పాటతో పరమార్ధం- అడుగడుగున గుడి ఉంది - ఉండమ్మా బొట్టు పెడతా - కృష్ణ, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,523.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Adugaduguna Gudi Undi - Undamma Bottu Pedata - Krishna, Jamuna

గుడి ఎక్కడ ఉంది, అంటే అక్కడ, మరి దేవుడు ఎక్కడ అంటే, అక్కడనే? అది మన పరిస్తితి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా, మనకు సంబంధము లేదు అనుకుంటారు. ఈ ప్రపంచమంతా, పంచభూతాలన్నిటిలో దైవం ఉన్నారు అంటే, నమ్మకము కుదరదు. ఎందుకంటే ముందు మన మీదే మనకు నమ్మకము లేదు. మనల్ని మనము తెలుసుకోము.

మాకు సాత్విక గుణములు వద్దు, కేవలము ప్రాపంచిక మోహాలలో మునిగే, రజో తమో గుణములే మేలు అనుకుంటారు. పాపాన్ని పోగుచేసుకుంటారు, తమకు తామే మోయలేనంత. దాని ఫలితము ముదుసలి తనములో లేదా రోగాన బారిన పడ్డాక, కొండంత భారము.

గుడి, బడి మనకు ఎలా సమాజములో ప్రవర్తించాలో నేర్పుతాయి. అవి సరిగ్గా మనసు పెట్టి నేర్చుకుంటే, అడుగడుగున గుడి ఉంది, మీలో మాలో. మనమంతా దేవుని ప్రతి రూపాలే. మరి ఇంక ఎవరిని మోసం చేసి 2 నాల్కల తో వ్యాపారం చేసి, ఆస్తులు సంపాదించి, వెన్నుపోటుకు చీత్కారాలకు పోవాలి, ఆసుపత్రులకు కేసులకు వెన్నుపోటు దారులకు అప్పచెప్పాలి?

మరి మనలో దేవాలయాన్ని, దేవుడిని చూడాలి అంటే ఏమి చేయాలి? ఇదిగో చక్కగా చెప్పారు. మన శనివారం సాధనలు కూడా ఇక్కడ అన్ని అక్కరకు వస్తాయి సుమా.

మనందరి ఇల్లూ వాకిలి, ఒళ్లూ మనసూ, ఈశుని, కొలువని పించాలి? మరి అలా ఉందా మన పరిస్తితి? ఎల్లవేళలా, మన మనసు, మంచు కడిగిన మల్లెపూవులా, ఉంచాలి? ఉంటుందా అలాగ ఎప్పుడూ, మనిషిని అవసరం అవకాశం బట్టి, 2 నాల్కలు గా ఉంటుందా, మనకే తెలుసు కదూ?

మనలో జ్ఞాన దీపం మరి మరి వెలగాలి, అజ్ఞానపు అనుమానపు అరిషడ్వర్గ అష్టవ్యసన, తెరలూ పొరలూ తొలగాలి - అంటే మరి నిత్య సాధన ఉండాలి. మొదలు పెడదామా, మరి?

తల్లీ తండ్రీ, గురువు పెద్దలు నే, మన పిల్లలు, కొలిచే దైవం అంటే మీరేమంటారు? అవునండీ అంటారు మాటల్లో, కానీ ముదుసలి తల్లి దండ్రులు/ అత్త మామలకు సమాన వైద్యం సౌకర్యాలు అంటే, తూచ్, మేము రాక్షస సంతతి, మాకు అలాంటి వి లేవు, వంశాన అంటారు, ఎక్కువ మంది నిజాయితీగా.

కల్లా కపటం, తెలియని పాపలే, మన తల్లులు, వలచే దైవం - పోనీ ఇదైనా నిజమేనా? అదీ లేదు, పిల్లలకు సంస్కారం నేర్పాల్సింది పోయి, ఉద్యోగం సంపాదన సినిమాలు షికార్లు కబుర్లు అంటూ, ఫోన్ లు చేతిలో పెట్టి, పిల్లలను హాస్టల్ లో దూరముగా వదిలేస్తున్నారు. ఇంట్లో ఉన్నా, పట్టించుకోరు తమ మోహపు పనులతో బిజీ, పిల్లల మానసిక స్తితి ని అంచనా వేసే, మానసిక బలం, ముందు మనకే లేదు.

మరి ఇక ప్రతిమనిషీ, నడిచే దైవం గా ఎప్పుడు మారతాము? ఎప్పుడు ఇతరులలో ఉన్న దైవాన్ని గుర్తిస్తాము? దీనికి, యాత్రలు, ఖర్చులు, బయట నేర్చుకోవడం కావాలా? మనకు ఇంగిత జ్ఞానం, పెంపక సంస్కారం లేవా? మరి ఈ చక్కటి పాటను పాడి, మా అందరికీ వినిపిస్తారా?

అడుగడుగున గుడి ఉంది
అందరిలో గుడి ఉంది - 2 సార్లు మొత్తము
ఆ గుడిలో.., దీపముంది
అదియే దై.వం.. - 2 సార్లు మొత్తము 4 లైన్లు

ఇల్లూ వాకిలి, ఒళ్లూ మనసూ
ఈశుని, కొలువనిపించాలి - 2 సార్లు మొత్తము
ఎల్లవేళలా, మంచు కడిగిన
మల్లెపూవులా, ఉంచాలి - 2 సార్లు మొత్తము
దీపం మరి మరి వెలగాలి..
తెరలూ పొరలూ తొలగాలి.. ||అడుగడుగున ||

తల్లీ తండ్రీ, గురువు పెద్దలు
పిల్లలు, కొలిచే దైవం - 2 సార్లు మొత్తము
కల్లా కపటం, తెలియని పాపలు
తల్లులు, వలచే దైవం - 2 సార్లు మొత్తము
ప్రతిమనిషీ, నడిచే దైవం..
ప్రతి పులుగూ, ఎగిరే దైవం..||అడుగడుగున ||

----దేవులపల్లి, సుశీల, మహదేవన్, ఉండమ్మా బొట్టు పెడతా (1968)  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,523
Dt : 14-Jun-2023, Upd Dt : 14-Jun-2023, Category : Songs
Views : 352 ( + More Social Media views ), Id : 1795 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Adugaduguna , Gudi , Undamma , Bottu , Pedata , Krishna , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content