Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Amma Nuvvokkasari - Maa Voori Maaraju - Soundarya, Arjun, Priya Raman, Smitha
నన్ను కని పెంచి పోషించి చదువు చెప్పించిన, మా బంగారు అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మ, నా గుండెచాటు బాధ నీకు చెప్పాలమ్మ, అని కనీసం 5 ఏళ్ళు సజీవ గురువు సేవ చేసిన పిల్లలు ఈనాడు, ఆనాడు బాధపడేవారు. ఎందుకంటే, ఆ కన్నతల్లి, పిల్లలకు సంస్కారం నేర్పింది, కనీసం ఒక్క బిడ్డ అయినా, ఆ రుణం తీర్చుకుంటారు.
మరి నేటి పిల్లలు, అమ్మ నాన్న చనిపోతే, సెలవు దొరకదు, జీతం కోతపడుతుంది, ప్రయాణ ఖర్చులు సమయం దండగ, అమ్ముడుబోయిన/ కొన్న భాగస్వామి ఒప్పుకోరు తోడురారు అని ఒక బాధ. పోనీ అవి వదులుకుని వస్తున్నా, ఆ నిర్జీవ శవం కొన్ని గంటలు, రోజుల పాటు నిరీక్షించాలి వారి రాక కోసం.
బతికున్నప్పుడు దగ్గర ఉంచి ప్రేమ గా ముద్ద పెట్టకపోయినా, చనిపోయాక కూడా ప్రశాంతం గా వెంటనే పోనీరు. మరి అది పిల్లలకు సంస్కారం నేర్పని తల్లి దండ్రులదా, లేక రాముడు ని క్రిష్ణుడుని పూజిస్తూ కూడా, ఆ మంచి లక్షణాలు నేర్చుకోలేని ప్రబుద్దులదా అంటే, ఎవరూ తమ తప్పు ఒప్పుకోరు.
తమ బుద్ది చెప్పేది కరోనా, త్సునామి, భూకంపం లాంటి పంచభూతాలే అంటారు. ఓటు కూడా, నక్క పాము పులికె వేసేది వీరంతా. మరి ఆవుకు లేదా నోటాకు, ఓటు వేయని ఫలితాలు, ఆ తల్లి బిడ్డలు అనుభవించవద్దా?
అమ్మ పాల లోన ఉన్న కమ్మనైన కొనలేని ప్రేమ, కుమ్మరించేనంట, మన చిన్ననాడే. ఆ రోజుల్లో గోరుముద్దల తోటి, కోటి ముద్దులు పెట్టి లాలిస్తూ, గుండె ఊయల చేసి సంతోషముగా, ఊపే నా తల్లి. నా ఖర్మకాలి, తన మమతంతా చేరింది నేడు ఆ కాటికి, ఎన్ని సామ్రాజ్యాలైనా సరి కావు ఆ అనంత ప్రేమకి. మరి దయగల ఏ దేవుడైన వచ్చి, నా బాధ గ్రహించి, మా అమ్మ ప్రాణమిచ్చి వెళ్ళడా? దేవా?
పసి గుడ్డు గా పేగు తెంచుకున్న, నాటి నుంచి ప్రేమ పంచుకున్న, అన్ని నాకు మా అమ్మే కదా అనుకున్న. కానీ జాలిలేని కాలం, గుండే లేని దైవం/ ఖర్మం, చేసెనయ్యో నన్ను మోసం, తీరే ఈ అమ్రుత బంధం. ఆ యమపాశానికే, ఇంత బలమున్నదా? మన పాశాన్ని, నిర్దయగా విడదీసి పోతున్నదా? మా బంగారు తల్లి అమ్మనిచ్చి, బ్రహ్మ రాత తిరిగి రాయడా?
ఇప్పుడైనా, ముదుసలి తల్లి దండ్రులు అత్తామామలను, దగ్గర ఉంచి సజీవ గురువు సేవ చేయండి. పంచభూతాల, ఏలినాటి శని శిక్షణలు తప్పించుకోండి. నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు.
పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.
అమ్మా, నువ్వు ఒక్కసారి, బతకాలమ్మ
నా గుండెచాటు, బాధ నీకు, చెప్పాలమ్మ
నువులే.వన్నది, కల కా.వాలమ్మా
ఈ కంటిపాప, రెప్పలేక, వుండలేదమ్మా..... అమ్మ అమ్మ అమ్మ..||అమ్మ, నువ్వు||
అమ్మపాల లో.న, కమ్మనైన ప్రే.మ, కుమ్మరించేనంట, చిన్ననాడే..
గోరుముద్దల తోటి, కోటిముద్దులు పెట్టి
గుండె ఊయలచేసి, ఊపే నా తల్లి
తన మమతంతా చేరింది, ఆ కా.టికి
సామ్రాజ్యాలే సరి కావు, ఆ ప్రేమ.కి
ఏ దేవుడైన, అమ్మ ప్రాణమిచ్చి వెళ్ళడా? అమ్మ... అమ్మ...అమ్మ... ||అమ్మ, నువ్వు||
పేగు తెంచుకున్న, ప్రేమ పంచుకున్న, అన్ని నాకు అమ్మే.. అనుకున్న,
జాలిలేని కాలం, గుండేలేని దైవం,
చేసెనయ్యో మోసం, తీరే ఈ బంధం,
యమపాశానికే, ఇంత బలమున్నదా?
మన పాశాన్ని, విడదీసిపో.తున్నదా?
మా అమ్మనిచ్చి, బ్రహ్మ రాత తిరిగిరాయడా? అమ్మ.. అమ్మ... అమ్మ...
* * *
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,324,056; 104 తత్వాలు (Tatvaalu) and views 252,334 Dt : 28-Mar-2024, Upd Dt : 28-Mar-2024, Category : Songs
Views : 406
( + More Social Media views ), Id : 2068 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Amma Nuvvokkasari ,
Amma Ninnokka Sari ,
Amma Nuvvokka sari ,
Amma Nuvvu okkasari ,
Maa Voori Maaraju ,
Maa Uri Maaraju ,
Soundarya ,
Arjun ,
Priya Raman ,
Smitha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments