పాటతో పరమార్ధం- అరె ఏమిటి లోకం(పేరడీ) - అంతులేని కథ(మనందరిదీ)- జయప్రద, రజనీకాంత్, శ్రీప్రియ, కమల్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,302; 104 తత్వాలు (Tatvaalu) and views 226,508.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Are Emiti Lokam(Parody) - Anthuleni Katha - Jayaprada, Rajinikanth, Sripriya, Kamal

అరె ఏమిటి లోకం, పలు గాకుల లోకం అనడం చూచాం, మంచి వారి దగ్గర. తమ లోక క్షేమ సాధనలు చేస్తూ, ఎంత మంది నవ్వుతున్నా, పిచ్చివారు ముదుసలి తల్లి కి పెట్టే కోటితో, 2 ఇళ్ళు కొనవచ్చు, అప్పుతో వ్యాపారాలు చేయవచ్చు, అంటుంటే.

కానీ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు కూడా అదే అంటున్నారు. మా ఇష్టం అండి, ఎవరేమి అనుకుంటే మాకేటి, మాకు గుణ పెళ్ళి వద్దు, ధన ఆస్తి వీసా పదవి అధికార పెళ్ళి చాలు. ఉంటే 6 నెలలు/ ఏళ్ళు మోహ కాపురం ఉంటుంది, లేకపోతే సగం ఆస్తి వస్తుంది.

నీతులు గీతులు మాకు మా పిల్లలకు వద్దు, అసలు వాట్సాప్ లో తెలుగు రాయడం రాని, ముదుసలి తల్లి దండ్రుల ను అత్త మామ ను ఇంట్లో ఉంచలేని, విశ్వసనీయత మరియు క్రుతజ్ఞతలు లేని వంశం మాది, అంత మాత్రాన మేము జీవులం కాదా?

మేము ఐస్ లో పెట్టిన లేదా తాజా, జీవ హింస, జంతు శవాల మాంస, బిర్యాని తినొద్దా? ఊరికి 4 కపట భక్తి వ్యాపారాల కోసం, ఇతర మత బాబాయిని పూజించ వచ్చు కాని, వారి అబ్బాయి/ అమ్మాయి ని పెళ్ళి చేసుకోకూడదా, వయసు పరుగుల లేదా ఇంకో దాని కోసం?

ఇంట్లో కుటుంబం మొత్తము కలసి, లీగల్ గా దొరికే, ఐస్క్రీం పిజా తినకూడదా, కోక్ పెప్సీ వొడ్కా తాగకూడదా? ఆసుపత్రులకు రోగాలకు ఖర్చు పెట్టొద్దా? మా ఇష్టం మాది, మాకెవరు అండి జాలి దయ కరుణ సంస్కారం గురించి చెప్పేది, మా తిండి మా ధనం మా సంపాదన మా ఒళ్ళు మా కష్టం అంటున్నారు. కలి ప్రభావం అలాగే ఉంటారు 80 శాతం పైగా.

అందుకే, అరె ఏమిటి లోకం, పలు గాకుల లోకం, ముదుసలి తల్లి తండ్రి అత్త మామ మీద లేని, కపట మమతన్నది ఒట్టి పిచ్చి, వీసా ఆస్తి అధికారం కోసం అమ్ముడుబోయే, నటన మనసన్నది మరో పిచ్చి, కాబట్టి ప్రాపంచిక బ్రమలన్ని తోసి పుచ్చి, సాధనతో వాటిని ఎదిరించి, మానవత్వం ఉన్న మనిషిగా నిలబడాలి.

గాను గెక్కి తిరిగితే, కాశి దాక పోవునా? కాశి దాక వెళ్ళినా, కర్మలు మారుతున్నాయా? స్వార్ధం కొరకు పాటుబడితె, ఎల్లకాలం ఆ ఆస్తులు బంధాలు ఉండునా? అందరికీ వెలుగు ఇచ్చే దీపాన్ని చూచైనా, నేర్చుకో నిస్వార్థమూ. ఈ ఉన్న వయసు కాస్త పోయినాక, మనసున్నా వ్యర్థమూ? మనకు చూసే, నమ్మే దిక్కూ ఉండదు 100 మంది ఉన్నా.

మంచి మాట వినమంటే, రావణ ఆగలేదుగా? రావణ అక్కడాగివుంటె, తనకు పతనమే లేదుగా? పెద్దలు చెప్పిన, గీతలు నీతులు, దేవుడికి కాదులే, మన మానసిక బలం కోసం, మనము వేసుకున్న దోవలే. మరి ఆచరణలో చూపుదామా?

మరులు రేపు, వగలు సెగలు, మన్మధునీ లీలలు, కాదా? ఆ మన్మధుని లీలలకు, బానిసలము అయితే, సాధకులు పావులూ అవుతారు. ఈ కఠిన సాధనలన్ని, సృష్టి మనకు, ఇచ్చుకున్న పాచికలు. పాచికలు ఓర్పుతో నేర్పుతో పారినపుడె, మోక్షానికి గెలుపులూ, అంతేనా?

అరె ఏమిటి లోకం, పలు గాకుల లోకం..2
మమతన్నది ఒట్టి పిచ్చి, మనసన్నది మరో పిచ్చి
బ్రమలన్ని తోసి పుచ్చి, సాధనతో ఎదిరించి.. - 2 లైన్లు మొత్తము
అరె ఏమిటి లోకం, పలుగాకుల లోకం

గాను గెక్కి తిరిగితే, కాశి దాక పోవునా..
స్వార్ధం కొరకు పాటుబడితె, ఎల్లకాలం ఉండునా.. - 2 లైన్లు మొత్తము
దీపాన్ని చూచైనా, నేర్చుకో నిస్వార్థమూ
వయసు కాస్త పోయినాక, మనసున్నా వ్యర్థమూ ...
ఫటాఫట్ ||అరె ఏమిటి లోకం||

మంచి మాట వినమంటే, రావణ ఆగలేదుగా..
రావణ అక్కడాగివుంటె, పతనమే లేదుగా..
గీతలు నీతులు, దేవుడికి కాదులే
మానసిక బలం కోసం, వేసుకున్న దోవలే
ఫటాఫట్ ||అరె ఏమిటి లోకం||

మరులు రేపు, వగలు సెగలు, మన్మధునీ లీలలు..
మన్మధుని లీలలకు, సాధకులు పావులూ - 2 లైన్లు మొత్తము
సాధనలన్ని, సృష్టి మనకు, ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడె, మోక్షానికి గెలుపులూ
ఫటాఫట్ ||అరె ఏమిటి లోకం||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,302; 104 తత్వాలు (Tatvaalu) and views 226,508
Dt : 17-Sep-2023, Upd Dt : 17-Sep-2023, Category : Songs
Views : 327 ( + More Social Media views ), Id : 1919 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Are , Emiti , Lokam , Parody , Anthuleni , Katha , Jayaprada , Rajinikanth , Sripriya , Kamal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content