పార్లమెంటరీ పరిధి, ఎంపీ మరియు ఎమ్మెల్యే లారా, 2 ఏళ్ళు గా ప్రజలకు న్యాయం చేస్తున్నారా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇది మీ పార్లమెంట్ ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యేలకు కూడా, కొందరికి మేము పంపినా, మిగతా వారికి మీరు పంప గలరు. జగనన్న ఆశయాలను నెర వేర్చే విధముగా గుర్తు చేయగలరు.

నీతి నిజాయితీ నిబద్దత గలిగి ఉన్న, బాపట్ల (లేదా మీ) పార్లమెంటరీ పరిధి, ఎంపీ మరియు అస్సెంబ్లీ ఎమ్మెల్యే లారా, మీరు గత 2 ఏళ్ళు గా ప్రజలకు న్యాయం చేస్తున్నారా? పోనీ కనీసం, మీకు సీట్లు ఇచ్చిన, మీ పార్టీ పెద్దలకు అంటే జగనన్న కు కానీ చంద్రన్న కు కానీ మంచి చేస్తున్నారా?

గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరు, ఈ ప్రశ్నలకు జవాబులు. మీకు మీ పార్టీ మీద గౌరవం శ్రద్ద ఉంటేనే, మీ మీద మీ పనుల మీద, మీకు నమ్మకము ఉంటేనే సుమా. లేకపోతే, మిగతా వారిలా, గమ్ము గా ఉండవచ్చు, జవాబు లేకుండా, కోపము వద్దు.

ఎందుకంటే, మీ జవాబులు ఏవైనా గానీ, మీ అధిష్టానము కూడా, మీ వినయము సంస్కారం ప్రజల పై ప్రేమ ను, ఆసక్తి గా వింటుంది, మరువద్దు దయచేసి.

ఎందుకంటే, మీ నిర్లక్ష్యానికి నష్టపోయేది, మొదట గా మీరే, తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న మీ వారసులు, తర్వాత మీ పార్టీ, ఆ తర్వాత మిమ్మల్ని నమ్మిన అమాయకపు ప్రజలు.

తెదేపా కు జరిగిన ఘోర అవమానం చూసాం మొన్న, మనము రేపు అలా ఉండకూడదు కదా?

మనము ఏ పార్టీ లో ఉన్నా, మన ఆత్మాభిమానము, మన పనులు, మన మంచి తనం, మన వెంట నడవాలి. మన విలువను బట్టి, మన పార్టీకి విలువ పెరగాలి.

ఉదాహరణకు, తాడిపర్తి జేసీ లు (తెదేపా), ధర్మవరం కేతిరెడ్డి (వైసీపీ), రాజమండ్రి ఎంపీ భరత్ (వైసీపీ), తెలంగాణా సీతక్క. వారి బ్రాండ్ వారిదే, జనము లో కలియ తిరుగుతారు, పెద్ద గొంతు తో స్పష్టము గా చెపుతారు, ఏ పార్టీ లో ఉన్నా.

అధిష్టానం కూడా, వారిని గౌరవిస్తుంది, నటన దాంకోవడము ఉండదు, చాటు ద్రోహము ఉండదు, ఆత్మాభిమానం చంపుకుని.

అంతే గాని, పార్టీని లేదా నాయకుని బట్టి మనకు విలువ వస్తే, మనకు రూపాయ విలువ లేనట్టే. ప్రజలకు ఎటూ పనికి రాము, ఎందుకంటే ఆత్మ విశ్వాసము నిబద్దత లేనట్టే కదా, మనకు.

ఒకవేళ ముందు మనకు విలువ లేకపోయినా, దైవ అవకాశం వచ్చిన ఈ 2 ఏళ్ళలో కూడా విలువ సంపాదించుకో లేకపోతే, మనము దండుగ.

ఎలా పేరు తెచ్చుకోవాలో కూడా, 2 ఏళ్ళు గా, మీ లో కొంతమందికి, ఇతర మంచి ఎమ్మెల్యేల గురించి, వారి పనులు గురించి, చాలా కధనాలు పంపాము. సమయం దొరికి చదివారో లేదో తెలీదు.

ఉదాహరణకు, బాపట్ల పార్లమెంట్ తీసుకుందాము. కానీ అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకు దాదాపు ఇవే ప్రశ్నలు, సొంత పార్టీలు మరియు ప్రజలు కూడా అడగాలి.

1. Vemuru - Merugu Nagarjuna (YCP) - వేమూరు, నాగార్జున
2. Repalle - Anagani Satya Prasad (TDP) - రేపల్లె, అనగాని
3. Bapatla - Kona Raghupathi (YCP) - బాపట్ల, కోన
4. Parchur - Yeluri Sambasiva Rao (TDP) - పర్చూరు, ఏలూరి
5. Addanki - Gottipati Ravi (TDP) - అద్దంకి, గొట్టిపాటి
6. Chirala - Karanam Balaram (TDP) (Jump to YCP) - చీరాల, కరణం
7. Santhanuthalapadu - TJR Sudhakar (YCP), సంతనూతలపాడు సుధాకర్

మీ అందరికీ ప్రశ్నలు :

1. మీరు 2 ఏళ్ళు గా, మీ అస్సెంబ్లీ అభివ్రుద్ది కోసం, ఇప్పుడు కే పోరాడి తెచ్చిన లేదా ఇంకా పోరాడుతూనే ఉన్న విషయాలు, వాటి వివరాలు, మీ ఫేస్బుక్ లో ఉన్నాయా? 2 ఏళ్ళ అభివ్రుద్ది కార్డు ఉందా?

తెదేపా వారికి, 2 ఏళ్ళ అడిగిన సమస్యల కోరిన అభివ్రుద్ది కార్డు ఉందా?

2. చీరాల కరణం గారి లాగనే, మీరు కూడా, కనీసం 15 రోజులు అస్సెంబ్లీ నియోజక పరిధిలో, ప్రజలకు అందుబాటులో ఉండరా?

ఒకవేళ లేకపోతే, మీ జీతములో, నెలకు 3 రోజులు ఉంటే, మిగతా 27 రోజుల జీతం, సీయెం సహాయ నిధికి ఇచ్చారా, నీతి నిబద్దత తో?

3. ధర్మవరం ఎమ్మెల్యే, కేతిరెడ్డి గారు, వార్డుల వెంట తిరుగుతూ (ఎన్నికలప్పుడు కాకుండా), అధికారులతో కలసి, జనాల వెంట పడుతూ, వారి సమస్యలను, అప్పడు కప్పుడే, అధికారులతో చర్చించి, పరిష్కరించే ప్రయత్నము చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ రచ్చబండ తో జనాలను అధికారులను కలుస్తున్నారు.

జగనన్న కీర్తి పెంచుతున్నారు. జగనన్న రాజ్యం లో, ఉత్తమ ఎమ్మెల్యే గా నిలిచారు. లింక్ పంపాము గతములో.

మరి మన ఎమ్మెల్యేలలో అలాగే ఎంపీ గారు, అలాంటి పని చేస్తూ, వార్డులలో తిరిగే దమ్ము ధైర్యం ఒక్కరికైనా ఉందా? ఫేస్బుకు సాక్ష్యం ఉందా?

అలా తిరగకపోతే, మీకు భయం ఎందుకు? మీరు ఎందుకు అలా తిరగరు?

తెదేపా వారు కూడా, తిరిగి, ఈ సమస్యలు, అధికారులు తీర్చడము లేదు అని, రోజూ ఎందుకు పోస్ట్ లు పెట్టరు. ఇప్పుడు అయినా మొదలు పెడతారా?

4. మీకు కరోనా వస్తే, గతము లో లేదా ఇప్పుడు, మీ స్థానిక లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యం చేయించుకున్నారా? ఎందుకంటే, ప్రభుత్వ ఆసుపత్రి బాగుంది అని మీరే సర్టిఫై చెయాలి కదా, అక్కడ వైద్యం తో.

కనీసం రాష్ట్రం లోప లనే వైద్యం పొందారా, బాపట్ల ఎమ్మెల్యే లా? ఎందుకంటే మీరు బయటకు వెళితే, జగనన్న ను అలాగే 20 ఏళ్ళ చంద్రన్న అభివ్రుద్ది ని అవమానించినట్లే కదా.

మీ ప్రభుత్వ ఆసుపత్రి కి ప్రతి నెల వెళ్ళి, అంతా బాగుంది అని, మీరు పెట్టిన ఫోటోలు, ఫేస్బుక్ లో ఉన్నాయా?

5. మన ఎంపీ గారు, మన పరిధిలో నివసించడం లేదు, అలాగే ప్రతి నెలా, ప్రతి అస్సెంబ్లీ ప్రాంతము లో తిరగడము లేదు, ప్రజలకు అందుబాటు లో లేరు అని మీకు తెలుసా?

జగనన్న తో మరియు అధిష్టానము నాయకుల తో, ఈ విషయం చెప్పారా?

పార్లమెంట్ లో, మన అభివ్రుద్ది గురించి ఎందుకు అడగరు, మౌనము గా ఎందుకు ఉంటారు, అని నిలదీశారా? వీటికి ఫేస్బుక్ లో సాక్ష్యం ఉందా?

6. జగనన్న 3 రాజధానుల సిద్దాంతము, మన కొత్త జిల్లాల ప్రక్రియ లో పాటిస్తున్నారా? మరి మీ అస్సెంబ్లీకి ఎన్ని జిల్లా శాఖలు తేవడానికి లేదా జిల్లా కేంద్రం తేవడానికి, ప్రయత్నాలు ధర్నాలు దీక్షలు చేసారు?

ఫేస్బుక్ సాక్ష్యం ఉందా? బాపట్ల ఎమ్మెల్యే అందరిని కలిసి ఒప్పించే ప్రయత్నం చేసారు, మరి మీరు అందరినీ కలిసారా?

7. మీరు పార్టీ మారి దూకి లేదా అధికార పార్టీ లో ఉండి, అందరికన్నా ఎక్కువ సాధించింది ఏమిటి, ఈ 2 ఏళ్ళలో?

ఉదాహరణకు, చీరాల కరణం గారు, ప్రాంత అభివ్రుద్ది కోసం ప్రజల సంక్షేమం కోసం, చేతులు పట్టుకుని, నన్ను పార్టీ దూకమని బాలినేని గారు ప్రాధేయపడ్డారు. అందుకు బహుమతి గా, చీరాల జిల్లా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్ ఇస్తామని మాట ఇచ్చారు అనవచ్చు.

ఇలా ఏవైనా మీరు సాధించినవి లేక హామీలు ఉన్నాయా? లేకపోతే, ఎందుకు దూకారు? ఎందుకు మీ వారసులకు నష్టం చేస్తున్నారు, కుటుంబ చరిత్ర విశ్వసనీయత పోగొట్టి?

బాపట్ల ఎమ్మెల్యే, మెడికల్ కాలేజీ మరియు బెంచ్ కోర్ట్ చూపించిన విధముగా, మనకు ఎమైనా మంచి పెద్ద పనులు చేసినవి తెచ్చినవి ఉన్నాయా?

8. మీరు చేసిన అభివ్రుద్ది గురించి మీరు చెప్పలేని పరిస్థితి లో ఉంటే, మరలా మీకు పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వాలి?

ప్రజలను మోసము చేసిన మిమ్మల్ని ఎందుకు, ప్రజలు మరలా గెలిపించాలి?

మీ వారసులు ఏమి చెప్పుకుని, ఎదుగుతారు భవిష్యత్ లో?

9. జగనన్న పధకాల అమలు తీరును లేదా మీ అధికారుల సమీక్షల తీరును, సోషల్ మీడియా లో పెట్టమని, జిల్లా, పట్టణ, గ్రామ అధికారులను మీరు కోరారా?

మిమ్మల్ని గౌరవించి, ఎవరైనా పెట్టారా? మీరు అధికారులను కోరింది, వారు పెట్టినదానికి సంతోషం లేదా పెట్టనిదానికి నిరసన తెలియజేసినదానికి ఫేస్బుక్ సాక్ష్యం ఉందా?

గుంటూర్ కలెక్టర్ గారు సోషల్ మీడియా లో పధకాల అమలు పెడుతుంది మాకు తెలుసు. మరి ప్రకాశం కలెక్టర్ గారు పెట్టలేదు, అని అడిగారా? వారు కాకుండా, మిగతా అధికారులు ను అడిగారా?

ఈ 2 జిల్లాల కలెక్టర్లను, అనంతపురం కలెక్టరు, సంవత్సరం పైగా, జిల్లా అధికారుల తో, సోషల్ మీడియా నడుపుతూ ఉంటే, మనము ఎందుకు నడపలేక పోయామని, మనకు జగనన్న ఏ సౌకర్యాలు తక్కువ చేసారు అని, గట్టి గా అడిగారా?

10. రాష్ట్రం మొత్తము మీద, మీరు ఉత్తమ ఎమ్మెల్యే లేదా ఎంపీ అనడానికి, మీరు చేసిన పనులు, ఫేస్బుకు సాక్ష్యం గా ఉన్నాయా?

మీ గురించి పదిమందికి, పార్టీల అధిష్టానానికి మంచిగా చెప్పె, సదావకాశం మాకు కల్గించమని ప్రార్ధన.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 02-Jun-2021, Upd Dt : 02-Jun-2021, Category : Politics
Views : 136 ( + More Social Media views ), Id : 1188 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , parliamentary , mp , mla , bapatla , chirala , ongole , jagan , public , justify
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content