రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితికి పనితనానికి, చీరాల నియోజకవర్గం ఒక చక్కని ఉదాహరణ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1201 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1231 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

బాపట్ల కు ఆర్టీసీ లో డైవింగ్ స్కూల్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, కోర్టు వచ్చింది.

చీరాల నాయకుల సమాధానం? మాకు మరియు మా జనాలు కు, అవసరం లేదు అవన్నీ. అభివృద్ధి పధకాలు పేరు ఎత్తితే, మాకు శాపాలు వస్తాయి అని అందరి మాట. ఎమ్మెల్యే లేదా మాజీ అంటే, అభివృద్ధి అనే ఒక్క మాట తప్ప, ఏదైనా మాట్లాడతాం సవాల్ చేస్తాం.

20 రోజులు నడక యాత్ర చేయమంటారా? వేయి మందితో చేస్తాం. జగనన్న చంద్రన్న కోసం ప్రాణం ఇవ్వమంటారా? అనుచరులది ఇస్తాం. మరి చీరాల అభివ్రుద్ది కోసం? ఆ ఒక్కటి అడక్కు. ఓసోసి, చీరాల ఎక్కడ కు పోద్ది, ఏమీ అవసరము లేదు, రోగం ఎమర్జెన్సీ అయితే, 40 ఏళ్లుగా గుంటూరు కు వెళతాం, ఇప్పుడు అంతే కదా. దోవలో కార్యకర్తల ప్రాణాలు పోతాయి, పోనీ. 157,511 మంది 2019 లో వోటు వేసారు, మరి అభివ్రుద్ది గురించి పట్టించుకోరా?

చీరాల ప్రతిపక్ష టీడీపీ బిజెపి జనసేన ఫేస్బుక్ లో, స్ధానిక అభివృద్ధి సమాచారం, పై నాయకత్వం మార్పులు వివరాలు, ఉండ వంటే ఉండవు. మమ్మల్ని ఎవరూ మార్చలేరు, మా దొక వింత రాజ్యం.

ఎన్ని సార్లు చెప్పు, ఎన్ని కమిటీ లు వెయ్యనీ, ఊళ్ళో రాష్ట్రం లో ఏమైనా అవ్వనీ, మాకు అనవసరం. మమ్మల్ని అడిగే దమ్ము, పార్లమెంటు ఇంఛార్జి, జిల్లా ఇంఛార్జి, పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎవరైనా ఒకటే. మేం లెక్క చేయం, అడుగు ముందుకు వేయం.

రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి కి, ఈ చీరాల నియోజకవర్గం ఒక చక్కని ఉదాహరణ.

* వైసీపీ లో రెండు వర్గాలు, పోటీ పాదయాత్ర తో, ఫేస్బుక్ పేజీలు నింపేస్తున్నాయి, ఫోటోలు వీడియో ల తో. ఆమంచి వర్గం, గొంతు, జన సమీకరణ అధికం. వెంకటేష్ ప్రయత్నం బాగుంది, పెద్దాయన కరణం కనపడలేదు.

* టీడీపీ కొత్త కార్యవర్గం షుమారు 200 మంది తో, రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ చీరాల టీడీపీ పట్టించుకోదు. తన ఫేస్బుక్ లో రాయదు, ఫోటోలు పెట్టదు. వాళ్ళెవరో సంబరాలు, మా శాఖకు అవసరం లేదు.

ఎప్పుడూ లాగనే స్ధానిక సమస్యలు అభివృద్ధి, అసలు అనవసరం, వీరికి. లోకేష్ వచ్చినా, ఏలూరి వచ్చినా, ఇంకొకరు వచ్చిన కూడా అంతే. డోన్ట్ కేర్.

బాపట్ల పార్లమెంటు ఇంఛార్జి ఏలూరి గారి నియామకం, శుభాకాంక్షలు, తుదుపరి చర్యలు, ఎదీ ఏమీ కనపడవు.

వైసీపీ ని కానీ, కరణం గారిని కానీ, విమర్శలు ఎక్కడ కూడా కనపడితే ఒట్టు, 3 పార్టీలు సేమ్ పద్దతి.

* చీరాల బీజేపీ, కనీసం తమ నాయకురాలు పురందేశ్వరి గారు పదవి చేపట్టారు అని రాయాలంటే కూడా భయమే. వామ్మో మనం సొంతం గా, మన నాయకులు గురించి? ఓన్లీ పక్కన వారివి షేర్.

పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు పెట్టారు అంట. మరి వీరికి, ఇచ్చారో లేదో తెలీదు. ఆ విషయం కూడా రాయరు, తమ ఫేస్బుక్ లో.

ఉల్లి ధర్నా, పేద అగ్ర వర్ణ రిజర్వేషన్ ఫోటోలు ఇప్పుడు కీ పెట్టరు.

బీజేపీ జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ధైర్యం చెప్పదు, ముందుకు నడపదు. వీరన్న భయం వీరికి లేదు.

* చీరాల జనసేన, కనీసం సినిమా షూటింగ్ మధ్యలో పవనన్న మెట్రో రైలు లో వెళ్ళారు అనే ఫోటోలు కూడా పెట్టరు.

స్ధానిక అభివృద్ధి, సమస్యలు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పేరు తో, ఒక్క మాట రాయాలన్నా, ప్రజలకు ఉపయోగంగా, మనసు ఒప్పదు.

కాబట్టి వీళ్లంతా నిర్ణయం చేసేది ఏమిటి అంటే, పెద్ద అభివృద్ధి పనులు వద్దు. ప్రస్తుతం ఉన్నవాటితో సర్దుబాటు చేసుకుంటూ, ఇంకో కొత్త నాయకులు వచ్చిన దాకా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తో సర్దుబాటు చేసుకుందాం అని.

అర్థం అయిందా, చంద్రన్న లోకేష్, వీరన్న మోదీ, పవనన్న ల, యంత్రాంగం మంత్రాంగం, చీరాలలో పని చేయవు.

యధా ప్రజా, తధా రాజా అంటే ఇదేనా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1231 General Articles, 47 Tatvaalu
Dt : 06-Nov-2020, Upd Dt : 06-Nov-2020, Category : Politics
Views : 287 ( + More Social Media views ), Id : 795 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , opposition , bjp , tdp , janasena , situation , hardwork , chirala , example , chandranna , pavan , viranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content