అందాల రాముడు - ఎదగడానికెందుకు, పలుకే బంగార, మము బ్రోవమని, సమూహ భోజనంబు, రాముడేమన్నాడోయ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1487 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రామ భజన చేసిన పుణ్యం రావాలి అన్నా, జీవిత పరమార్ధం తెలియాలన్నా, ఇందులో ప్రతి పాట పాడి, దాని అర్ధం ఆస్వాదించి, దానిని ఆచరణలో పెట్టి, అరిషడ్వర్గాలను జయించాలి. ఆణిముత్యాలు లాంటి పదాలు, జీవితము లో పాటించవలసిన నియమాలను అన్నిటినీ ఏరి కూర్చిన మహా అద్భుత సినిమా ఇది.

అందాల రాముడు బాపు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, లత, నాగభూషణం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1973 నాటి తెలుగు చలన చిత్రం. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. బాపు రమణ ల అపూర్వ సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు.

అన్నిరకాల (మధ్య తరగతి మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు (మంచి బాలుడు), ప్రేమా (అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసరట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు, ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని, ఆ తాటితో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు.

మహదేవన్ సంగీతంలో మధుర గాయకులు రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.

తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన గోదావరి చిత్రంలో అందాలరాముడు ఛాయలు కనిపిస్తాయి.

ఎదగడానికెందుకురా తొందరా అన్న పాటలో, పిల్లలకు తొందర ఎందుకు, ఎదురు ఎన్నో కష్టాలు ఉన్నాయి అని చదువులు, ఉద్యోగాల పాట్లు చక్కగా వివరించారు.

పలుకే బంగారమాయేనా అన్న పాటలో, అన్నిటి కన్నా, రామ నామమే మధురమని నిరూపించారు, ఒక్కో ఉదాహరణ ఇస్తూ. లక్షాధికారులైనా అన్నమే తింటారు, బంగారం తినరు కదా. బిరుదులు పదవులు పరనారి మీద మక్కువ గలవారు, బూడిదౌతారు అని చెప్పారు. రామదాసు కీర్తనలను, సామాజిక సమస్యలు తీరుతో పోల్చి పాటగా మలచారు.

మము బ్రోవమని చెప్పవే అన్న పాటలో, పులి పులి కి, మెక మేక కు ఇబ్బంది లేదు కానీ, మనైషి ని చూస్తే, మనిషికే పడదు ఇదేమి మాయరోగమని, మన బుద్దులను, అభద్రతా భావాన్ని ఎత్తి చూపారు.

సమూహ భోజనం అన్న పాటలో, మనుషులకు దూరం ఎందుకు అని, ఉదాహరణలు ఇచ్చారు - దేవుడికి మొక్కునపుడు, హోటల్లో మెక్కినపుడు, రైళ్ళల్లో ఎక్కునపుడు, బస్సుల్లో చిక్కినపుడు, హెచ్చన్న మాటరాదు, తగ్గన్న మాట లేదు. అలాగే సహపంక్తి భోజనాన, కొంపేమి మునిగిపోదు అని తేల్చి చెప్పారు.

రాముడేమన్నాడు అంటూ, సామాజిక మరియు మానసిక సమస్యలు ఎత్తి చూపారు మనము సరి చేసుకోవడానికి, రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్, నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్. నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్. నీలో గల సైతానుని చంపమన్నాడోయ్.

ఇవి అర్ధము చేసుకుని ఆచరిస్తే, తప్పక అరిషడ్వర్గాలను జయిస్తాము సుమా.

1) సాహిత్యం: ఆరుద్ర, గానం: వి.రామకృష్ణ

ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా, ఏడుస్తే నీ కళ్లు నీలా.లు కారూ, జోజో జోజో... 2
ఎదగడానికెందుకురా తొందరా, ఎదర బతుకంతా చిందర వందర, జోజో జోజో... 2

చరణం: 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లు రా.., అవి కొనడానికి ఉండాలి నోట్లు రా..
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే ||ఎదగడానికెందుకురా||

చరణం: 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి, అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి, ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టు రా.., మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తు రా..
ఎండమావి నీకెపుడూ దోస్తురా .. అందుకే ||ఎదగడానికెందుకురా||

చరణం: 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే, ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము,
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో, పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా.., మంచి కాలమొకటి వస్తుంది నిండుగా..
అపుడు ఎదగడమే బాలలకు పండగా, అందాకా||ఎదగడానికెందుకురా||

జోజో జోజో... 2 టాటా టాటా... టాటా టాటా...

2) సాహిత్యం: ఆరుద్ర, గానం: యం.బాలమురళీకృష్ణ

పలుకే బంగారమాయెరా, అందాల రామ, పలుకే బంగారమాయెరా 2

ఖగరా.జ గమన నీవే, జగమూ.ల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని, జనులంతా సోదరులనే ||పలుకే||

చరణం: 1
లక్షా.ధికా.రులైనా లవణా.మన్నమే గాని
బంగా.రు కణికలు, మింగలేరను మంచి ||పలుకే||

చిన్ని నా బొజ్జకు, శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని అందరికుండాలనే.. ||పలుకే||

చరణం: 2
బిరుదులు పదవుల మీద, పరనా.రి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు, బూ.డిదై పొతాడన్న, ఎరుకే బంగారమాయెరా
అందాల రామ పలుకే బంగారమాయెరా

పంచదారను మించే, పా.లూ. మీగడల మించె
పరమ మధుర నామస్మరణే, మంచిదనే పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా 2

3) సాహిత్యం: ఆరుద్ర, గానం: వి.రామకృష్ణ

మము బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లీ, మము బ్రోవమని చెప్పవే.. 2
ఏకాంత రామయ్య, నీ చెంతగా చేరి, చల్లంగ నీ ముద్దు, చెల్లించు వేళ
||మము బ్రోవమని||

చరణం: 1
మీ.రూ ఈ. గోదారీ తీరా.న నడిచారు, కన్నీళ్ళు నవ్వూలు కలబోసుకు న్నారూ
ఆ కథను కాస్త గురుతు చేసు కొమ్మనీ.., మా కష్టాలు కాస్త చూసి పొమ్మని..
నువ్వ.యినా చెప్పవమ్మా.., రామయ్యకూ.., ఆ అయ్యకూ.. ||మము బ్రోవమని||

చరణం: 2
మా.. రాజులు మంత్రులు, మిమ్మడగ వచ్చేవారలే
మా.. బోటి దీనులు, మీ కడకు వచ్చేవారలే
ఇంతొ అంతొ, ముడుపు కట్టి, అంతటయ్యను మాయచేసి
లక్షలో మోక్షమ్ము కోరే, గడుసు బిచ్చగాళ్ళము, వట్టి పిచ్చివాళ్ళము
ఆదుకొమ్మని, పైకి చేదు కొమ్మని చెప్పవమ్మా, రామయ్యకు, మా అయ్యకు ||మము బ్రోవమని||

చరణం: 3
పులిని చూస్తే పులీ యెన్నడు బెదరదూ, మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగమదేమో గాని, మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ,
ఉన్నది పోతుందన్న బెదురుతో, అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ, కొండకెక్కేవాళ్ళము, మీ అండ కోరే వాళ్ళము

కరుణించమని చెప్పవే, మా కన్నతల్లి కరుణించమని చెప్పవే ||మము బ్రోవమని||

4) సాహిత్యం: కొసరాజు, గానం: వి.రామకృష్ణ

సమూహ భోజనంబు సంతోషమైన విందు..అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు 2

చరణం: 1
గోదారి గంగ నీరు, తాగేరు కలిసి మీరు, అంగట్లో అమ్ము బియ్యం, కొంటారు కలిసి మీరు 2
ఆ నీటితోటి బియ్యం, వండగనె వచ్చు కయ్యం 2
అబ్బా ఇదేమి న్యాయం, బహు చెడ్డ సాంప్రదాయం 2
ఈ గొణుగుచున్న ఘనులు, కడు మూర్ఖ శిఖామణులు ||సమూహ ||

చరణం: 2
అరె..హ ! ఆస్పత్రి మందులందు, అంటేమి కానబడదు, ఇస్కూల్లొ చదువునపుడు, పుస్తకము మైలబడదు 2
కాదప్ప అల్లాటప్ప, ఇహ చెల్లదు మీ గొప్ప 2
కాలమ్ము మారెనప్పా, ఓ వెర్రివెంగళప్పా..
ఆలోచనలను పెంచు, ఆవేశములను దించు ||సమూహ ||

చరణం: 3
దేవుడికి మొక్కునపుడు, హోటల్లో మెక్కినపుడు, రైళ్ళల్లో ఎక్కునపుడు, బస్సుల్లో చిక్కినపుడు 2
హెచ్చన్న మాటరాదు, తగ్గన్న మాట లేదు 2
సహపంక్తి భోజనాన, కొంపేమి మునిగిపోదు 2
కోపాలు సర్దుకోండి, సాపాటు పంచుకోండి ||సమూహ ||

5) గీతరచయిత : ఆరుద్ర, నేపథ్య గానం : రామకృష్ణ

రాముడేమన్నాడోయ్...సీతా రాముడేమ్మాన్నాడోయ్ 2
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్ 2 ||రాముడేమన్నాడోయ్||

చరణం 1 :మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్ - 2 సార్లు 2 లైన్లు
పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్ 2
పుణ్యమొక్కటే చివరకు మిగులునన్నాడోయ్... డొయ్ డోయ్ ||రాముడేమన్నాడోయ్||

చరణం 2 :మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్ అహా
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్ - 2 సార్లు 2 లైన్లు
గొప్పకొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్ 2
అప్పుచేసి పప్పుకూడు వలదన్నాడోయ్ ||రాముడేమన్నాడోయ్||

చరణం 3 :కొండమీద కోతులను కొనలేరోయ్ డబ్బుతో
బండరాతి గుండెలను మార్చెనోయ్ మంచితో
నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్ 2
కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్ ||రాముడేమన్నాడోయ్||

చరణం 4 :
రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్ - 2 సార్లు 2 లైన్లు
నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్ 2
నీలో గల సైతానుని చంపమన్నాడోయ్... డోయ్ డొయ్ డోయ్ ||రాముడేమన్నాడోయ్||

మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్ 2 ||రాముడేమన్నాడోయ్||

చిత్రం: అందాల రాముడు (1973), సంగీతం: కె.వి. మహదేవన్
andala ramudu - edagadanikendukura paluke bangarama mamu brovamani samuha bhojanam ramudemannadu  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 01-Jul-2022, Upd Dt : 01-Jul-2022, Category : Songs
Views : 81 ( + More Social Media views ), Id : 1448 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andala , ramudu , anr , latha , edagadanikendukura , paluke , bangarama , brovamani , samuha , bhojanam , ramudemannadu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content