Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 నిమిష చదువు సమయం.
చూడండి సాక్షి దిన పత్రిక రాసిన వివరాలు కింద ఉన్న చిత్రములో. అవి చాల మంది పడుతున్న టాబ్లెట్ మందుల బాధలు.
అమెరికా లో డాక్టర్ కాగితం లేకుండా, మందు కొట్లో ఇవ్వరు గాక ఇవ్వరు. ఏమి జరిగినా అంతా పద్దతిగా జరుగుతుంది. లోపాలు ఉంటాయి, కానీ దొరికితే ఊరక వదలరు.
కానీ మన ఊళ్ళో డాక్టర్ కు డబ్బులు దండగ అని, చాలామంది నేరుగా షాప్ లో అడుగుతారు. వాళ్ళు చిన్న జబ్బు కు కూడా, పెద్ద మందు ఇస్తారు. పది సార్లు అవి వాడినాక, ఆ తర్వాత ఏ మందులు పని చేయవు. ఎందుకంటే మనము అత్యధిక శక్తి ఉన్న మందులు ముందే వాడేసాము చిన్న రోగానికి కూడా.
సరే పోనీ డాక్టర్ ని నమ్మి వెళదామా అంటే, డాక్టర్ కు మందులు కంపెనీ వాళ్ళ కు, మందుల షాపు వాళ్ళ కు ఉన్న లావాదేవీలు అందరికీ తెలిసిందే. బయట ఉన్న మా షాప్ లో కొంటే కొంచెము విషము, బయట షాప్ లో కొంటే మొత్తము విషము అన్నట్టుగా ఉంటుంది పరిస్తితి. కొన్నామో లేదొ తెలుసుకోవటానికి, మరలా వచ్చి చూపియ్యమంటారు కొందరు. చిన్న జబ్బు కు డాక్టర్ దగ్గరకు వెళ్లినా, కనీసం వెయ్యి రూపాయల పరీక్షలు, 2 వేలకు పైగా మందులు. నాలుగు సార్లు రావాలి.
షాప్ వారైనా లేదా డాక్టర్ అయినా, ఒక మందు పని చేయకపోతే ఇంకో మందు, ఇలా మార్చి మార్చి మనతో ఆడుకుంటారు. మనం పోయిన దాకా లేదా డబ్బు పోయి రోడ్డు మీద పడిందాక, ఈ తంతు సాగుతూనే ఉంటుంది. ఒక సారి రోగానికి దొరికి, హస్పిటల్ లో పడ్డామా, ఇక మన ఆస్తులు వారికి రాసేయచ్చు లేదా అవే కరిగిపోతాయి.
పోనీ నేను మంచి వాడినా, అదీ లేదు రోడ్డు మీద ఏ గడ్డి చూసినా నాలుక లాగుద్ది, రుచి తిండి కోసము. హోటల్ కల్తీ భోజనం, మందు, కూల్ డ్రింక్, మాంసం, బజ్జీ, దోశ, బేకరీ, . . . అదో పెద్ద లిస్ట్
పోనీ అధికారులను అడుగుదామా, అబ్బే మన మాట ఎవరు వినరు. ఎందుకంటే, మనము ముందే మన వర్గ, కుల నాయకునికి 2 వేల పూలకి అమ్ముడు పోయాము.
తప్పు ఎవరిది రామా? బహుశా ఎవరిదీ కాదు. అందరం స్వార్థం కోసం, మనకి లేదా ఇంకొకరికి ఎంత కీడైనా చేస్తాం. ఓ మనిషి, మన నాశనం మనమే చేసుకుంటూ ఉన్నాము.
ముందు గొయ్యి, వెనక నుయ్యి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఊరికే అనలేదు.
అని అనుకుంటూ వెళుతున్నాడు రాఘవయ్య తనలో తాను గొణుక్కుంటూ.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
Dt : 12-Sep-2019, Upd Dt : 12-Sep-2019, Category : News
Views : 473
( + More Social Media views ), Id : 163
, State : AP/ Telangana (Telugu)
, Country : India
Tags :
bad habits ,
Antibiotics medicine ,
over usage
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments