APLatestNews.com top Banner

Social Media links
అయ్యప్ప స్వామి - పదునెనిమిది మెట్లెక్కి, పదముల మ్రొక్కి, పరవశమవుదుము స్వామీ - Songs - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

చిన్నప్పుడు విడుదల అయిన సినిమా ఇది, అయ్యప్ప స్వామి మీద, అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఎప్పుడూ వినే, జేసుదాసు గారి హరిహరాసనం స్వామి విశ్వమోహనం పాట ఇందులోనిదే. ఎంతో మధురముగా ఉండే, ఈ పాటను వినండి, సినిమా చూడండి, ఆ భక్తుల తన్మయత్వాని చూస్తూ, శబరిమల యాత్రను చేసి రండి.

మండలము రోజుల దీక్షలతో, ఎంతో భక్తి నిష్టలతో, కఠిన నియమాలతో, ఆ హరి హర సుతుని సేవిస్తారో, మనకు అందరికీ తెలుసు. నేలమీద పడుకోవాలి, ఒకపూట అన్నము, పొద్దున్నె లెగిచి చన్నీళ్ళ స్నానం, బ్రహ్మచర్యం, ఎన్నో చేయాలి ఏలినాటి శని కి తగిన విధముగా.

మనది గార్ధభ స్వరమైనా, దేవుని మరియు తల్లి దండ్రులను కీర్తించడములో, కుటుంబ సభ్యులను మిత్రులను బంధువులను నవ్వించడములో తప్పు లేదు.

స్వామీ శరణం శరణము అయ్యప్ప, చిత్రం : అయ్యప్ప స్వామి (1975), సంగీతం : జి.దేవరాజన్, గీతరచయిత :, నేపధ్య గానం : బాలు

పల్లవి :
స్వామీ శరణం శరణము అయ్యప్ప, హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా, కరుణతో మమ్ము కావుము అయ్యప్ప - 2

చరణం 1 :
ముడుపులు కట్టి శిరమున దాల్చి
మ్రొక్కులు తీర్చెదమయ్యా... నీవే దిక్కని వేడెదమయ్యా.. 2
దర్శన మొందా.. ధన్యత పొందా తరలీ వచ్చెదమయ్యప్పా 2

అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా

అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..
స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం 3

స్వామియే.... శరణమయ్యప్పా.. శరణమయ్యప్పా.. శరణమయ్యప్పా.. ||స్వామీ శరణం||

చరణం 2 :
అళుకానదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి, నిండు భక్తితో గుట్టపై నుంచి 2
కరిమల చేరి.. కరములు మోడ్చి.., ఆనంద ముప్పొంగ పాడుదాం

అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా ||స్వామీ శరణం శరణము అయ్యప్ప||

చరణం 3 :
పంపను చేరి ఆశలు మీరి.. భక్తితో నిన్నే తలచి, నదిపై జ్యోతులనే వెలిగించి..

శబరి పీఠం చూసి శరముల గ్రుచ్చి.. నీ కీర్తి నెలుగెత్తి చాటుతాం 2
అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా ||స్వామీ శరణం ||

చరణం 4 :
ప్రతి ఏడాది మకర సంక్రాంతికి పావన సన్నిధి చేరి, నీదు దర్శన భాగ్యము కోరీ..2
పదునెనిమిది మెట్లెక్కి.. పదముల మ్రొక్కి, పరవశమవుదుము స్వామీ..2
అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా ||స్వామీ శరణం శరణము అయ్యప్ప||

స్వామీ శరణం శరణము అయ్యప్పా.. 2
హరిహర సుతవో పావన చరిత..2
భక్తమందారా భవ పరిహారా .. 2
కరుణతో మమ్ము కావుము అయ్యప్పా.. 2

స్వామీ శరణం శరణము అయ్యప్పా.. 2
స్వామియే... శరణం అయ్యప్పా 2
స్వామియే... శరణం అయ్యప్పా

Sample FB Song Link  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
Dt : 04-Jan-2021, Upd Dt : 04-Jan-2021, Category : Songs
Views : 115 ( + More Social Media views ), Id : 907 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : ayyappa swami , 18 steps , padamula mrokki , paravasam ,
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content