పాటతో పరమార్ధం- ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే(పేరడీ)- మిథునం-బాలు, లక్ష్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,497; 104 తత్వాలు (Tatvaalu) and views 225,154.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aavakaya Mana Andaridi, Parody, Midhunam, Mithunam, SP Balu, Lakshmi

ఆరోగ్యకరమైన తిండి గలిగితే, కండ గలదని, గురుజాడ వారు అన్నారు. ఇంటిలోనే శుభ్రముగా వండిన శాఖాహారమే ఆరోగ్యానికి, ఎన్నో రెట్లు ఉపయోగము అని పెద్దలు ఎందరో సెలవిచ్చారు. ఆధ్యాత్మికతకు, మనశ్శాంతికి, చిరకాల ఆరోగ్యానికి శాఖాహారమే మంచిది. సాత్విక ఆలోచనలకు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణకు, సంస్కార పెంపకానికి కూడా.

బయట తిండితో, ఫాస్ట్ ఫుడ్ తో ప్రాణాలు తీసుకునే వారికి, ఈ పాట పంపుతారు, వినిపిస్తారు కదూ? వారి కుటుంబాన్ని కాపాడిన పుణ్యం మీదే.

అమ్మ లేదా భాగస్వామి లేదా స్వయం పాకంతో వండిన, ఆరోగ్యకరమైన తిండి మేలు. దానిని వదలి, బయట దొరికే ఏ తిండి అయినా, కల్తీలు కుళ్ళిపోయిన వాటితో మసాలా కలిపిన సద్ది వాటిని మరలా వేడి చేసి లేదా తొందరగా రోగం తెచ్చే ఫాస్ట్ ఫుడ్ లు పిజ్జాల్/ బర్గర్/ పాస్త/ ఐస్క్రీం తిని కోక్/ పెప్సి/ సోడా తాగి, ఆసుపత్రుల చుట్టూ అధిక బరువు ఖర్చు ఎక్కువ రోగాలతో తిరిగడం ఎందుకు, అని పెద్దలు అంటారు.

పేపర్లో ఎన్నో చూస్తుంటాము, మాంసం లో కల్తీ, హోటెల్ లో అపరిశుభ్రత, వాటిని ఆరోగ్య శాఖ అధికారులు మూయించడం. ఇవి కొన్ని మాత్రమే బయటకు వస్తాయి, రాని వి ఎన్నో.

ఆహారనియమం కు కట్టుబడే మనసు నియంత్రణ మనకు ఉందా? ఇదీ మన శనివారం పంపే సాధనలలో ఒకటి. మరి కనీసం ఇప్పటి నుంచైనా, మన మనసు మన మాట వింటుందా అని ప్రయత్నం చేస్తూ, రాబోయే రొగాలను అధిక ఖర్చులను బాధలను, అదుపు చేద్దాం.

మనం పోతే, పోతూ రోగాలకు సంపాదన ఖర్చు చేస్తే, ఇంట్లో వారు, మనం చేసిన అప్పులకు మరియు వారి మిగిలిన బతుకుకు, గో ఫండ్/ ఆన్లైన్ లో లేదా తెలిసిన వారి ఇళ్ళ వెంట చేతులు చాచే, ప్రయత్నం ముందే ఆపుదాము. మనకు పాపం తగ్గించుకుని, ఉత్తమ మరు జన్మకు పుణ్యం సంపాదించుకుందాము.

ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే. 2
ఎందుకు పిజ్జాల్, ఎందుకు బర్గర్, లెందుకు పాస్త లిన్కెందుకులే 2
ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే.
ఫాస్ట్ ఫుడ్ ల రోగాలతో, ఆసుపత్రి బాధలెందుకు లే

ఇడ్డెన్న లోకి కొబ్బరి చెట్నీ, పెసర్ట్టులోకి అల్లం రా.. 2
దిబ్బరొట్టెకి తేనె పానకం, దొరకకపోతె బెల్లము రా..2
వేడి పాయసం ఎప్పటికప్పుడె, పులిహోరెప్పుడు మర్నాడే 2
మిర్చీ బజ్జీ, నోరు కాలవలె, ఆవడ పెరుగున తేలవలే..
ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే.
ఫాస్ట్ ఫుడ్ ల రోగాలతో, ఆసుపత్రి బాధలెందుకు లే

గుత్తి వంకాయ కూర కలుపుకొని, పాతిక ముద్ధలు పీకుము రా..2
గుమ్మడి కాయ పులుసుందంటే, ఆకులు సైతం నాకును రా..
పనస కాయ నీకున్న రోజునె, పెద్ధలు తద్దినం అన్నారు.. 2
పనస పొట్టులో ఆవ పెట్టుకొని, తరతరాలుగా తిన్నారు
ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే.
ఫాస్ట్ ఫుడ్ ల రోగాలతో, ఆసుపత్రి బాధలెందుకు లే

ఆమె: తిండి గలిగితే కండ గలదని, గురుజాడ వారు అన్నారు
అప్పదాసు ఆ ముక్క పట్టుకొని, ముప్పూటలు తెగ తిన్నారూ
శాఖాహారమే ఆరోగ్యానికి, ఎన్నో రెట్లు ఉపయోగము
ఇంటిలోనే శుభ్రముగా వండి, తిని తిరగడమే మేలు - 2 సార్లు 2 లైన్లు

ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే. 2
ఎందుకు పిజ్జాల్, ఎందుకు బర్గర్, లెందుకు పాస్త లిన్కెందుకులే 2
ఆవకాయ మన అందరిది, గోంగుర పచ్చడి మనదే.లే.
ఫాస్ట్ ఫుడ్ ల రోగాలతో, ఆసుపత్రి బాధలెందుకు లే

Movie: Midhunam (2012); Music: Veena Pani; Lyrics: Tanikella Bharani; Singers: S. P. Balu, Swapna; S. P. Balu, Lakshmi

చిత్రం : మిథునం (2012); సంగీతం : స్వర వీణాపాణి; రచన : తనికెళ్ళ భరణి
గానం : ఎస్.పి.బాలు, స్వప్న; ఎస్.పి.బాలు, లక్ష్మి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,497; 104 తత్వాలు (Tatvaalu) and views 225,154
Dt : 06-Jun-2023, Upd Dt : 06-Jun-2023, Category : Songs
Views : 293 ( + More Social Media views ), Id : 1776 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aavakaya , Andaridi , Parody , Midhunam , Mithunam , Balu , Lakshmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content