Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. పెళ్ళి దేనికో చాలామందికి తెలీదు, కేవలం ఆస్తులు వీసా పదవులు ధనం సుఖాలు సౌకర్యాలు కోసం మాత్రమే అని వారి ఉద్దేశ్యం. పెళ్ళి అంటే సీతా రాములు గా, లవకుశలు వంటి ఉత్తములకు జన్మలను ఇచ్చి, ధర్మాన్ని పెంచి, ప్రపంచాన్ని శాంతముగా ఉంచడం అని వారికి తెలీదు.
సంసార సాగరాన్ని ఈదడమంటే, చాల కష్టమని, గ్రుహస్తు ధర్మాలు చాలా ఉన్నాయి అని సమాజం కోసం, ఇతరుల కోసం అవి సహకరిస్తూ పనిచేస్తాయి అని వీరికి తెలీదు. కేవలం స్వార్ధం కోసమే సంసారం అని అనుకుంటారు.
ఈ బంధాలలో పెనవేసుకుని, ఎన్నో తప్పులు చేస్తూ, ఎన్నో పాపాలు మూటగట్టుకుంటూ, మనశ్శాంతికి దూరము అవుతారు.
మరి ప్రాపంచిక బంధాలను విడవకుండా, పరమాత్మ వైపు ఎలా ప్రయాణిస్తాము అంటే, వీరి దగ్గర సమాధానము ఉండదు. ఎందుకంటే, పైకి మాటలలో కైవల్యము అంటారు గాని, ఈ శారీరక సుఖాలను వదలలేరు.
పోనీ క్రుతజ్ఞత విశ్వసనీయతతో ముదుసలి తల్లి దండ్రుల బంధం ఉంచుకుంటారా అంటే, అదీ లేదు, వారిని దూరముగా ఒంటరిగా లేదా ఆశ్రమములో వేస్తారు, తమ పిల్లలతో పాటు సమాన సౌకర్యాలు ఇవ్వకుండా. అంటే కేవలం అవకాశ అవసర బంధాలకే విలువ ఇస్తారు.
సంసారములో ఉన్నాకూడా, మడుగు లోని తామరాకు కు నీటి బొట్టు ఎలా అంటుకోదో అలా ఉండాలి అని వీరికి తెలీదు, తెలిసినా మానసిక నియంత్రణ ఉండదు.
నిగమ, నిగమాంత వర్ణిత, మనోహర రూప..
నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా - చిన్నగా
నిగమ, నిగమాంత వర్ణిత, మనోహర రూప
నగరాజ ధరుడా, శ్రీ నారాయణా..
నారాయణా, శ్రీమన్నారాయణా..
నారాయణా, వేంకట నారాయణా....
దీపించు, వైరాగ్య, దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా, నన్ను నొడబరపుచు
పైపై..
పైపైన.. సంసార బంధముల కట్టేవు,
నా పలుకు చెల్లునా, నారాయణా... - 2 సార్లు మొత్తము
నిగమ.. గమదని సగమగసని
నిగమ, నిగమాంత వర్ణిత, మనోహర రూప
నగరాజ ధరుడా, శ్రీ నారాయణా..
నారాయణా, శ్రీమన్నారాయణా..
నారాయణా, వేంకట నారాయణా....
నీసా.. గస గస గస గసగా
దని సగమగసగమగ సనిదస నీసాదా
సగమ గమగ మదని దనిస
మగసనిదమగసా
వివిధా నిర్భంధముల..
వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయక నన్ను
భవసాగరముల, దడబడజేతురా...
దివిజేంద్రవంధ్య, శ్రీ తిరువేంకటాద్రీశా..
హరే.., హరే.., హరే..
దివిజేంద్రవంధ్య, శ్రీ తిరువేంకటాద్రీశా..
నవనీతచోర, శ్రీ నారాయణా . . .
నిగమ.. సగమగసనిదమగని..
నిగమ.. గసమగదమనిదస
నిగమ, నిగమాంత వర్ణిత, మనోహర రూప
నగరాజ ధరుడా, శ్రీ నారాయణా..
నారాయణా, శ్రీమన్నారాయణా..
వేద నారాయణా.. వేంకట నారాయణా
తిరుమల నారాయణా.. కలియుగ నారాయణా
హరి హరి నారాయణా.. స్వామి నారాయణా
లక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Annamayya Nigama Nigamanta varnita Nagarjuna Suman Ramyakrishna Kasturi
Singers : Balu, K. S. Chithra; Movie : Annamayya; Music : M. M. Keeravani; Actors : Akkineni Nagarjuna, Suman, Ramya Krishna, Kasthuri; Lyricist : Annamayya
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,792; 104 తత్వాలు (Tatvaalu) and views 256,774 Dt : 16-Oct-2022, Upd Dt : 16-Oct-2022, Category : Songs
Views : 585
( + More Social Media views ), Id : 1584 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
annamayya ,
nigama ,
nigamanta ,
varnita ,
nagarjuna ,
suman ,
ramyakrishna ,
kasturi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments