిల్లలకు భాగస్వామి కి కూడా విలువలేకుండా పతనం అవుదామా?

అదీ లేదు, పోనీలే మన మామ వెన్ను పోటు బాబాయి గుండె పోటు పార్టీనే గదా, 3 పంటల మాగాణి పోతే యేమి, కరోనా ఆసుపత్రి లేక హైదరాబాద్ పోతూ ఎంత మంది చస్తే ఏమీ, సింగపూర్ కి తాకట్టు పెడితే ఏమీ, మనము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాము, మన వారిని బతికిద్దాము అని ఒకరు.

ఎన్ని తప్పులు కేసులు ఉంటే ఏమీ, ఎన్ని కోట్లు ఎలా వచ్చాయో తెలీకపోతే ఏమీ, 50 గదుల ఇళ్ళు 10 ఉంటే ఏమి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, ఉచితాలు పంచుతూ తమ కుటుంబం పేరు వేసుకుంటే ఏమీ, పర్లేదు, మనము ఆ తానులో ముక్కలమే, మనకు అంత విదిలిస్తారు కదా, మనము మన పిల్లలు ఆ బానిసత్వములోనే పాదాలు వత్తుతూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ఆ అన్యాయములో మునిగి తెలుతూ, ధర్మాన్ని చంపుదాము అని ప్రతి ఒకరు. ఇలా ఉంది, మన జాతి ఇప్పుడు నిస్తేజముగా.

గురజాడ ధైర్యముగా చెప్పారు - మంచి చెడ్డలు, లోకమ౦దున, ఎంచి చూడగా, రెండే కులములు, అంతే కదా? మంచి యన్నది మాలయైతే, మాల నేనౌతాను అన్నాడు.

చెడ్డ వారు, తమ స్వార్ధం చూసుకుంటూ, తమ పతన గోతి ని తామే తీసుకుంటూ, అరిషడ్వర్గ అష్టవ్యసనం బానిసలు గా కాలగర్భములో కలసిపోతారు. మంచి వారు, చెడ్డ వారిని ఆ బానిసత్వం విడువమని, కోరుతూ తట్టి లేపుతూ ఉంటారు. కాబట్టి, మనము ఎన్ని కులాలు పైకి చెప్పుకుని నాశనం అయినా, ఉన్నది మంచి చెడు అనేవి 2 కులాలు మాత్రమే.

1)కలసి పా.డుదాం తెలుగు పా.ట.. కదలి సా.గుదాం వెలుగుబా.ట
తెలుగువా.రు. నవజీవన నిర్మాతలనీ.., తెలుగుజా.తి. సకలావనికే. జ్యో.తియనీ.
కలసి పా.డుదాం తెలుగు పా.ట.. కదలి సా.గుదాం వెలుగుబా.ట

2)కార్యశూరుడు వీరే.శలింగం., కలంపట్టి పోరా.డిన సింగం.
దురాచారాల దురాగతాలను, తుదముట్టి౦చిన, అగ్ని తరంగం..
అడుగో.. అతడే.. వీరేశలింగం.

మగవాడెంతటి, ముసలాడైనా, మళ్ళీ పెళ్ళికి, అర్హత వుంటే
బ్రతుకే, తెలియని, బాల వితంతువుకెందుకు లేదా.., హక్క౦టాను..

చేతికి గా..జులు, తొడిగాడు, చెదిరిన తిలకం. దిద్దాడు.....
మోడు వా.రిన, ఆడబ్రతుకుల, పసుపూ కుంకుమ, నిలిపాడు.. నిలిపాడు
కలసి పా.డుదాం తెలుగు పా.ట.. కదలి సా.గుదాం వెలుగుబా.ట

3) అడుగో.. అతడే.. గురజాడ..

మంచి చెడ్డలు, లోకమ౦దున, ఎంచి చూడగా, రెండే కులములు 2
మంచి యన్నది మాలయైతే, మాల నేనౌతాను.., మాల నేనౌతాను అన్నా.డు.....

కలసి పా.డుదాం తెలుగు పా.ట.. కదలి సా.గుదాం వెలుగుబా.ట
తెలుగువా.రు. నవజీవన నిర్మాతలనీ.., తెలుగుజా.తి. సకలావనికే. జ్యో.తియనీ.
కలసి పా.డుదాం తెలుగు పా.ట.. కదలి సా.గుదాం వెలుగుబా.ట

చిత్రం : బలిపీఠం (1975); సంగీతం : చక్రవర్తి; గీతరచయిత : శ్రీశ్రీ; నేపధ్య గానం : బాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,945; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003
Dt : 04-Jun-2023, Upd Dt : 04-Jun-2023, Category : Songs
Views : 401 ( + More Social Media views ), Id : 1772 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Song Spirit , Balipeetam , Kalasi Padudam telugu pata , Shobhan Babu , Sharada , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content